అనుసృజన

వేప మొక్క

హిందీ మూలం: గీత్ చతుర్వేదీ

అనుసృజన: ఆర్ శాంతసుందరి

ఇది ఒక వేప మొక్క
దాన్ని వంగి
ఇంక కొంచెం కిందికి వంగి చూస్తే
కనిపిస్తుంది వేపచెట్టులా
మరింత వంగితే
మట్టిదేహమైపోతావు
అప్పుడు
దీని నీడని కూడా అనుభవించగలుగుతావు
ఈ చిన్న పాప నీళ్ళుపోసి పెంచింది దీన్ని
దీని పచ్చని ఆకుల్లోని చేదు
నాలుకకి తెలియజేస్తుంది తీయదనం అంటే ఏమిటో
ఎత్తైన వాటిని చూసి భయపడేవారు
ఇక్కడికి రండి
ఈ చిన్ని మొక్కనుంచి అందుకోండి సాహసాన్ని

***

(గీత్ చతుర్వేదీ 1977 లో ముంబైలో పుట్టాడు.నెరుదా,లోర్కా,ఆకోవా,విదేశీ కవుల కవితలనీ, మరాఠీ కవుల కవితలనీ హిందీలోకి అనువదించాడు.భోపాల్ నుంచె వెలువడే ‘దైనిక్ భాస్కర్ ‘ దినపత్రికకి సంపాదకుడిగా పనిచేస్తున్నాడు.ఇతని కవితలు ఆరు భాషలలోకి అనువదించబడ్డాయి)

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.