ప్రముఖ రచయిత్రి డా||అమృతలత గారితో నెచ్చెలి ఇంటర్వ్యూ

-డా||కె.గీత 

ప్రముఖ రచయిత్రి డా||అమృతలత గారితో నెచ్చెలి అంతర్జాల వనితా మాస పత్రిక వ్యవస్థాపక సంపాదకులు డా||కె.గీత గారి ముఖాముఖీ కార్యక్రమాన్ని నెచ్చెలి పాఠకుల కోసం ఇక్కడ ఇస్తున్న వీడియోలో ప్రత్యేకంగా అందజేస్తున్నాం.

          తప్పక చూసి మీ అభిప్రాయాల్ని తెలియజెయ్యండి.

          “డా||అమృతలత” అంటే తెలుగు సాహితీ, విద్యా రంగాల్లో పరిచయం అవసరం లేని పేరు.

          కథ, నవల, నాటక రచయిత్రి, విజయ్ విద్యాసంస్థల అధిపతి, అపురూప అవార్డుల వ్యవస్థాపకురాలు, ‘అమృత్‌ కిరణ్‌’ పక్షపత్రిక, ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర సంకలనాల సంపాదకురాలు, ప్రచురణకర్త.

          అన్నింటినీ మించి ప్రేమ, మృదుత్వం, నిగర్వం, దానగుణం, కలగలిసిన అపురూపమూర్తి.

          నిజామాబాదులోని పడకల్‌ గ్రామంలో జన్మించి, ఆర్మూరులో స్థిరపడినా, తమ సాహితీ ప్రతిభతో జగద్వ్యాప్త కీర్తిని గడించారు. జీవితం వడ్డించిన విస్తరి కాకపోయినా స్వయంకృషితో విద్యలను అభ్యసించి ఉన్నత శిఖరాలను అధిరోహించారు. ఎన్నో కష్టనష్టాలకోర్చి, పడి లేచిన ఉత్తుంగ కెరటమై ధీరురాలిగా ముందడుగేసి, తమ విద్యాసంస్థల ద్వారా అనేక మందికి ఉపాధిని, అత్యుత్తమ విద్యని కల్పిస్తున్న నిరంతర కృషీవలులు.

          అపురూప అవార్డుల వ్యవస్థాపకురాలిగా వివిధ రంగాల్లో నిష్ణాతులైనవారిని ఏటా సన్మానించడమే సంతోషంగా భావించే నిగర్వి.

          నిజామాబాద్‌ జిల్లా మామిడి పల్లిలో శ్రీ అపురూప వెంకటేశ్వర దేవాలయాన్ని అద్భుత కళాకౌశలంతో, అన్ని వసతులతో నిర్మించి ఆధ్యాత్మిక రంగంలోనూ సేవలందజేస్తున్న మానవతామూర్తి, స్నేహశీలి.

డా||అమృతలత గారి వివరాలు:

నిజామాబాదు జిల్లా పడకల్‌ గ్రామంలో జన్మించారు. నివాసం ఆర్మూరు. ఎమ్మే, బి.ఎడ్, పిహెచ్‌.డీ చేశారు. వీరి ఏకైక కుమార్తె డా||హిమచందన్ అమెరికాలో నివాసముంటు న్నారు.

          ప్రస్తుతం నిజామాబాదు జిల్లాలోని ఆర్మూర్‌, నిజామాబాదు పట్టణాలలో రెండు హైస్కూల్స్‌, ఇంజనీరింగ్‌ కాలేజీ , ఫార్మసీ కాలేజీ, పాలిటెక్నిక్‌ కాలేజీ , ఎంబీఏ కాలేజీలు స్థాపించారు.

          లా కాలేజీ, బి.ఎడ్‌, డి.ఎడ్‌ కాలేజీలు , మరి కొన్ని ఇంజనీరింగ్ కాలేజీలు కూడా కొన్నేళ్ళ పాటు నడిపారు.

          గత 46 సంవత్సరాలుగా అన్ని విద్యా సంస్థల నుండి సుమారు 47,000 మంది విద్యార్థినీ విద్యార్థులు చదువుకుని వేర్వేరు వృత్తుల్లో స్థిరపడ్డారు.

          నిజామాబాద్‌ జిల్లా మామిడి పల్లి గ్రామంలో దాదాపు ఇరవై ఎకరాల విశాలమైన ప్రాంగణంలో 2012లో శ్రీ అపురూప వేంకటేశ్వర స్వామి వారి మందిరాన్ని నిర్మించారు.

          1994 – 1997 మధ్య ‘అమృత్‌ కిరణ్‌’ పక్షపత్రికను వ్యవస్థాపక సంపాదకురాలిగా నడిపారు.

          2013 నించీ వివిధ రంగాల్లో నిష్ణాతులైనవారికి అపురూప అవార్డులు ప్రదానం చేస్తున్నారు.

          మొత్తం ఎనిమిది పుస్తకాలు ప్రచురించారు. ఆరు పుస్తకాలు అనువాదాలుగా వచ్చాయి. రెండు ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర సంకలనాలను తీసుకువచ్చారు.

మొత్తం రచనల వివరాలు:

*సృష్టిలో తీయనిది ( నవల )
డా. అమృతలత
ప్రథమ ముద్రణ : నవంబర్ 2005
ద్వితీయ ముద్రణ:
సెప్టెంబర్, 2017

*స్పందన
( కథా సంపుటి )
డా.అమృతలత
ప్రథమ ముద్రణ : 2005
ద్వితీయ ముద్రణ :2017

*అమృత వర్షిణి
( వ్యాస సంపుటి )
ప్రథమ ముద్రణ :2005
ద్వితీయ ముద్రణ :2017

*గోడలకే ప్రాణముంటే ..!?
( నాటికల సంపుటి )
డా. అమృతలత
ప్రథమ ముద్రణ :2005
ద్వితీయ ముద్రణ : 2017

*చుక్కల లోకం చుట్టొద్దాం !
( పిల్లల నాటికలు )
డా. అమృతలత
ప్రథమ ముద్రణ :2005
ద్వితీయ ముద్రణ :2017

*ఓటెందుకు ?
( సంభాషణల సమాహారం )
డా. అమృతలత
ప్రథమ ముద్రణ :2017

*నా ఏకాంత బృందగానం
డా. అమృతలత సచిత్ర స్వీయ చరిత్ర
ప్రథమ ముద్రణ : డిసెంబర్ , 2021

*I’m Busy !
-Dr.Amruthalatha
(Playlets for children )
First Edition: September,2017

TRANSLATED BOOKS INTO ENGLISH:

*INTIMACIES
( An anthology of stories )
Written by Dr.Amruthalatha
Translated by
Dr.Palakurthy Dinakar
First Edition: September,2017

*AMRUTHA VARSHINI
( An anthology of essays)
Written by Amruthalatha
Translated by
Sanakkaayala Maheshwari
First Edition: September,2017

*IF THE WALLS WERE ALIVE …
( An anthology of playlets )
Written by Dr.Amruthalatha
Translated by
Chinthapaatla Sudarshan
First Edition : September, 2017

*LET’S VISIT THE STAR WORLD !
( playlets for children )
Written by Dr. Amruthalatha
Translated by
Chinthapatla Sudershan
First Edition: September,2017

*WHY VOTE ?
(An anthology of dialogues)
Written by Dr. Amruthalatha
Translated by
Dr. Palakurthy Dinakar
First Edition: September,2017

TRANSLATED BOOK INTO HINDI :

Vote kisliye?
Dr.Amruthalatha
Translated by R. Santa Sundari
First Edition : September,2017

స్థాపించిన విద్యా సంస్థలు :

*విజయ్ హైస్కూల్, ఆర్మూర్
1980

*విజయ్ హైస్కూల్, నిజామాబాదు
1981

*నిజామాబాదు లా కాలేజీ
1991

*విజయ్ రూరల్ ఇంజనీరింగ్ కాలేజ్, నిజామాబాదు
1997

*శ్రీనివాస ఇంజినీరింగ్ కాలేజీ, బాన్స్వాడ
2001

*శ్రీనివాస్ రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలిజీ, మునిపల్లి
2001

*విజయ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్, కామారెడ్డి
2004

*విజయ్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్,నిజామాబాదు
2007

*విజయ్ పాలిటెక్నిక్ కాలేజీ, నిజామాబాదు
( సెకండ్ షిఫ్ట్ )
2009

*విజయ్ ఇంజినీరింగ్ కాలేజ్ ఫర్ విమెన్
2009

*విజయ్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ, నిజామాబాదు
2010

*విజయ్ కాలేజ్ ఆఫ్ డి.ఎడ్ ఫర్ విమెన్, నిజామాబాదు
2012

పొందిన పురస్కారాలు:

*ఆదర్శ వనిత పురస్కారం, భరతముని ఆర్ట్స్ అకాడెమీ, శ్రీకాకుళం(1996)

*’డోయెన్’ పురస్కారం, జర్నలిస్ట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, హైదరాబాద్
(1996 )

*ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా చిన్నతరహా పరిశ్రమల ‘ఉత్తమ వనితా పారిశ్రామికవేత్త’ పురస్కారం (1997-98)

*ఉత్తమ విద్యావేత్త’ పురస్కారం, ఐటిటిఆర్‌ఓడిడి, హైదరాబాద్ (1999-2000)

*నిరంతర విద్య, వ్యక్తిత్వ వికాసం మరియు సామాజిక సేవలకు గాను తెలుగు యూనివర్సిటీ ‘కీర్తి పురస్కారం’ (2012)

*ప్రముఖ రంగస్థల నటుడు శ్రీపాద కుమార శర్మ స్థాపించిన ‘శ్రీపాద విజయలక్ష్మి జీవన సాఫల్య పురస్కారం’ – 2013

*ప్రముఖ దర్శకుడు శ్రీ కె.విశ్వనాథ్ స్థాపించిన ‘శంకరాభరణం’ అవార్డు (2017)

*’శ్రీమతి తిరుమల స్వరాజ్య లక్ష్మి మెమోరియల్ సాహిత్య అవార్డు’ (2018)

*’శ్రీమతి మాదిరెడ్డి సులోచన – వంశీ సాహితీ అవార్డు’ (2018)

*ప్రొఫెసర్ మసన చెన్నప్ప స్థాపించిన ‘ప్రమీల శక్తి పీఠం’ అవార్డు (2021)

*స్వీయ చరిత్ర ‘నా ఏకాంత బృందగానం’కు వి.చిన నాగయ్య స్వాతంత్ర్య సమరయోధ పురస్కారం (2022)

*సనాతన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ ‘శ్రీరామ నవమి ప్రతిభా పురస్కారం’ (2023)

*తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, తెలంగాణ ప్రభుత్వం నుండి ‘ మాతృ వందనం ‘ పురస్కారం -2023

*****

Please follow and like us:

7 thoughts on “ప్రముఖ రచయిత్రి డా||అమృతలత గారితో నెచ్చెలి ఇంటర్వ్యూ”

  1. అమృతలత గారు ‘నిండు కొండ’ కిటికీ ఊచల్లోంచి ఏటవాలుగా పడి పరిసరాలలో చల్లని వెన్నెలకాంతి పరచే వెన్నెల కిరణం లాంటి ఒక చెదరని చిరునవ్వు ఆమె పెదవుల మీద సదా ఉండడంలో ఎంతో హుందాతనం ఉంది. చిన్న, చిన్న ఎదురుదేబ్బలకే గిల,గిల తన్నుకుని ఆత్మహత్యల వైపు వెళ్ళే అమ్మాయిలకు ఆమె జీవితం ఒక పాఠం . ఇంతకన్నా చెబితే పొగడ్త అవుతుంది. మొహం మీద పొగిడే అలవాటు లేదు నాకు. అలా పొగిడే వాళ్ళ నిజాయితీ మీద నమ్మకం కూడా లేదు. అందుకే అభినందనలు మాత్రం అందిస్తున్నాను.

  2. అమృతలత గారి ఇంటర్వ్యూ చాలా బాగుంది. ఎంత విన్నా ఎన్ని విషయాలు చెప్పినా ఇంకా ఇంకా తెలుసుకోవాలనిపించే విలక్షణమైన వ్యక్తిత్వం డా అమృతలత గారిది
    డా గీత గారికి అమృతలత గారికి హృదయపూర్వక అభినందనలు

  3. అమృతలతగారి గురించి, విజయ్ విద్యాసంస్థలను గురించి డా. కె. బి. లక్ష్మిగారు చెపుతుండేవారు.ొకసారి హైదరాబాద్ రా! మేడమ్ దగ్గరకు తీసుకెళతా అనేవారు. ఫేస్ బుక్ లో కూడా మేడమ్ పోస్టులు ఫాలో దానిని. మా అబ్బాయి న్యూరోఫిజీషియన్. తనకి ఆర్మూర్ లో జాబ్ వచ్చింది. మేము ఇక్కడికి వచ్చాక మేడమ్ తో అనుబంధం పెరిగింది. ఎక్కువగా కలుస్తాను. ఆమె’ నా ఏకాంత బృందగానం’ చదివాను.వారిదగ్గర చాలా విషయాలను నేర్చుకున్నాను.
    అందరూ అన్ని విషయాలు తెలిసినవారే! ప్రత్యేకించి మేడమ్ గురించి ఏమి చెప్పగలము?నిజంగా అపురూపమైన, అద్భుతమైన, అందరినీ ఒకేలా ఆదరించే అమృతమూర్తి అమృతలతగారు. వారికి నా నమస్కారములు మరియు అభినందనలు. ఇంటర్యూని అందించిన నెచ్చెలి వారికీ 🙏

  4. నెచ్చెలి ద్వారా డా.గీతగారు అందించిన ప్రముఖ రచయిత్రి డా.అమృతలతగారితో ప్రత్యక్ష పరిచయం ఒక అపురూపమైన సన్నితత్వాన్ని కల్గించింది. బహుముఖ ప్రజ్ఞాశాలి అమ్మ! అమృత వల్లి!! మూడు మార్లు ఈ కార్యక్రమాన్ని చూస్తే, వింటే నాకు తృప్తి తీరింది, అంతగా నచ్చింది. అమ్మలోని పట్టుదల, కార్యదీక్ష, అందించే శిక్షణ.. ఒకటేమిటి.. ఎన్నో.. ‘స్త్రీ శక్తి’ కి నిదర్శనం! కష్టాలు, కన్నీళ్ళు అంటూ అమూల్యమైన కాలాన్ని వృధా చేయక తనలోని వ్యక్తిత్వాన్ని ఆదర్శప్రాయంగా పొందుపర్చిన అమృత కలశం! అమ్మా.. నన్నూ మీ స్నేహితురాలిగా ఆహ్వానించండి.. మీరు పంచే తీయని మాధుర్యం నాకు కావాలి!!

  5. అమృతలత గారితో ప్రత్యక్ష పరిచయం నా మహద్భాగ్యం. పెర్కెట్ ఆంధ్రాబ్యాంక్ లో పనిచేసినప్పుడు పరిచయం. స్నేహశీలి, నిగర్వి.
    అక్కడున్నప్పుడు తరచుగా దర్శించిన ఆలయం అపురూప వెంకన్నబాబు. ఎంతో ప్రశాంతగా ఉంటుంది.
    అమృతలత గారి గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది. అంత మంచి వ్యక్తి, స్త్రీ శక్తి నిజంగా అపురూపమే.
    ఆమె నిండు నూరేళ్లు ఆయురారోగ్యా లతో విలసిల్లాలని కోరుకుంటున్నాను.

  6. ఇపుడే ఈ ఇంటర్వ్యూ, అమృతలత గారి పరిచయం చదివాను. ఇంతకాలంగా పరిచయం, స్నేహం ఉన్నా, ఆమె ఏకాంత బృందగానం పూర్తిగా చదివి ఉన్నా కూడా ఆమె సాధించిన విజయాలు, స్థాపించిన విద్యా సంస్థల వివరాలు ఒక్క చోట చదువుతుంటే ఆశ్చర్యం కలిగింది. ఎన్ని ఎదురుదెబ్బలు తిన్నా తనలోని సృజననూ, సున్నితత్వాన్నీ అలాగే నిలుపుకోగలిగిన అమృతలత గారిది నిజంగానే ఎంతో అపురూపమైన వ్యక్తిత్వం.

Leave a Reply

Your email address will not be published.