Please follow and like us:
మా ఊరు అద్దంకి, ప్రకాశం జిల్లా, (ఆంధ్రప్రదేశ్.) నేను ప్రస్తుతం నాగార్జున యూనివర్సిటీ లో బి.ఫార్మసీ చదువుతున్నాను.నాకు చిన్నప్పటి నుండి తెలుగులో శతక పద్యాలు అంటే ఇష్టం. అలాగే మా నాన్నగారు పరిచయం చేసిన మహాకవి శ్రీ శ్రీ గారి మహాప్రస్థానం నా జీవితంలో ఓ గొప్ప మలుపు. క్రమంగా వచన కవిత్వము పట్ల అభిమానము కలిగి, నాకు తోచిన భావాలను వచనంలో వ్రాయడం అలవాటుగా మారింది.
అన్యాపదేశంగా ఓ ఆడపిల్ల వ్యధను వ్యక్తపరచడానికి కవయిత్రి వాడిన పదాలు అమోఘం!
కవిత చిన్నదయినా భావం సారం అపరిమితం!!
కవయిత్రికి అభినందనలు!!! 💐🤝😊
కవిత చిన్నదే..కానీ అంతర్లీనమైన భావన అపరిమితం.. ఆడపిల్ల “ఊపిరి పోరాటం” చేయాలా?..అది ప్రశ్న కాదు..ఆడపిల్ల వేదన.. రక్షణ కోసం అడుగుతున్న భిక్ష.. దేశం కాదు సమాజం సిగ్గుతో చావాలి.. అద్భుతమైన మినీకవిత.. కవయిత్రికి అభినందనలు…