తరుణి తరుణం(నెచ్చెలి-2024 కవితల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కవిత)-కొత్తపల్లి అజయ్ తరుణి తరుణంభళ్ళున తెల్లారింది!కళ్ళు నులుపుకుంటుఉదయపు వాకిలిలో..కళ్ళు తెరిస్తే పేపర్బోయ్ఎప్పటిలా!? చదువుదామని ఉద్యుక్తురాలినై చేతిలో పేపర్ఎపుడెపుడాని ఎదురుచూసే రోజురానే వచ్చిందిఎదురు చూసి చూసికళ్ళు కాయలైనాయి తరుణీ తరుణం!!మహిళాసాధికారత మహిళాబిల్లు!!నవవసంతం వచ్చినట్టైందిఇక చెల్లవు !!మగధీరుల హుకుంలు!ఇక చెల్లవు!!వళ్ళు హూనంలుఇక మేముండం!! మగ్గిన చీకటి పూవులుగావికసిస్తాము!వెలుగు పూవులుగా!తెల్లారిమొదలు, పుక్కిట పురాణాలు వల్లించే నీతిపాఠాలుమా చెవులుచిల్లులైనై!ఇక..చాలు చాలు..మీ ఉద్భోదనలు..ఇక..చాలు చాలు మీ ఉపన్యాసాలు.రాలిన ఈకల వళ్ళుఇపుడిపుడే స్వేచ్ఛామొగ్గలు తొడుగుతున్నయ్!!వినీలాకాశంలోహాయిగా ఎగిరిపోతం!ఆకాశంలో సగం కాదుఆకాశమే మేము.ఇక అన్నిటా మేమేఎవరు అడ్డురారుఏ అరచేయి వెలుగును ఆపదు మేమే ముందు!అన్నింటా మీ ముందు!మాపాదాలు రాటుదేలాయి ఏ ముళ్ళు అడ్డుపడవుకదం తొక్కుకుంటూ మున్ముందుకు పోతాం!కదనరంగంలో దూకుతం అపుడూ ముళ్ళబాటలన్ని పూ బాటలవుతాయి.***** Please follow and like us: అజయ్ కొత్తపల్లికొత్తపల్లి.అజయ్ కవి, రచయిత