చిత్రం-63

-గణేశ్వరరావు 

 
image.png
          ఫోటో చూసారుగా? మాయా .. మంత్రమూ .. తంత్రమూ లాంటివి ఇందులో ఏమీ లేవు.
 
          ఈ టెక్నిక్ ను ‘Drostee” అంటారు. ఒక డచ్ కాఫీ ప్రకటనలో ఒకామె చేత్తో కాఫీ డబ్బా పట్టుకొని నిల్చొని వుంటుంది, ఆమె చేతిలో ఉన్న డబ్బా మీద ఉన్న చిన్న బొమ్మలో – అదే ఫోటో కనిపిస్తుంటుంది. అలా అప్పటి నుంచే ఒక ఫోటోలోని బొమ్మలో బొమ్మలు ఉండటం – ఒక దానికన్నా మరొకటి చిన్నగా తరుగుతూ వస్తూ ఉండటం .. చూపించే ప్రక్రియకు ‘డ్రాఫ్టీ’ పేరు వచ్చింది.
 
          కథల్లో కూడా ఈ టెక్ని ఉంది. – కథలో కథ, ఫ్లాష్ బ్యాక్ .. శిల్ప చాతుర్యం కనబరిచే రచయితలు చేసేది అదే – కథను చివర్లో వచ్చే సన్నివేశంతో మొదలు పెడతారు, మొదటికి వస్తారు..హీరో పుట్టడం చెబుతారు. కథకు కాదు గాని నవలకు ఇటువంటి గిమ్మిక్స్ (gimmicks) కొత్త అందాన్నిస్తాయి, బ్యాక్ స్టోరీలతో కథకు depth చేకూరుతుంది. కథలో కథలు రావడం మనం ఎన్ని చూడటం లేదూ? అరేబియన్ నైట్స్ కథల గురించి వినలేదూ? కథల అగాథంలో కూరుకు పోయినట్టే! లెక్కలేనన్ని అద్దాల మధ్యననిల్చుని, మిమ్మల్ని మీరు వాటిలో చూసుకుంటూ ఉంటే ఎలా ఉంటుందంటారు?
 
          ఫోకస్ ఫోటో పైనే ఉండాలి, అసలు ఫోటో కి చిన్న చిన్న నకళ్ళు తయారు చేసుకుంటూ పోవాలి, అంటే అసలు ఫోటోలో నుంచి photoshop ద్వారా నేపథ్యాన్ని తగ్గించుకుంటూ పోవాలి, అలా తగ్గించుకు పోతూ చివరికి ఒక దశ చేరుకుంటారు, మీ బొమ్మని మీరే గుర్తించలేని దశ. అప్పుడు ఆపేయండి. మీరు తయారు చేసిన చిన్న చిన్న బొమ్మలను ఇలా కళాత్మకంగా అమర్చండి.. ఫోటోషాప్ లో లేటెస్ట్ వెర్షన్ వాడండి.
‘ముత్యాలముగ్గు’ లో రావు గోపాలరావు మాటలతో ‘సెగట్రీ, ఆకాసం వంక చూడు, ఏదో మర్డర్ జరిగినట్టు లేదూ..మడిసన్నాక కూసింత కలాపోసన వుండాలి గదా!’ అనుకుంటూ ముందుకు పదండి – ఇలాటి ఫొటోలతో!
 
          సినీ గేయకవి భువనచంద్ర రాజు ఒక అజ్ఞాత స్టిల్ ఫోటోగ్రాఫర్ తీసిన ఈ చిత్రం చూస్తూ ‘తన అంతరంగాన్ని విప్పి చూపుతూ వున్నట్టు వుంది: బాల్యం దాటి యవ్వనం చివరి అంచున వున్న ముఖం . బాల్యం ఎక్కడికి పోయిందీ ? ఎక్కడకూ పోలేదు ,,, పెరిగిన ఈ శరీరంలో వుంది, జ్ఞాపకాల ఫ్రేంలో భద్రంగా ..! యవ్వనమూ అంతే, మరో జ్ఞాపకాల ఫ్రేంలో ఇమిడి పోతుంది ….!!..అన్నారు:
*****
Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.