వృద్ధుడు

ఆంగ్ల మూలం : మోహన్ కుమార్

తెలుగు సేత:వారాల ఆనంద్

అర్థరాత్రి 

టేబుల్ ల్యాంప్ వెలుగులో చదువుకుంటున్న  వృద్ధుడితో 

ఓ యువతి అంది 

“ తాతయ్యా! నీ ఆరోగ్యం సున్నితమయింది 

నీ కంటి చూపు మందగించింది 

ఇప్పటికే అర్థరాత్రి అయింది నువ్విక పడుకోవాలి”

 

వృద్ధుడు తాను చదువుతున్న పుస్తకాన్ని మూసేసి 

ఫ్రేం లేని కళ్ళద్దాల్ని తీసేసి నవ్వుతూ అన్నాడు 

“ ఓ పక్క తనను చంపడానికి 

విషం తయారవుతూ వుంటే 

సోక్రటీసు 

ఏమి చేస్తున్నాడో తెలుసా 

తన పిల్లనగ్రోవిలో కొత్త రాగం నేర్చుకుంటున్నాడు”

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.