“నెచ్చెలి”మాట 

5వ జన్మదినోత్సవం!

-డా|| కె.గీత 

          ఇవేళ “నెచ్చెలి” విజయవంతంగా  5వ జన్మదినోత్సవాన్ని జరుపుకుంటూ ఉంది. 

          ఆత్మీయంగా నెచ్చెలి కోసం రచనలు చేస్తున్న నెచ్చెలి రచయిత్రు(త)లందరికీ  పేరుపేరునా ప్రత్యేక నెనర్లు! 

          “నెచ్చెలి” తెలుగు అంతర్జాల స్త్రీల పత్రికలలోనే కాకుండా, అంతర్జాల పత్రిక లన్నిటిలోనూ అగ్రస్థానంలో ముందుకు దూసుకుపోతూ ఉంది! ఇందుకు కారణభూతమైన పాఠకులైన మీ అందరికీ అనేకానేక ధన్యవాదాలు! 

          5వ జన్మదినోత్సవ శుభ కానుకగా ఈ అయిదవ వార్షిక సంచికని మీకు అందజేస్తున్నాం.  

          ఈ 5వ వార్షిక సంచికలో నెచ్చెలి-2024 కథా, కవితా పురస్కార ఫలితాలు

వెలువడ్డాయి. విజేతలందరికీ శుభాభినందనలు! న్యాయనిర్ణేతలకు ధన్యవాదాలు!

శ్రీమతి కె.వరలక్ష్మి ఉత్తమ కథా పురస్కారం  పొందిన కథఎస్. లలిత – బంధం 

డా.కె.గీత ఉత్తమ కవితా పురస్కారం  పొందిన కవిత: బి.కళాగోపాల్ – యోధ..!

పురస్కారగ్రహీతలకు ప్రత్యేక అభినందనలు! 

          ఈ పోటీలో ద్వితీయ, తృతీయ, ప్రత్యేక బహుమతి పొందిన కథలు, కవితలు,  సాధారణ ప్రచురణకి ఎంపికైన రచనలు నెలనెలా రెండు/మూడు చొ||న నెచ్చెలిలో ప్రచురింపబడతాయి. 

          ఈలోగా మరెక్కడా ప్రచురించుకునేందుకు అనుమతి లేదు. ఒకవేళ ప్రచురితమైతే ఇక నెచ్చెలిలో మళ్ళీ ప్రచురించబడదు, అలాగే మరొకసారి నెచ్చెలిలో మీనించి ఏ రచనా అంగీకరించబడదు. 

          వినూత్నం, వైవిధ్యం ప్రధాన నిలయాలైన “నెచ్చెలి” లో కథలు, కవితలు, నవలలు, కాలమ్స్, ఆడియో-వీడియోలు, ధారావాహికలు, ట్రావెలాగ్స్, ఇంటర్వ్యూలు  మొదలైన ఎన్నో శీర్షికలు తెలుగు-ఇంగ్లీషు భాషల్లో ఉన్నాయి.   

          “నెచ్చెలి” పత్రికకు అనుబంధంగా “నెచ్చెలి” యూట్యూబ్ ఛానెల్ లో  వెలువడుతున్న రచయిత్రుల ఇంటర్వ్యూలు, ఆడియో కథలు, కవితలు ఎంతో ప్రజాదరణ పొందుతున్నాయి. 

          ఇప్పటికి అయిదేళ్ళనించి ప్రతినెలా 10 వ తారీఖున క్రమం తప్పకుండా  “నెచ్చెలి” మీ “నెట్టిం”ట అడుగుపెట్టే సుదినంగా విడుదల అవుతూ ఉంది! గుర్తు పెట్టుకున్నందుకు నెనర్లు!!

          పెరిగిన పాఠకులతో బాటూ రచనలూ ఇబ్బడి ముబ్బడిగా చేరుతున్నాయి. ఈ సందర్భంగా రచయిత్రు(త)లందరికీ విన్నపం ఏవిటంటే మీ రచన పంపిన తర్వాత నెలలోపు  రచన ప్రచురణకు స్వీకరించబడినదీ, లేనిదీ రిప్లై ఇవ్వడం జరుగుతుంది.  ఈ లోగా మీ రచనలు మరో పత్రికకు పంపుకోదలుచుకుంటే లేదా సోషల్ మీడియాలో ప్రచురించదలుచుకుంటే వెనువెంటనే మీ రచనను పరిశీలించవద్దని తెలియ జెయ్యండి. అలాగే హామీపత్రం ప్రతీ రచనతో బాటూ తప్పనిసరిగా జత చెయ్యండి. మీరు పంపిన రచనల గురించి మీకు ఏవైనా ప్రశ్నలుంటే సంప్రదించండి. 

          క్వాలిటీ రచనలు అందజెయ్యడం ధ్యేయమైన నెచ్చెలికి చేరిన రచనలన్నీ  ప్రచురణకు స్వీకరించబడవు. రచనలు పంపే ముందు దయచేసి నెచ్చెలి “రచనలు- సూచనలు” పేజీలోని  సూచనలు చూడండి. 

          ఇక తెలుగు పాఠకులకి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని రంగాల్లోనూ అత్యుత్తమ స్థాయికి చేరిన మహిళల స్ఫూర్తిని , సాహిత్యాన్ని, ఔన్నత్యాన్ని పరిచయం చేసే దిశగా 100కు మించి శీర్షికలతో స్త్రీల కథలు, కవిత్వం, నవలలు, జీవితచరిత్రలు, పరిశోధనలు, కళలు, సినిమాలు వంటి అనేక కాలమ్స్, ధారావాహికలతో బాటూ విమర్శ, ట్రావెలాగ్స్, పరిశోధక వ్యాసాలు, తెలుగు భాషలోంచి ఆంగ్ల భాషలోకి, ఆంగ్లభాషలోంచి తెలుగు భాషలోకి వస్తున్న అనువాదాలు, పురుషుల రచనలు, ఇతర ప్రత్యేక విశేష రచనలు కూడా కలుపుకుంటూ అన్నిటినీ ఒకచోటికి తీసుకొచ్చి అందిస్తున్న మీ “నెచ్చెలి” తెలుగు, ఇంగ్లీషు భాషల్లో నెలనెలా విడుదల అవుతూ ఉంది. 

          “నెచ్చెలి- ఇంగ్లీషు”(Neccheli-English) ద్వారా ప్రపంచ వ్యాప్తంగా అనేక మందికి  చేరువవుతూ ఉంది. 

          మీ రచనలు ఇంగ్లీషులోకి అనువదింపబడి, పత్రికల్లో అముద్రితమైనవైతే  “నెచ్చెలి- ఇంగ్లీషు”(Neccheli-English) మీకు ఆహ్వానం పలుకుతూ ఉంది. వెంటనే పంపండి. 

          “నెచ్చెలి” కి రచనలు పంపడానికి మీరు స్త్రీలే  కానవసరం లేదు, అందరికీ ఆహ్వానం! 

          వినూత్న రచనాపద్ధతి మీ స్వంతమైతే తప్పకుండా editor@necchelil.com ను సంప్రదించండి. 

          మీ అభిమాన “నెచ్చెలి” ఇలాగే విజయవంతంగా కొనసాగడానికి మీ సహకారం ఎప్పటిలానే అందిస్తారని ఆశిస్తున్నాం. 

          నెచ్చెలి పత్రికకు, నెచ్చెలి యూట్యూబ్ ఛానెల్ కు, నెచ్చెలి ఇన్స్టాగ్రామ్ పేజీకి సబ్ స్క్రైబ్ చేసుకోవడం, నెచ్చెలి ఫేస్ బుక్ పేజీని లైకు చెయ్యడం మర్చిపోకండేం!!!

****

నెచ్చెలి పాఠకులందరికీ సదవకాశం: 

          ప్రతినెలా నెచ్చెలి  పత్రికలో వచ్చే   రచనలు / “నెచ్చెలి” యూట్యూబ్ ఛానెల్లో వచ్చిన ఆర్టికల్స్ వేటిపైనైనా వచ్చిన కామెంట్ల నించి ప్రతి నెలా ఒక ఉత్తమ విశ్లేషణా త్మక కామెంటుని ఎంపిక చేసి  ప్రకటిస్తాం. పాత రచనల మీద కూడా కామెంట్లు చెయ్య వచ్చు. 

          మరింకెందుకు  ఆలస్యం? రచనల్ని చదివి వివరంగా కామెంట్లు పెట్టడం ప్రారంభించండి.  

          వినూత్నం, వైవిధ్యం ప్రధాన నిలయాలైన  “నెచ్చెలి” వస్తున్న వివిధ వినూత్న రచనల్ని తప్పక చూసి, చదివి ఆనందిస్తారు కదూ!

*****

జూన్, 2024 లో ఎంపికైన ఉత్తమ కామెంటు రాసిన వారు: శ్రీనివాసరావు

ఉత్తమ కామెంటు అందుకున్న పోస్టు: నల్ల గులాబి ( ఇందు చంద్రన్ కథ)

ఇరువురికీ అభినందనలు!

****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.