“నెచ్చెలి”మాట 

నిష్పాక్షి“కత”

-డా|| కె.గీత 

నిష్పాక్షికత
అనగానేమి?
పాక్షికత
అనునది…. లే..

ఏ “కత”?
అయ్యో
ఏకత
కాదూ
ఏ కతా
కాదు

హయ్యో-
కథ కానిది
ఎవరి పక్షానా లేనిది
మాకెందుకు?

మాక్కావల్సింది
బఠాణీ కాలక్షేపంలా
ఏదొక పక్షాన
నిలబడి
తన్నుకొనుట-
ఎవరొకరి మీద
పుకార్లు
వెదజల్లుట-

సనాతనమనో
సమంతా అనో

“జై” అనో
“డై” అనో

వద్దనుటకు
కాదనుటకు
మీదే పక్షం?

ఈ పక్షపాతాలు
వద్దనేనా
మీ
గోలంతా?

అది కాదండీ
అసలు
“నిష్పాక్షిక” రాతలున్నాయా?
“నిష్పాక్షిక” వార్తలున్నాయా?
“నిష్పాక్షిక” పార్టీలు ఉన్నాయా?
“నిష్పాక్షిక” ప్రభుత్వాలు ఉన్నాయా?

అసలు “నిష్పాక్షికత”
అన్న పదమే లేదు
ఉన్నవన్నీ
పాక్షి“కత”లే

పాక్షికతలే
లేకపోతే
ప్రాణాలరచేతుల్లో పెట్టుకుని
బతకాల్సిన మధ్యప్రాచ్యం
అబార్షన్ హక్కుల కోసం
నినదించాల్సిన అమెరికా
మరోలా ఉండేవి కదా!
ఉన్నవన్నీ
పాక్షి“కత”లే

పైగా
కతల్లేని
బతుకు
చప్పబడిపోయిన
మెతుకు కాదూ-
అదేదో కత చెప్పినట్టు
ఏమా కత?
ఆ…
గుర్తొచ్చింది
నిష్పాక్షి “కత”-

****

నెచ్చెలి పాఠకులందరికీ సదవకాశం: 

          ప్రతినెలా నెచ్చెలి  పత్రికలో వచ్చే   రచనలు / “నెచ్చెలి” యూట్యూబ్ ఛానెల్లో వచ్చిన ఆర్టికల్స్ వేటిపైనైనా వచ్చిన కామెంట్ల నించి ప్రతి నెలా ఒక ఉత్తమ విశ్లేషణాత్మక కామెంటుని ఎంపిక చేసి  ప్రకటిస్తాం. పాత రచనల మీద కూడా కామెంట్లు చెయ్యవచ్చు. 

          మరింకెందుకు  ఆలస్యం? రచనల్ని చదివి వివరంగా కామెంట్లు పెట్టడం ప్రారంభించండి.  

          వినూత్నం, వైవిధ్యం ప్రధాన నిలయాలైన  “నెచ్చెలి”లో  వస్తున్న వివిధ వినూత్న రచనల్ని తప్పక చూసి, చదివి ఆనందిస్తారు కదూ!

*****

సెప్టెంబరు,  2024 లో ఎంపికైన ఉత్తమ కామెంటు రాసిన వారు:  శింగరాజు శ్రీనివాసరావు

ఉత్తమ కామెంటు అందుకున్న పోస్టు: ఊపిరి పోరాటం కవిత ( శ్రీ సాహితి

 ఇరువురికీ  అభినందనలు!

****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.