స్వరాలాపన-34

(మీ పాటకి నా స్వరాలు)

-డా||కె.గీత

మనందరికీ పాటలు వినడం ఇష్టం. మనలో కొందరికి విన్న పాటలు తిరిగి పాడడం ఇష్టం. మరికొందరికి ఆ పాటల్ని వివిధ వాయిద్యాల మీద పలికించడం ఇష్టం. అయితే అలా పలికించేందుకు అవసరమైన స్వరాలు తెలుసుకోవడం ఎలా? సాధారణంగా అవి గురుముఖత తప్ప అందరికీ లభ్యం కావు. నాకున్న జన్మతః వచ్చిన అనేకానేక ఇష్టాల్లో, కళల్లో విన్న ఏ పాటకైనా వెంటనే స్వరాలు కూర్చడం ఒకటి! నాకు తెలిసిన మిత్రులు ఇటువంటి కాలమ్ ఒకటి ఉంటే ఉపయోగకరంగా ఉంటుందన్న సలహా ఇవ్వడంతో అవి మీకూ ఉపయోగపడతాయని ఇక్కడ నెలనెలా ఇస్తున్నాను.

మీకు నచ్చి, నేర్చుకుంటే ఇక్కడ కామెంటులో తెలియజెయ్యడమే కాకుండా రికార్డు చేసి editor.neccheli@gmail.com ఈ-మెయిలుకి పంపండి. ఉత్తమమైన వాటిని ప్రచురిస్తాం. అంతే కాదు మీకు నచ్చిన సినిమా/ఏదైనా ప్రముఖ పాటకి (ఏ భాషైనా) స్వరాలు కావాలనుకుంటే కూడా ఈ-మెయిలు పంపండి. వరసవారీగా స్వరాలు ఈ కాలమ్ ద్వారా అందజేస్తాను.  మీరు ఇలా నేర్చుకున్న పాటల్ని యూట్యూబు, ఫేసుబుక్ వంటి సామాజిక మాధ్యమాల్లో పెట్టదలుచుకుంటే తప్పనిసరిగా ఆ పాట ప్రచురితమైన  నెచ్చెలి పేజీ లింక్ ని ఇస్తూ, నా పేరుని జత చెయ్యడం మరిచిపోకండేం!

***

రాగం: కల్యాణి రాగం 

Arohanam: S R2 G3 M2 P D2 N3 S
Avarohanam: S N3 D2 P M2 G3 R2 S

యా కుందేందు తుషార హార ధవళా యా శుభ్ర వస్త్రావృతా

రీగాగగాగ రిగారిగాగ గపరీగా నీరీరి  రీగారిసా 

యా వీణా వరదండ మండితకరా

గాపాపా గపపాప పాప మపమగా 

యా శ్వేత పద్మాసనా

గపాదాసా నిదపా మాపాగమాదపా 

యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిః దేవైః సదా వందితా

దాసాసాసస సాసస సాసాసస నీసా దనీరీ ససా 

సా మాంపాతు సరస్వతీ భగవతీ నిశ్శేష జాడ్యాపహా

నీనిసా నిదపా మపామపా మమపమగా నీరీరి  రీగారిసా 

శుక్లాం బ్రహ్మ విచారసార పరమాం ఆద్యం జగద్వ్యాపినీం

గాగగాగ రిగారిగాగ గపరీగా నీరీ రిగారిగారిసాసా  

వీణాపుస్తక ధారిణీం అభయదాం జాడ్యాంధకారాపహాం

గాపా పాపప పాపపా  పామపమగా  గపదసా నిదపపా మాపాగమాదాపపా 

హస్తేస్ఫాటికమాలికాం చ దధతీం పద్మాసనే సంస్థితం

దాసాసాసస సాసస సాసాసస నీసా దనీరీ ససా 

వందే తాం పరమేశ్వరీం భగవతీం బుద్ధిప్రదాం శారదాం 

నీనిసా నిదపా పపపామపా మమపమగా నీరీరిగా రీరిసా

 *****

*ఈ స్వరాలు వింటూ నేర్చుకోవడానికి అనువుగా కింద ఇవ్వబడిన “గీతామాధవీయం” టాక్ షో లో మూడవ భాగమైన “స్వరాలాపన” వినండి-

Please follow and like us:

2 thoughts on “స్వరాలాపన-34 (మీ పాటకి నా స్వరాలు)”

  1. గీతా మాధవీయం కాలమ్ ద్వారా రామ నవమి సందర్భంగా పలు పాటలు చక్కటి స్వరం లో పాడి, ఆపాటల వివరాలు ఇచ్చారు ,చాలా బావుంది. సరస్వతి దేవి వందనం కి ఇచ్చిన స్వరం చాలా ఉపయోగకరంగా ఉంది.

Leave a Reply

Your email address will not be published.