నెచ్చెలి అంతర్జాల వనితా మాస పత్రిక
అయిదవ వార్షికోత్సవ ప్రత్యేక సంచిక కోసం రచనలకు ఆహ్వానం!

-ఎడిటర్

నెచ్చెలి అయిదవ వార్షికోత్సవం (జూలై 10, 2024) సందర్భంగా ప్రత్యేక రచనలను తెలుగు, ఇంగ్లీషు భాషల్లో ఆహ్వానిస్తున్నాం. కథ, కవిత, వ్యాసం ప్రక్రియల్లో రచనలు స్వీకరించబడతాయి. ప్రతీ ప్రక్రియలోనూ ఎంపిక చెయ్యబడ్డ పది రచనలు ప్రత్యేక సంచికలో ప్రచురింబడతాయి. ప్రత్యేక సంచికకు ఎంపిక కానివి నెచ్చెలి నెలవారీ సంచికల్లో ప్రచురింపబడతాయి. ప్రత్యేక సంచికకు రచనలు పంపడానికి ఈ క్రింది నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి.

నిబంధనలు:-

1. కథ, కవితలకు ప్రధాన ఇతివృత్తం స్త్రీలకు సంబంధించినదై ఉండాలి. వ్యాసాలకు వస్తు నియమం లేదు.

2. వస్తువు, శైలి, ఎత్తుగడ, ముగింపులలో కొత్తదనానికి ప్రాధాన్యతని ఇచ్చే రచనలకు ప్రాముఖ్యత ఇవ్వబడుతుంది.

3. మీ రచన విధిగా యూనికోడ్ లో ఉండి వర్డ్ (లేదా) గూగుల్ డాక్ లో పంపాలి. రచన A4 లో పది పేజీలకు మించకూడదు.

4. రచనతో బాటూ విధిగా రచన మరెక్కడా ప్రచురితం కాలేదని, పరిశీలనకు పంపబడలేదని హామీ పత్రం జతచెయ్యాలి.

5. విధిగా మీ ఫోటో, ఒక పారాగ్రాఫులో మీ గురించి వివరాలు యూనికోడ్ లో రాసి జత చెయ్యాలి.

5. రచనలు చేరవలసిన చివరి తేదీ- జూన్ 20, 2024. గడువు తర్వాత చేరినవి పరిశీలనలోకి తీసుకొనబడవు.

6. ఒక్కొక్కరు ఒక ప్రక్రియకు ఒక రచన చొ||న అన్ని ప్రక్రియలకూ రచనలు పంపవచ్చు.

7. ఈ-మెయిలు మీద సబ్జెక్టు “నెచ్చెలి అయిదవ వార్షికోత్సవ ప్రత్యేక సంచిక-2024” కి అని రాసి editor@neccheli.com కు పంపాలి.

8. ఇంగ్లీషులో పంపే రచనలు అనువాదాలైనా కూడా స్వీకరించబడతాయి. మూల రచన, రచయిత వివరాలు, మూల రచన ప్రచురణ వివరాలు విధిగా జత పరచాలి. అనువాదాలు ఎక్కడా ప్రచురితం కాలేదని హామీ పత్రం జతపరచాలి. పైన తెలుగు రచనలకు ఇచ్చిన నిబంధనలు అన్నీ పాటించాలి.

9. ప్రత్యేక సంచికకు ఎంపిక కాని రచనలు సాధారణ ప్రచురణకు స్వీకరించబడి నెచ్చెలిలో నెలవారీ సంచికల్లో ప్రచురింపబడతాయి.
ఇందులో ఉత్తర ప్రత్యుత్తరాలకు తావులేదు.

***

నిర్వాహకులు:
డా.కె.గీత, సంస్థాపక సంపాదకులు,  నెచ్చెలి అంతర్జాల వనితా మాస పత్రిక

*****

Please follow and like us:

One thought on “నెచ్చెలి అయిదవ వార్షికోత్సవ ప్రత్యేక సంచికకు రచనలకు ఆహ్వానం!”

Leave a Reply

Your email address will not be published.