“నెచ్చెలి”మాట 

తనకోపమె తన శత్రువు

-డా|| కె.గీత 

జీవితంలో
ఎన్ని మెట్లు!
ఎన్నెన్ని మెట్లు!

కొన్ని అవరోహణలు-
కొన్ని అధిరోహణలు-

ప్రతీ మెట్టులోనూ
కొన్ని
గొప్పగా
విర్రవీగేవి
కొన్ని
ముక్కు పగిలేటట్లు
బోర్లాపడేవి

అయినా
ఎవ్వరం
ఏవీ నేర్చుకోం

దేనినీ
లెక్కచెయ్యం-
ఎవ్వరినీ
క్షమించం-

దహనం
దహనం
అంతర్దహనం
బహిర్దహనం

తనకోపమె
తన శత్రువు
తనకోపమె
తన శత్రువు

నీతులు- గోతులు
మాటలు – బల్లేలు

తన శాంతమె
తనకు రక్ష
ఏది శాంతి
ఏది రక్ష

ఆరోగ్యం
పక్కనబెట్టి
ఆ రోగం
ఈ రోగం
కొని తెచ్చు
చేసుకుంటాం

పరువు
ప్రతిష్ట
మోసం
ద్రోహం
కోపం
…..

పతనాల లిస్టులో
ఆరోగ్యపు స్థానమేది

ఏదో రోజున
త్వరపడి
కంచికి చేరే కథ
దాపున
పొగర్లు-
విరగబాట్లు-
కుతంత్రాలు-
కుత్సితాలు-

ఆడిపోసుకున్న
అందరూ
పడీ లేచీ
పాకులాడాలనుకుంటాం
నోరుపారేసుకున్నా
అంతా
చివరకి
చుట్టూ చేరాలనుకుంటాం

తనకోపమె
తన జీవితకాలపు
శత్రువు
తన శాంతమె
తన ఆరోగ్యపు
రక్ష

చెయ్యి కాలక ముందే
నేర్చుకుంటే ఎంత బావుంటుంది!
ఎంత బావుంటుంది!

****

నెచ్చెలి పాఠకులందరికీ సదవకాశం: 

          ప్రతినెలా నెచ్చెలి  పత్రికలో వచ్చే   రచనలు / “నెచ్చెలి” యూట్యూబ్ ఛానెల్లో వచ్చిన ఆర్టికల్స్ వేటిపైనైనా వచ్చిన కామెంట్ల నించి ప్రతి నెలా ఒక ఉత్తమ విశ్లేషణాత్మక కామెంటుని ఎంపిక చేసి  ప్రకటిస్తాం. పాత రచనల మీద కూడా కామెంట్లు చెయ్యవచ్చు. 

          మరింకెందుకు  ఆలస్యం? రచనల్ని చదివి వివరంగా కామెంట్లు పెట్టడం ప్రారంభించండి.  

          వినూత్నం, వైవిధ్యం ప్రధాన నిలయాలైన  “నెచ్చెలి”లో  వస్తున్న వివిధ వినూత్న రచనల్ని తప్పక చూసి, చదివి ఆనందిస్తారు కదూ!

*****

జనవరి, 2025 లో ఎంపికైన ఉత్తమ కామెంటు రాసిన వారు:  కె.సౌజన్య 

ఉత్తమ కామెంటు అందుకున్న పోస్టు: బాలానందం కథ – విజయదుర్గ తాడినాడ

 ఇరువురికీ  అభినందనలు! 

****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.