బతుకు పుస్తకం

-లక్ష్మీ శ్రీనివాస్

గాయ పడ్డావో
జ్ఞాపకాలతో
బంధింప పడ్డావో
అవమానాల
వలలో చిక్కుకొన్నావో
తెలియని అయోమయ
స్థితిలో మునక లేస్తున్నావా??

నిన్ను నువ్వు చూడాలా
నువ్వు ఎక్కడ ఓడిపోయావో
ఆ చోటు నుంచి నిన్ను నువ్వు
చూడడం మొదలు పెట్టు.
నువ్వు ఎంటో అర్థం అవుతుంది
నీ గమ్యం ఎంటో తెలుస్తుంది
తల దించిన చోటే
తల ఎత్తేక్షణం నీ ముందు
ఆవిష్కరింప బడుతుంది
ఆ క్షణాన్ని ఆయుధంగా మార్చుకొంటే
నీ జీవితం మరో జీవితానికి
ఆదర్శం అవుతుంది.

నీ బతుకు పుస్తకంలో
చిరిగి పోయిన పేజీలు
ఎండి పోయిన అక్షరాలు
కొత్తగా మళ్లీ చిగురిస్తాయి
కొత్త ఆశయాలతో
ప్రపంచానికి గెలుపు
సువాసనలు వెదజల్లుతాయి
కొత్త చరిత్రకు నాంది ప్రస్థానం
నీ బతుకు పుస్తకం అవుతుంది !!

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.