“నెచ్చెలి”మాట 

మహిళాదినోత్సవం!

-డా|| కె.గీత 

సంవత్సరానికోసారి
గుర్తొస్తుందండోయ్!
మహిళలకో దినోత్సవమని!

అంటే
మహిళలకి
సెలవేదైనా…
కాస్త సాయమేదైనా….
ఉచిత బస్సు టిక్కెట్టు
తాయిలం లాంటిదేదైనా….

అబ్బే
అవేవీ కావండీ-

పోనీ
పొద్దుటే కాఫీ అందించడం…
ఆ వంటేదో చేసి పెట్టడం…
ఇంటిపని ఓ రోజు చూసిపెట్టడం…
వంటివేవైనా
కాకపోయినా


పూలగుత్తో

సినిమానో

షికారో

అబ్బేబ్బే
అంతంత ఆశలొద్దండీ-

మరేవిటో
మహిళా దినోత్సవమని
సంబరాలు!

అదేనండీ-
ఉచితంగా వచ్చే
వాట్సాపు మెసేజీలు
ఫేస్ బుక్ లైకులు
ఇన్స్టా గ్రాము ఫోటోలు

ఇంకా మాట్లాడితే
ఇంటర్నెట్లోంచి కొట్టేసే
కొటేషన్లు, కాప్షన్లు
అన్నమాట!

ఆచరణల్లో లేని
ఉత్తుత్తి శుభాకాంక్షలకే-
అంతంత మాత్రపు ప్రేమలకే
పొంగిపోతామే!

మరిక
నిజ్జంగా
మనశ్శరీరాలకి
ఊరట నిచ్చే
మహిళా దినోత్సవమేదో
ప్రతి ఇంటా
పండగలా జరిగితే
ఉబ్బి తబ్బిబ్బయిపోయి
సంవత్సరమంతా
డబల్ ఊడిగం
చేసేయ్యమూ!

****

నెచ్చెలి పాఠకులందరికీ సదవకాశం: 

          ప్రతినెలా నెచ్చెలి  పత్రికలో వచ్చే   రచనలు / “నెచ్చెలి” యూట్యూబ్ ఛానెల్లో వచ్చిన ఆర్టికల్స్ వేటిపైనైనా వచ్చిన కామెంట్ల నించి ప్రతి నెలా ఒక ఉత్తమ విశ్లేషణాత్మక కామెంటుని ఎంపిక చేసి  ప్రకటిస్తాం. పాత రచనల మీద కూడా కామెంట్లు చెయ్యవచ్చు. 

          మరింకెందుకు  ఆలస్యం? రచనల్ని చదివి వివరంగా కామెంట్లు పెట్టడం ప్రారంభించండి.  

          వినూత్నం, వైవిధ్యం ప్రధాన నిలయాలైన  “నెచ్చెలి” వస్తున్న వివిధ వినూత్న రచనల్ని తప్పక చూసి, చదివి ఆనందిస్తారు కదూ!

*****

ఫిబ్రవరి 2024 లో ఎంపికైన ఉత్తమ కామెంటు రాసిన వారు: అక్షర
ఉత్తమ కామెంటు అందుకున్న పోస్టు: అపరాధిని (కథ) – కోసూరి ఉమాభారతి
ఇరువురికీ అభినందనలు!

****

Please follow and like us:

2 thoughts on “సంపాదకీయం-మార్చి, 2024”

  1. డా.కె.గీత మేడం గారికి ముందుగా అభినందనలు. మహిళాదినోత్సవం సందర్భంగా మహిళల గురించి చక్కగా చెప్పారు మీ సంపాదకీయంలో.

    చివరి పేరాలో చెప్పిన “మహిళా దినోత్సవమేదో ప్రతి ఇంటా పండగలా జరిగితే ఉబ్బి తబ్బిబ్బయిపోయి సంవత్సరమంతా డబల్ ఊడిగం చేసేయ్యమూ!” చాలా బాగుంది మేడం.

  2. అదేనండీ- ఉచితంగా వచ్చే వాట్సాపు మెసేజీలు ఫేస్ బుక్ లైకులు ఇన్స్టా గ్రాము ఫోటోలు
    ఇంకా మాట్లాడితే ఇంటర్నెట్లోంచి కొట్టేసే కొటేషన్లు, కాప్షన్లు అన్నమాట! ఆచరణల్లో లేని త్తుత్తి శుభాకాంక్షలకే- అంతంత మాత్రపు ప్రేమలకే పొంగిపోతామే!
    ఎంత కరెక్ట్ గా చెప్పారండి! హ్యాట్స్ ఆఫ్ మాం!!

Leave a Reply

Your email address will not be published.