ప్రముఖ నటి, నృత్యకారిణి, రచయిత్రి కోసూరి ఉమాభారతి గారితో నెచ్చెలి ఇంటర్వ్యూ

-డా||కె.గీత 

(కోసూరి ఉమాభారతి గారితో నెచ్చెలి ప్రత్యేక ఇంటర్వ్యూ వీడియోని పైన ఇస్తున్నాం. చూసి, మీ అభిప్రాయాలు తప్పక తెలియజెయ్యండి.)

***

          కోసూరి ఉమాభారతి బహుముఖప్రజ్ఞాశీలి. ప్రముఖ కళాకారిణి.  నటి, కూచిపూడి నాట్యకారిణి, నృత్య గురువు, రచయిత్రి.  వీరు బియ్యే ఎకనామిక్స్, ఎం.ఏ పొలిటికల్ సైన్సు చేసారు.  1980లో అమెరికాకి వచ్చి స్థిరపడ్డారు. వీరికి  ఒక అబ్బాయి, అమ్మాయి. వీరి భర్త , పిల్లలు అంతా ఆరోగ్య శాఖలో పనిచేస్తున్నవారే. 

వీరు బాల్యం నించీ చలనచిత్రాల్లో నటించారు. సుడిగుండాల్లో బాలనటిగా, చిల్లరదేవుళ్ళులో
కధానాయికగా, యమగోలలో ఊర్వశిగా నటించారు. జెమినీ టీవీ లో “ఆలయ నాదాలు” అనే సీరియల్ కి, సింగపూర్, జోహనాస్బర్గ్ టీవీ లకి నృత్య సంబంధిత చిత్రాలకి, కూచిపూడి నృత్య డాక్యుమెంటరీలు & నృత్యాభ్యాసన వీడియో చిత్రాలకి నిర్మాణ, దర్శకత్వ బాధ్యతలని నిర్వహించారు.

          అమెరికాలోని హ్యూస్టన్ నగరంలో ‘అర్చన ఫైన్ఆర్ట్స్ అకాడెమీ’ స్థాపించి నాలుగు దశాబ్దాలు దాటింది.

          రచయిత్రిగా మూడు నవలలు, మూడు కధా సంపుటాలు, ఒక వ్యాసా సంపుటి వెలువరించారు. 

          వీరి ‘హృదయగానం – నేడే విడుదల’కి ‘సిరికోన సాహిత్య అకాడెమీ  &
జొన్నలగడ్డ రాంభొట్లు, సరోజమ్మ..2023 ‘విశిష్ట రచన – ఉత్తమ నవల’ పురస్కారం అందుకుంది.

        వీరి తల్లితండ్రుల పేరిట “శ్రీ శారదా సత్యనారాయణ మెమోరియల్ ఛారిటబిల్ సొసైటీ’ (సాహిత్య-సాంస్కృతిక-సామాజిక సేవా సంస్థ) స్థాపించి మూడు సంవత్సరాలుగా .. ‘కధా-కార్టూన్-కవిత’ ల పోటీలు కాక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

మూగజీవాల సంక్షేమార్ధం నిత్యం కృషి చేస్తుంటారు.

యోగాభ్యాసన వీరి అభిరుచి.

నృత్యమే జీవితంగా, సాహిత్యం ఊపిరిగా, మూగజీవుల సంరక్షణ జీవితాశయంగా మనుగడ సాగిస్తున్నారు.

         

*****

Please follow and like us:

2 thoughts on “ప్రముఖ నటి, నృత్యకారిణి, రచయిత్రి కోసూరి ఉమాభారతి గారితో నెచ్చెలి ఇంటర్వ్యూ”

  1. గీత గారు, ముందుగా మీకు మిక్కిలి ధన్యవాదాలు.. ఇంటర్వూ చాలా చక్కగా నిర్వహించినందకు అభినందనలు. ముఖాముఖీ కనుక.. కొన్ని విషయాలని నెమరువేసుకుని పంచుకోగలిగాను.. ఏమైనా మీ ప్రశ్నలు చాలా సూటిగా ఆసక్తికరమైన జవాబులు రాబట్టేలానే ఉన్నాయి.. మొత్తంగా ఎపిసోడ్ అంతా ప్రశాంతంగా వినేందుకు, చూసేందుకు కూడా హాయిగా ఉండేలా ఎడిట్ చేసారు 🌹👏

Leave a Reply

Your email address will not be published.