“నెచ్చెలి”మాట 

ఫ్లెక్సీ

-డా|| కె.గీత 

జన్మదిన శుభాకాంక్షలు!
చాలా థాంక్సండీ-
ఇంతకీ ఎవరికి?

అదేవిటీ?
నిలువెత్తు బొమ్మతో
వీథి మొదట్లో నించి
ఊరి నలుమూలలా
ఫ్లెక్సీలు వేయించాం కదా!

అందుకే
సందేహం
వచ్చింది

పోస్టరులో
మధ్య ఉన్న బొమ్మదా?
చుట్టూ ఉన్న పది పదిహేను
బొమ్మలదా?

అంటే
స్థానిక ఛోటా మోటా
నాయక లక్షణాలున్న
ఎవరికో
బర్త్ డే
అని చెప్పి

ముఖ్యమంత్రి
ఉప ముఖ్యమంత్రి
మరో మంత్రి
మరో నాయకురాలు
ఇలా
ఇందరి ఫోటోల్లో
శుభాకాంక్షలు
ఎవరికీ
అని!

అయినా
సగం రోడ్లని
ఆక్రమించేసుకుని
చక్రాల్లాగా
డబ్బాల్లాగా

ఒకళ్ళని
మించి
మరొకళ్ళు

బొత్తిగా
ఫ్లెక్సిబిలిటీ
లేని
ఈ నిలువెత్తు
బడాయి
ఫ్లెక్సీలేవిటి?

అసలెటు పోతున్నాం?
ఆర్భాటాలు
డాబులు
దర్పాలు

పెళ్ళంటే
నూరేళ్ల పంట మాట
అటుంచి
మూడు రోజుల మంట
మెహందీ-
సంగీత్ –
హల్దీ-

ఎవరికో
పుట్టినరోజంటే
పెళ్లి రోజంటే
ఊరంతా టముకు ఫ్లెక్సీలు

పండగంటే
మొత్తం దండగే


ఓ పక్క
ప్రభుత్వాలు
పేదరికాన్ని
నిర్మూలిస్తాయిష!

మనలో మన మాట
కనీసం
ఫ్లెక్సీల్ని
నిర్మూలించలేని
మనం
పేదరికాన్ని
నిర్మూలించగలమా?

****

నెచ్చెలి పాఠకులందరికీ సదవకాశం: 

          ప్రతినెలా నెచ్చెలి  పత్రికలో వచ్చే   రచనలు / “నెచ్చెలి” యూట్యూబ్ ఛానెల్లో వచ్చిన ఆర్టికల్స్ వేటిపైనైనా వచ్చిన కామెంట్ల నించి ప్రతి నెలా ఒక ఉత్తమ విశ్లేషణా త్మక కామెంటుని ఎంపిక చేసి  ప్రకటిస్తాం. పాత రచనల మీద కూడా కామెంట్లు చెయ్య వచ్చు. 

          మరింకెందుకు  ఆలస్యం? రచనల్ని చదివి వివరంగా కామెంట్లు పెట్టడం ప్రారంభించండి.  

          వినూత్నం, వైవిధ్యం ప్రధాన నిలయాలైన  “నెచ్చెలి” వస్తున్న వివిధ వినూత్న రచనల్ని తప్పక చూసి, చదివి ఆనందిస్తారు కదూ!

*****

జూలై, 2024 లో ఎంపికైన ఉత్తమ కామెంటు రాసిన వారు: శింగరాజు శ్రీనివాసరావు

ఉత్తమ కామెంటు అందుకున్న పోస్టు: యోధ ( బి.కళాగోపాల్ కవిత)

ఇరువురికీ అభినందనలు!

****

Please follow and like us:

2 thoughts on “సంపాదకీయం-ఆగష్ట్, 2024”

  1. మనం పేదరికాన్ని నిర్మూలించగలమా?
    లేదు! పేదరిక నిర్మూలన పేరుకు మాత్రమే, పెన్నిధి మాత్రం పెత్తందార్లకు !
    ఘోరమైన గాలి వానలకు ఫ్లెక్సీలు విరిగి అపాయాలు, ప్రాణ నష్టాలు జరిగిన సంఘటనలు కూడ ఉన్నాయి. చిన్న, పెద్ద ఏదైనా సరే ఫంక్షన్ అంటేనే ఫ్లెక్సీ! మనం ముదండుగు వేస్తున్నామా? లేక రివైండ్ అయ్యి వెనక్కి.. అదే అజ్ఞానం లోకి జారు కుంటున్నమా!?

  2. అసలు ఫ్లెక్స్ లో ఎవరి పుట్టినరోజు అని వ్రాయరు. నిజంగా కన్ఫ్యూషన్. ఇక తరువాత చినిగిన ఫ్లెకిసి చెత్త ఎలాగూ భూమికి భారం 👌👌👌

Leave a Reply

Your email address will not be published.