రొట్టెలు అమ్మే స్త్రీ

– డాక్టర్ ఐ. చిదానందం

రోడ్డు పక్కన విశాలం తక్కువైన
ఇరుకైన సందులో ఓ కట్టేల పోయ్యి
బోగ్గుల మంటలో పోగచూరిన ముఖంతో
ఒక స్త్రీ ఒంటరిగా రోట్టెలు అమ్ముతుంది

ఎంత అవసరమో ఇంత కష్టము
ఎంత తాను మండితే ఇంత ఒంటరి పోరు
గ్లోబలీకరణతో గల్లీ గల్లీలలో
కర్రీ పాయింట్లు కుప్పలు కుప్పలుగా వున్నా
జీవన రణం చేస్తున్న రుద్రమలా
ఆ స్త్రీ నిత్యం రొట్టెలు అమ్ముతుంది

ప్రపంచీకరణ పాశాణంలా మారిన
ఈ లోకంలో అంత చలిలో
రోట్టేలు అమ్ముతుందా స్త్రీ
వచ్చే ఆదాయం అవసరాలను తీర్చగలవా
నోట్లోకీ నాలుగు వేళ్లు వేళ్లుటకు
ఆ నాలుగు అడుగుల స్థలంలో
ఆ స్త్రీ ఓపికగా రోట్టెలను అమ్ముతుంది

ఆ రాతిరి కురిసే మంచు
కట్టెల బోగ్గులలో తలదాల్చుకుంటుంది
ఒక్కోక్కసారి నిప్పులు నీటిలో
కలిసినట్లు కట్టెలపోయ్యి మండుతుంది
చలితో కట్టెలను మండించి
పెంక పై చంద్రుని కాల్చినట్లు కాల్చి
ఆ స్త్రీ చలిలో రోట్టెలను అమ్ముతుంది

చాలా రోజుల తర్వాత రోట్టెలు
కొనడానికీ నేనక్కడికి వేళ్లా
రోట్టెలమ్మే స్త్రీ అక్కడ లేదు
ఆ స్థలంలో వేరోకరి కర్రీ పాయింట్

చుట్టు వున్నా కర్రీ పాయింట్లు
ఇప్పుడు ఎత్తేన ఇండ్లు
కాలం కఠినమైంది
దీనులకు లోంగనిది
ఎక్కడయినా కర్రీ పాయింట్లు
అపార్ట్ మెంట్లు అవుతాయి గానీ
పేద గుడిసె భవంతి కాగలదా

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.