

కొప్పర్తి రాంబాబు 1959 ఆగస్ట్ 8వతేదీన కళా వాచస్పతి జగ్గయ్య గారి ఊరు కాంటినెంటల్ కాఫీ పరిమళాల దుగ్గిరాలలో జన్మించారు. అమ్మ లలితమ్మ, నాన్న సుబ్బారావు గారు. పెరిగింది, చదువుకున్నది సాహితీ కేంద్రమైన తెనాలిలో.
1980 లో ఇండియన్ బ్యాంక్ లో చేరి ముంబై , చెన్నై నగరాల్లో ఎక్కువ కాలం పనిచేసి 2019 లో విశాఖపట్నం డిప్యూటీ జోనల్ మేనేజర్ గా రిటైర్ అయ్యారు.
వీరు ప్రముఖ కథా రచయిత “మిథునం ” శ్రీరమణ గారికి మేనల్లుడు. చిన్నప్పటి నుంచి ఉన్న సాహిత్య అభిలాషతో రిటైర్ అయ్యాక ఆడియో కథలు చదివి వినిపిస్తూ తెలుగు సాహిత్యానికి యువతను దగ్గర చెయ్యాలి అనే ప్రయత్నంలో ” కొప్పర్తి కథావాహిని ” You Tube, వాట్సప్ ఛానల్స్ ని ప్రారంభించారు.
ఈనాడు FM రేడియో ద్వారా Bookmate కార్యక్రమం, Tori One ద్వారా కథా వాహిని కార్యక్రమం నిర్వహిస్తూ ఉంటారు. అనేక కథలు, నవలలు, కవిత్వం పరిచయం చేసారు. ఇప్పటివరకు దాదాపు 300 తెలుగు కథలు ఆడియోలు చేశారు.