స్వరాలాపన-39

(మీ పాటకి నా స్వరాలు)

-డా||కె.గీత

మనందరికీ పాటలు వినడం ఇష్టం. మనలో కొందరికి విన్న పాటలు తిరిగి పాడడం ఇష్టం. మరికొందరికి ఆ పాటల్ని వివిధ వాయిద్యాల మీద పలికించడం ఇష్టం. అయితే అలా పలికించేందుకు అవసరమైన స్వరాలు తెలుసుకోవడం ఎలా? సాధారణంగా అవి గురుముఖత తప్ప అందరికీ లభ్యం కావు. నాకున్న జన్మతః వచ్చిన అనేకానేక ఇష్టాల్లో, కళల్లో విన్న ఏ పాటకైనా వెంటనే స్వరాలు కూర్చడం ఒకటి! నాకు తెలిసిన మిత్రులు ఇటువంటి కాలమ్ ఒకటి ఉంటే ఉపయోగకరంగా ఉంటుందన్న సలహా ఇవ్వడంతో అవి మీకూ ఉపయోగపడతాయని ఇక్కడ నెలనెలా ఇస్తున్నాను.

మీకు నచ్చి, నేర్చుకుంటే ఇక్కడ కామెంటులో తెలియజెయ్యడమే కాకుండా రికార్డు చేసి editor.neccheli@gmail.com ఈ-మెయిలుకి పంపండి. ఉత్తమమైన వాటిని ప్రచురిస్తాం. అంతే కాదు మీకు నచ్చిన సినిమా/ఏదైనా ప్రముఖ పాటకి (ఏ భాషైనా) స్వరాలు కావాలనుకుంటే కూడా ఈ-మెయిలు పంపండి. వరసవారీగా స్వరాలు ఈ కాలమ్ ద్వారా అందజేస్తాను.  మీరు ఇలా నేర్చుకున్న పాటల్ని యూట్యూబు, ఫేసుబుక్ వంటి సామాజిక మాధ్యమాల్లో పెట్టదలుచుకుంటే తప్పనిసరిగా ఆ పాట ప్రచురితమైన  నెచ్చెలి పేజీ లింక్ ని ఇస్తూ, నా పేరుని జత చెయ్యడం మరిచిపోకండేం!

***

రాగం: అమృతవర్షిణి రాగం 

అమృత వాహిని అమ్మే కదా
రచన &సంగీతం: డా.కె.గీత

Arohanam: S G3 M2 P N3 S
Avarohanam: S N3 P M2 G3 S

అమృత వాహిని అమ్మే కదా
పసనిప పమగమగస నిసగాపపా
ఆనందామృత క్షీర ప్రదాయిని అమ్మే కదా
గమపానిససస పసపమ పమగగ నిసగాపపా
అనురాగాన్విత జీవప్రదాయిని అమ్మే కదా
పమగమపానిససస పసపమ పమగగ నిసగాపపా

 

ఇల్లాలై ఇలలో వెలసిన ఇలవేలుపు కదా
మపగమపా పమగగ గమగస నిసగాపపపపా
జోలాలై కలలే పంచిన కనుచూపే కదా
మపగమపా పమగా గమగస నిసగాపపపా
కడలిని మించే కెరటము ఎగసినా
గమపని నిససా నిస*గ*గ* *ప*గ*స*సా*
కడుపున దాచును అమ్మే కదా-
పసనిప పమగగ నిసగాపప గమపనిసా

ఉరుముల మెరుపుల ఆకసమెదురైనా
మపగమ పపపప పామగ గమగసస
అదరదు బెదరదు అమ్మే కదా
నిసగమ పమగగ నిసగాపపా
తన తనువే తరువై కాచే
గమపనిసా నిసగా* *ప*గ*సా*
చల్లని దీవెన అమ్మే కదా
పసనిప పమగగ నిసగాపప గమపనిసా


జీవితమే ఒక ఆగని పోరాటం
మపగమపా పప పమగగ గమగసస
ఆశనిరాశల తరగని ఆరాటం
నిసగమపాగగ గమపని సనిపపపా
కుంగిన వేళల తలచిన చాలును
గమపనిసససస నిస*గ*గ* *ప*గ*స*స*
దారిని చూపును అమ్మే కదా
పసనిప పమగగ నిసగాపప గమపనిసా

 *****

*ఈ స్వరాలు వింటూ నేర్చుకోవడానికి అనువుగా కింద ఇవ్వబడిన “గీతామాధవీయం” టాక్ షో లో మూడవ భాగమైన “స్వరాలాపన” వినండి-

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.