“నెచ్చెలి”మాట 

సుంకము

-డా|| కె.గీత 

సుంకమనగానేమి?
శుల్కమా?
పన్నా?
టాక్సా?
టారిఫా?
(లేక)
పై అన్నియునునా?

హయ్యో
ఖర్మ
ఒక్కటి వదిలేసారుగా-

ఏమది?

పైవన్నిటితో
బాటూ
“ముంచునది”

అది ఎట్లగును?
ఎన్నడూ
విన్న పాపమును పోలేదే!

అదే మరి-
ఆదాయపు పన్ను
వ్యయపు పన్ను
అమ్మకపు పన్ను
కొనుగోలు పన్ను
ఇంటి పన్ను
వాకిటి పన్ను
కూర్చుంటే పన్ను
నిల్చుంటే పన్ను

ఔరా!
ఇన్ని
పన్నులు
రాజుల కాలమున
దొరల కాలమున
పెత్తందారుల కాలమున
……
ఏ కాలమునను
ఉన్నట్టుల
దాఖలములు
లేవు

ఇంతేనా?!
ఎక్సైజ్
కస్టమ్స్
సర్వీస్
ఎంటర్టైన్ మెంట్
కార్పోరేషన్
…..
అంతేనా
పాత పన్నులు
కొత్త పన్నులు
…….

హతవిధీ
ఇక చాలును
పాత
సుంకములు చాలక
కొత్తవియును
ఉన్నవా

అయినను
అసలు
సుంకముల
వలన
నాకేమి
నష్టము?
ఏమి కష్టము?
ఎగుమతులకు
దిగుమతులకు
ప్రభుత్వములకు
దేశములకు
గాని

మరదే-
విదేశీ మారక ద్రవ్యాలు
స్టాకు మార్కెట్లు
ద్రవ్యోల్బణాలు
ఇళ్ళ ధరలు
కూరగాయల ధరలు
నిరుద్యోగాలు
బ్రతుకుతెన్నులు

ఎట్నుంచి ఎటు
ఏది మారినా
పడేదంతా-
సుంకమంతా-
సామాన్యుడి
నెత్తి మీదే

అటులనా?
ఇక
ఏమందును!

‘మునిగినది’
అని మాత్రము
అర్థమగుచున్నది

****

నెచ్చెలి పాఠకులందరికీ సదవకాశం: 

          ప్రతినెలా నెచ్చెలి  పత్రికలో వచ్చే   రచనలు / “నెచ్చెలి” యూట్యూబ్ ఛానెల్లో వచ్చిన ఆర్టికల్స్ వేటిపైనైనా వచ్చిన కామెంట్ల నించి ప్రతి నెలా ఒక ఉత్తమ విశ్లేషణాత్మక కామెంటుని ఎంపిక చేసి  ప్రకటిస్తాం. పాత రచనల మీద కూడా కామెంట్లు చెయ్యవచ్చు. 

          మరింకెందుకు  ఆలస్యం? రచనల్ని చదివి వివరంగా కామెంట్లు పెట్టడం ప్రారంభించండి.  

          వినూత్నం, వైవిధ్యం ప్రధాన నిలయాలైన  “నెచ్చెలి”లో  వస్తున్న వివిధ వినూత్న రచనల్ని తప్పక చూసి, చదివి ఆనందిస్తారు కదూ!

*****

మార్చి, 2025 లో ఎంపికైన ఉత్తమ కామెంటు రాసిన వారు:  నీరజ వింజామరం   

ఉత్తమ కామెంటు అందుకున్న పోస్టు:స్ఫూర్తి (కథ)-కప్పగంటి వసుంధర

 ఇరువురికీ  అభినందనలు! 

****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.