“నెచ్చెలి”మాట 

ధైర్యమే 2025!

-డా|| కె.గీత 

2025 నాటికి
నోట్రదామస్ చెప్పినట్టో
సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో
పుకార్లలో
వినీ
కనీ
ఏదో జరిగిపోతుందని
లోకం అంతమైపోతుందని
భయపడే సంవత్సరం
వచ్చేసింది!

అయినా
ఆ.. ఏముందిలే
2020వ సంవత్సరపు
కరోనాని
ఊహించలేనివారు
2025ని
చూసొచ్చారా?

2025 అంటే
ఈ శతాబ్దపు
సిల్వర్ జూబ్లీ
కదూ!

19వ శతాబ్దిలో
పుట్టిన అందరికీ
2025 ని చూడడమంటే
గొప్ప అద్భుతమే
కదూ!

ఒహోయ్
వట్టి నూతన సంవత్సరం
కాదండోయ్..
2025లోకి
వచ్చేసాం!


అని
పేద్ద గొప్ప
చెప్పుకోవడం
కదూ!

ఎంతైనా
మనోబలమే
సగం
ఉత్సాహం
కదూ!

మరి
నోట్రదామస్ నీ
సైన్స్ ఫిక్షన్ నీ
పుకార్లనీ
పక్కనపెట్టి
2025
సంవత్సరాన్ని
సంతోషంగా
ఆహ్వానిద్దాం!

ఏమీ జరగదని
ఏం జరిగినా
ఏమీ కాదనీ
భయపడేది
లేదనీ
తెగేసి
చెబుదాం

2025
ధైర్యానికి
మారుపేరని
నిరూపిద్దాం!

*****
పాఠకులందరికీ
రచయిత(త్రు)లందరికీ
సహకరిస్తున్న అందరికీ
నెచ్చెలి
2025
నూతన
సంవత్సరపు


శుభాకాంక్షలు!

****

నెచ్చెలి పాఠకులందరికీ సదవకాశం: 

          ప్రతినెలా నెచ్చెలి  పత్రికలో వచ్చే   రచనలు / “నెచ్చెలి” యూట్యూబ్ ఛానెల్లో వచ్చిన ఆర్టికల్స్ వేటిపైనైనా వచ్చిన కామెంట్ల నించి ప్రతి నెలా ఒక ఉత్తమ విశ్లేషణాత్మక కామెంటుని ఎంపిక చేసి  ప్రకటిస్తాం. పాత రచనల మీద కూడా కామెంట్లు చెయ్యవచ్చు. 

          మరింకెందుకు  ఆలస్యం? రచనల్ని చదివి వివరంగా కామెంట్లు పెట్టడం ప్రారంభించండి.  

          వినూత్నం, వైవిధ్యం ప్రధాన నిలయాలైన  “నెచ్చెలి”లో  వస్తున్న వివిధ వినూత్న రచనల్ని తప్పక చూసి, చదివి ఆనందిస్తారు కదూ!

*****

డిసెంబరు, 2024 లో ఎంపికైన ఉత్తమ కామెంటు రాసిన వారు:  అజ్ఞాత పాఠకులు 

ఉత్తమ కామెంటు అందుకున్న పోస్టు: ఇగో— ( అహం అడ్డు)

(నెచ్చెలి-2024 కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ) -అయ్యలసోమయాజుల సుబ్రహ్మణ్యము

 ఇరువురికీ  అభినందనలు!

****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.