శ్రీమతి బి. కళాగోపాల్ గత దశాబ్ధ కాలంగా కవితలు, కథలు వ్రాస్తున్నారు. పుట్టింది నిజామాబాద్ జిల్లాలో. ఎం.ఎ ఇంగ్లీష్, బీఎడ్ చేసిన వీరు ఆంగ్ల సహఉపాధ్యాయినిగా పని చేస్తున్నారు. ఇంత వరకు వీరివి 450కి పైగా కవితలు వివిధ వార, మాస సాహిత్య పత్రికలలో ప్రచురితమయ్యాయి. కవితాసంపుటి ‘మళ్ళీ చిగురించనీ..’ 2015లో 74 కవితలతో ప్రచురించారు. అంతేగాక స్థానిక నిజామాబాద్ రేడియో ఎఫ్.ఎం లో 20 కథానికలు ప్రసారమయ్యాయి. 25 వ్యాసాలూ వివిధ పత్రికల్లో వచ్చాయి. 50 కథలు వివిధ పత్రికల్లో అచ్చు అయ్యాయి. వాటిల్లో 20 కథలు వివిధ సందర్భాల్లో అవార్డులను పొందాయి. వీరి కవితలు కూడా అనేక సందర్భాల్లో పలు అవార్డులు పొందాయి. రాధేయ, ఎక్స్ రే, భిలాయ్ వాణి, కలహంస, భూమిక, సాహితీకిరణం, ద్వానా, వాల్మీకి, మల్లెతీగ వారి కవితా పురస్కారాలు పొందారు. సోమేపల్లి, వట్టికోట ఆళ్వారు స్వామి, జలదంకి పద్మావతి కథా పురస్కారాలను పొందారు.
Please follow and like us:
కొందరి పాశవిక మానసిక స్థితి పడతుల జీవితాల పై ఎలా ప్రభావం చూపుతుందో ఏమైనా సరే జీవితాన్ని వదిలేదే లేదన్న వారి పట్టుదలను చక్కటి చిక్కటి పదాలతో చాలా బాగా రాశారు. అభినందనలు
Congratulations madam for winning first prize for the poem on contemporary burning issue
ప్రతి పదంలో ఉద్వేగం, బాధ, అక్షరాలతోనే సన్నివేశ స్పష్టీకరణ. ఒక్క అక్షరం కూడ అనవసరంగా వాడలేదు రచయిత్రి కవితలో. ప్రథమ బహుమతికి అర్హమైన కవిత. కళాగోపాల్ గారి కవనప్రవహం తెలిసినదే అయినా, ఈ కవిత మాత్రం హృదయాంతరాళాలను తట్టి లేపింది. రచయిత్రి గారికి అభినందనలు. సంపాదకవర్ఖానికి నమస్సులు…