“నెచ్చెలి”మాట 

వైపరీత్యం

-డా|| కె.గీత 

ఈ మధ్య
ఏవిటో
అన్నీ
విపరీతాలే!

ఎండకి ఎండా
వానకి వానా
చలికి చలీ
మంచుకి మంచూ
భూగోళమంతా
గందరగోళం
అయోమయం

ఏవిటీ
విపరీతాలంటే
వాతావరణం
గురించా!

మనుషుల
గురించేమో
అనుకున్నాలెండి..

అంటే
కొందరు
అయితే ఎక్కడలేని
ప్రేమా చూపించెయ్యడం
లేకపోతే
పాతాళానికి తొక్కెయ్యడం

ఇంకా కొందరైతే
ప్రేమ నటిస్తూ
వెనక గోతులు తియ్యడం
ఇక మరి కొందరు
డబ్బు కోసమే
ఆప్యాయతలు
కొనితెచ్చుకోవడం
ఇక…

చాలు
బాబోయ్
చాలు

మనుషుల్లో
వైపరీత్యాల
కంటే
వాతావరణ
వైపరీత్యాలే
నయం!
వస్తాయి
పోతాయి
మనుషుల్లో
ఎన్ని జన్మలెత్తినా
ఇదే…

మరేవిటండీ
మార్గం?

ఇదేవన్నా
హైదరాబాదులోని
నాలాలు, చెరువుల మీద
అక్రమంగా కట్టిన
ఇళ్ళనుకున్నారా
యుద్ధప్రాతిపదికన
పడగొట్టేయడానికి!

బుడమేరు కాలువ…

ముంచుతూనే ఉన్నా
ఏలినవారి తరాలు
మారాలి కానీ
మార్గాంతరం
సున్నా…

ఏవిటీ
బుడమేరు
సమస్య గురించా
చెప్తున్నదీ…

మనుషుల
గురించేమో
అనుకున్నాలెండి

అంటే
కొందరు….

చాలు
బాబోయ్
చాలు

****

నెచ్చెలి పాఠకులందరికీ సదవకాశం: 

          ప్రతినెలా నెచ్చెలి  పత్రికలో వచ్చే   రచనలు / “నెచ్చెలి” యూట్యూబ్ ఛానెల్లో వచ్చిన ఆర్టికల్స్ వేటిపైనైనా వచ్చిన కామెంట్ల నించి ప్రతి నెలా ఒక ఉత్తమ విశ్లేషణా త్మక కామెంటుని ఎంపిక చేసి  ప్రకటిస్తాం. పాత రచనల మీద కూడా కామెంట్లు చెయ్య వచ్చు. 

          మరింకెందుకు  ఆలస్యం? రచనల్ని చదివి వివరంగా కామెంట్లు పెట్టడం ప్రారంభించండి.  

          వినూత్నం, వైవిధ్యం ప్రధాన నిలయాలైన  “నెచ్చెలి” వస్తున్న వివిధ వినూత్న రచనల్ని తప్పక చూసి, చదివి ఆనందిస్తారు కదూ!

*****

ఆగస్టు, 2024 లో ఎంపికైన ఉత్తమ కామెంటు రాసిన వారు: టి.హిమబిందు

ఉత్తమ కామెంటు అందుకున్న పోస్టు: గంజాయివనం ( నెచ్చెలి-2024 పోటీలో తృతీయ బహుమతి పొందిన నెల్లుట్ల రమాదేవి గారి కథ)

ఇరువురికీ అభినందనలు!

****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.