ప్రమద
రాజేశ్వరి రామాయణం
–సి.వి.సురేష్
“In spite of difference of soil and climate, of language and manners, of laws and customs, in spite of things silently gone out of mind and things violently destroyed, the Poet binds together by passion and knowledge the vast empire of human society, as it is spread over the whole earth, and over all time. The objects of the Poet’s thoughts are everywhere; though the eyes and senses of man are, it is true, his favorite guides, yet he will follow wheresoever he can find an atmosphere of sensation in which to move his wings. Poetry is the first and last of all knowledge—it is as immortal as the heart of man.”
—William Wordsworth, “Preface to Lyrical Ballads“
***
ఆమె పేరు రాజేశ్వరి రామాయణం. ప్రమద శీర్షిక కు ఆమెను పరిచయం చేయాలని, మాట్లాడాలని ఫోన్ చేసాను. చాల విద్వత్తు గల కవయత్రి రాజేశ్వరి రామాయణం.
పుట్టింది, పెరిగిందీ ప్రొద్దుటూరులో. ఆమె కవిత్వాన్ని చదివాక, వర్డ్స్ వర్త్ లిరికల్ బాల్లడ్స్ కు రాసిన ఈ వాఖ్యాలు గుర్తుకు వచ్చాయి.
ఆమె గురించి, ఆమె జీవన, సాహిత్య ప్రయాణం గురించి ఆమె మాటల్లోనే విందాం….
* కారణాలు ఏవైనా నేను టెన్త్ ఫెయిల్ అయ్యాను. నాకు టీచర్ పోస్టింగ్ వచ్చింది. అవమాన పడిన చోటే, నిల దోక్కుకోవాలనుకొన్నాను. సబ్జెక్టు లో బాగా కష్ట పడ్డాను. పబ్లికేషన్స్ కి రాసాను. జిల్లా స్థాయి లో సబ్జెక్టు ఎక్స్పర్ట్ గా పేరు తెచ్చుకొన్నాను. NCERT సెమినార్ లో , పదవ తరగతి బోర్డుని రెప్రెసెంట్ చేసే అవకాశం డిప్యూటీ కమీషనర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ కుమార స్వామి గారి ద్వారా వచ్చింది. గొప్ప వరంగా భావిస్తాను. నేనివాళ ఇలా ఉన్నానంటే , ఒక తండ్రి లాగ నాకు ఆయన వెన్నంటి ఆశీర్వచనంగా ఉండటమే
బాల్యం…జీవితం పై…
5 వరకు స్కూల్ లేదు. ఐదు నుండి మునిసిపల్ గర్ల్స్ హై స్కూల్లో. ఇంటర్మీడియట్ డి.ఏ. డబ్లు కాలేజిలో . డిగ్రీ కామిశెట్టి కళాశాల. బి.ఏ. చదివాను. B.Ed చేసాను.
ఉస్మానియా యూనివర్సిటీ లో పి.జి. చేరి. ఆపేసాను. ఇది అంతా 2000 లో జరిగింది. ఈ లోగా నాన్న మరణించాడు. నాన్న పద్మనాభ రావు ఒక ప్రైవేటు స్కూల్ నడిపే వాడు. మగ సంతానం లేక పోవడం తో, ఇంటి బాధ్యతలు తీసుకోవడానికి నేను బి..ఎడ్ ను స్టాప్ చేసి వచ్చేసాను. ఇంటర్ మీడియట్ నుండి నేను నాన్నకి చేదోడు వాదోడు గా ఉండేదాన్ని.
సాహితీ ప్రయాణం : చదవటం ఇష్టం. నాన్న బాగా చదివేవాడు. నాన్న కోసం లైబ్రరీ కి వెళ్లి, బుక్స్ తీసుకు రావడం తో నాకూ ఆసక్తి మొదలయింది. తర్వాత, డిస్కస్ చేసేవారు. కథలు, నొవెల్స్, , సాహిత్యం, పాటలు వగైరా అన్ని చర్చించే వాళ్ళం. అట్లా కొంత ఇంట్రెస్ట్ వచ్చింది. నేను బాగా సీరియస్ గా చదివింది యూనివర్సిటీ కాంపస్ లైబ్రరీ లోనే. pablo నెరుడా పై ఎక్కువ చదివింది ఎస్. వి. యూనివర్సిటీ లో.
డెమో క్లాసేస్ కి ఒక ఇంట్రెస్ట్ టాపిక్ కావాలి. ఆ క్రమం లో లైబ్రరీ లో వెతకడం జరిగింది. అప్పుడు పాబ్లో నెరుడా ను బాగా చదివాను. ఎమిలి డికెన్సన్ చదివాను. కాంపస్ లోని పి.జి. క్లాస్ మేట్స్ దగ్గర బుక్స్ తెచ్చు కోవడం చదవడం జరిగింది. సాహిత్యం పట్ల ఆసక్తి పెరిగింది.
సరోజిని నాయుడు రాసిన “బాంగిల్ సెల్లెర్స్” , రవీంద్ర నాథ్ టాగూర్ రాసిన గీతాంజలి లోని “where the mind is without fear” లను మేము టీచ్ చేయాలి. మోడల్ క్లాస్లలలో విద్యార్థులకు ఆసక్తి రేకెత్తించడానికి కొత్త కొత్త రిఫరెన్స్ లు వెతికేవాళ్ళం. రైమ్స్ ను collect చేయడం మొదలు పెట్టాను. ఆ రైమ్స్ ద్వారా, పిల్లలకు బోధించడం నచ్చింది. ఆ రైమ్స్ నుండి నా సాహిత్య ప్రయాణం సీరియస్ పోయెట్రీ లోకి transform అయ్యింది.
నాన్న మరణం నన్ను కలిచి వేసింది. శవ దహన కార్యక్రమాలు నేను చేయలేక పోయాను. ఆంక్షలు కలిచి వేసాయి. ప్రతి విషయం లో నాన్న కు నేను తోడు ఉండేదాన్ని. ఇక నాన్నకు తోడెవ్వరు అని కుమిలి పోయాను. నేను అశక్తురాలిగా మిగిలిపోయాను. అమ్మా, చెల్లి నా బాధ్యతలుగా మిగిలిపోయారు.
అమ్మకు నా పెళ్లి ఒక పెద్ద సమస్య. ఆమె ఆలోచనల్లో సంఘర్షణ. అనంతమైన వేదన నాకు కనిపించింది. నాన్న చనిపోవడానికి ముందు చూసిన ఒక పెళ్లి సంబంధం వచ్చింది. నాన్న చనిపోయాక వాళ్ళు మాట మార్చి, మాకున్న ఒక్కగానొక్క ఇల్లు కట్నం కింద రాయి౦చాలన్నారు. ఇదే జరిగితే, కుటుంబ బాధ్యతలను విస్మరించిన దాన్ని అవుతాను. నేనే ఆ సంబంధాన్ని వద్దని చెప్పేశాను.
మా మామ కుమారుడు ఇంటర్ మాత్రమే చదివారు. నేనేమో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివి టీచింగ్ ప్రొఫెషన్ లో ఉండినాను. అయినప్పటికీ కట్నం ఏమీ లేకుండా పెళ్ళికి ఒప్పుకొన్నారు. పెళ్లి తర్వాత భర్తతో డిగ్రీ పూర్తి చేయించి, మెడికల్ ప్రాక్టిషనర్ గా రాణించేందుకు నేను సహకరించాను. మంచి హోదా కలిగిన వ్యక్తి అల్లుడు కావాలన్న నాన్న కోరిక ఒక వైపు, ఇంటి బాధ్యతల తో ఉన్న ఒక్కగానొక్క ఇల్లు పోగొట్టు కొన్న వాళ్ళం అవుతామని ఇంకో వైపు.. !
నా భర్తకు ఆత్మ న్యూనతకు గురికాకుండా ఒకవైపు, బాధ్యత గల పెద్ద కూతురు గా కుటుంబాన్ని చూసుకొంటూ సమతౌల్యాన్ని పాటించాను. చెల్లిని గ్రాడ్యుయేషన్ చదివించి, అలాగే పోస్ట్ గ్రాడ్యుయేషన్ హిందీ చేయించి, అందులో గోల్డ్ మెడల్ వచ్చేందుకు కూడా నా వంతు కృషి ని చేసాను. చెల్లి పెళ్లి కూడా నేనే జరిపించాను.
తెల్లవారు జామున అయిదు గంటల నుండి ఇంటి దగ్గర ట్యూషన్లు చెపుతూ, ఏడు గంటల నుండి తొమ్మిది వరకు పార్ట్ టైం ఒక స్కూల్ లో చెపుతూ, తర్వాత రెగ్యులర్ గా క్లాసెస్ కు వెళ్ళేదాన్ని. సాయింత్రం ఇంటికి వచ్చాక, 9.30 వరకు ట్యూషన్లు చెపుతూ సంపాదనను ప్రోగు చేసుకోన్నాను. రెండు రోజుల్లో డెలివరీ అవుతున్నావని డాక్టర్ చెప్పినా, అప్పుడు కూడా నేను ట్యూషన్ లను, క్లాసులను చెపుతూ వచ్చాను. చిన్న కుమారుడు కాన్పు సమయం లో , ఉదయం అంతా క్లాస్ లు దువ్వూరు లో అటెండ్ అయ్యి, ఇంటికి వచ్చి, రాత్రి 7 గంటలకు హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యాను. సిజరిన్ ఆపరేషన్ జరిగింది. 31 రోజే క్లాసు లకు అటెండ్ అయ్యాను. మధ్యలో పర్మిషన్ తీసుకొని ఇంటికోచ్చి బేబీ కి ఫీడింగ్ ఇస్తూ వచ్చాను. నైట్ డ్యూటీ ఉన్నప్పుడు పాప ను కూడా తీసుకొని వెళ్ళే దానిని.
2013 లో అమ్మ మృతి చెందారు. ఇదంతా నేను కాలం అనే కవిత లో చెప్పను. నాకూ, కాలానికి చాలా పోటీ ఉంటుందని.
-అంటూ ఆమె గద్గద స్వరం తో చెప్పుకొచ్చారు.
పోస్టింగ్ వచ్చాక ఇంకో వేదన మొదలైంది. తన చుట్టూ ఉన్న వాళ్ళు నా ఆహార్యానికి, నేను వేసుకొనే ఆభరణాలకు ఇచ్చే గౌరవం మనిషికి ఇవ్వరని తెలిసి పోయింది. నా వెనకాల మాట్లాడుకోవడం విన్నాను. అది తెలీకుండానే ఎవరితో కలవడం ఇష్టం లేకుండా పోయింది. స్టాఫ్ రూమ్ పూర్తిగా avoid చేసాను. ఎంత మంది లో ఉన్న మొహం మీద ఒక పేలవమైన నవ్వు నాలో నుండి వచ్చేది.
నాకు, నా క్లాస్ రూమ్ పిల్లలు ముఖ్యం అయ్యారు. నేనేంటో పిల్లలకు తెలిస్తే చాలు అని అనుకొని, మిగతా విషయాలన్నీ పట్టించు కోవడం మానేసాను.
గాఢత తో, కొత్త అభివ్యక్తులతో, భావుకత నిండిన అనేక పదాల ప్రావాహం తో రాజేశ్వరి సాహితీ చరిత్రలో ఒక కొత్త స్థానాన్ని సంపాదించింది.
చిట్వేలు లో ఉండగా, దొండ్ల వాగు శ్రీనివాసులు ఒక టీచర్ ఉండేవారు. తన దగ్గర చాల పుస్తకాలు ఉండేవి. ఆ పుస్తకాలను ఎక్కువగా తెచ్చుకొని చదివాను. స్కూల్ లో పాత లైబ్రరీ ఉంది. కృష్ణ శాస్త్రి గారిని, చలం సర్వస్వం ను అక్కడే చదివాను. నామిని సాహిత్యం పరిచయం కూడా అతడి దగ్గరే జరిగింది.
పాబ్లో నెరుడా క్వీన్ పోయెమ్ కోసం గూగుల్ లో వెతుకు తున్నప్పుడు తెలుగు అనువాదం దొరికింది. ఈ అనువాదం ఎవరు రాసారని అని పేస్ బుక్ కోసం వెతికాను. నాకు అప్పుడు పేస్ బుక్ ఎకౌంటు లేదు. శ్రీనివాసులు గారు తన ఎఫ్బి అకౌంట్ లో నుండి ఆ పోయెమ్ ను వెతికించి ఇచ్చారు. ఆ తెలుగు అనువాదం మీది అని తెలిసింది. తర్వాత నా భర్త ఫోన్ లో నుండి పేస్ బుక్ చూసి, అప్పుడు కవి సంగమం మంచిగా ఉందని తెలిసి, నేను ఎఫ్ బి. ఎకౌంటు open చేసుకొని , ఇక కవితలన్నీ చదువుతూ వెళ్లి పోయాను. కవి సంగమం లో మెంబెర్ అయ్యాక కేవలం అనువాదాలు బాగా చదివాను. దాదాపు 20 అనువాదాలు పైగా చదివాను. చాల ఇంప్రెస్ అయ్యి నేను రాయడం మొదలు పెట్టి, నేను రాసిన మొదటి పోయెమ్ ‘ప్రేరణ’ ను పోస్ట్ చేసాను.
స్త్రీ వాద కవిత్వం పై….
స్త్రీ వాద రచనలు రావాలి. ఎన్నో చదువుతూ వచ్చాను. తనకేం కావాలో బలంగా చెప్పగలుగుతుంది ప్రస్తుతం స్త్రీ. ఒకప్పుడు కేవలం జరిగిన అనర్థాలు చెప్పుకొచ్చారు. కానీ, ఇప్పుడు రచయుత్రులు తమకేం కావాలో చెప్పుకొస్తున్నారు. నాకు అది బాగా నచ్చిన విషయం.
భావ సాంద్రత తో , ఒక సంఘర్షణ ను కవిత్వం చేసే రాజేశ్వరి చాల నింపాదిగా తన సాహితీ ప్రయాణాన్ని చెప్పుకొచ్చారు.
నాలో మార్పు….
నా కవిత్వం లో ఒక మార్పు రావడానికి కారణం మీరే. కొత్తగా, “బులుగు మెట్లు” అనే కవిత రాసినప్పుడు మీరు ఆ కవితపై కూలంకషంగా చర్చించారు. కవిత బయటకు వచ్చే వరకూ ఒకటికి రెండు సార్లు క్రాస్ చెక్ చేసుకోమనీ, ఏమి చెప్పదల్చుకోన్నారో స్పష్టంగా ఉండాలన్నారు. వాక్య నిర్మాణం ఎంత ముఖ్యమో మన అనుభూతి ని అంతే స్పష్టంగా పాఠకుడికి చేరేలా రాయాలని మీరు చెప్పిన మాట నా సాహితీ ప్రయాణం లో ఒక కీలక మలుపు.
కవిత్వం పట్ల నాకో దృక్పధం ఏర్పడుతున్న కాలం లో నాకు ఫణి మాధవి కన్నోజు పరిచయం అయ్యారు. కవి సంగమం గురించి నేను రాసిన మొదటి వ్యాసానికి ఆమె స్పందించడం తో మొదలైన స్నేహం, అనేక రకాలుగా సాహితీ చర్చలు , విశ్లేషణలు చేస్తూ క్రమంగా బలపడింది. ఆమె అపరూప స్నేహాన్ని నేను ఎన్నటికి మరువలేను.
****
||అవలోకనం…||- రాజేశ్వరి రామాయణం
|| OVER VIEW || -అనుసృజన: సి.వి. సురేష్
amidst
the dusk and the nocte
Transforming the ruby shades into obscurity
n’ while you yourself
searching in the layers of the soul..
Cross away the running faces
On the moving screens
N’ when the hand touches
The soul instead the pockets
..
Some time away,
when you lost yourself…
N’ the friendship which endorses
The life to the brighter side of you..
N’ the solicitudes
Reached the inner souls by crossing
The screens of the mist….!
..
Bethink….
The bonding which kept away
Of your troubled febrile..
In the shades of cilium
remember the affection..
which owned you as originally you…!
..
Don’t know…
You might have travel long way
On the wings of time.
By keeping away the persons
Who want to listen your heart-beats
May be, the babbling in the sleep alleviates
Those who did not receive the greet .
..
Don’t know….
It may be the last gift
That you send for them
|| అవలోకనం ||
సాయంత్రానికి రాత్రికి మధ్య…
కేంజాయ రంగులు చీకట్లుగా మారుతూ…
మనసు పొరలలో నిన్ను నువ్వు వెదుకుతున్నపుడు
కదులుతున్న తెరలపై పరుగెడుతున్న ముఖాలు దాటి
నీ చేయి జేబును కాక మనసును తడుముతున్న వేళ
..
అపుడెపుడో నిన్ను నువ్వు పోగొట్టుకున్న కాలాన..
నీలో పచ్చదనానికి వూపిరులూదిన స్నేహాన్ని …
మంచుతెరలను దాటి మనసులోతుల్ని చేరిన
ఆప్యాయతల్ని ……
..
కనురెప్పల నీడలలో నీ కలతల తాపాన్ని దరిచేరనివ్వని
బంధాన్ని…..
నిన్ను నిన్నుగా సొంతం చేసుకున్న అనురాగాన్ని
గుర్తుచేసుకో…..
ఏమో…
కాలం రెక్కలపై నువ్వు ఎంతో దూరం వచ్చేసి ఉంటావు…
నీ గుండె చప్పుడు వినాలని తపించే వారికి దూరంగా…..
కనీసం పలకరింపు కాకపోయినా పలవరింపు ఐనా వారికి
ఉపసమనమిస్తుందేమో…
ఏమో….అదే వారికి నువ్వు పంపే చివరి కానుకేమో…
*****
సి.వి. సురేష్ : కడప జిల్లా, ప్రొద్దుటూరుకు చెందిన ప్రముఖ న్యాయవాది. ఫ్రీలాన్స్ జర్నలిస్ట్. సాహితీ ప్రేమికులు. 2013 నుంచి సాహిత్య వ్యాసంగంలో ఉన్నారు. చారిత్రక ప్రతీకలు అరుదైన సిమిలీలతో సాగే వీరి కవితలు పాఠకహృదయాల ఆదరణ పొందాయి. అనుసృజనలు వీరి ప్రత్యేకత. ఇప్పటివరకూ డెబ్భై కు పైగా కవితలు తెలుగు నుంచి ఇంగ్లీష్ లోకి.. ఎనభై పై చిలుకు కవితలు ఆంగ్లం నుంచి తెలుగులోకి అనువదించారు. అందులో క్లిష్టమైన సూఫీ పోయెట్రీ సంగం పోయెట్రీ కూడా ఉన్నాయి. కవిసంగమం ఫేస్బుక్ గ్రూప్ లో ప్రతి బుధవారం “కవిత్వానువాదం” శీర్షిక, ప్రజాపాలన పత్రిక ‘విభిన్న’ సాహిత్య పేజీల నిర్వహణ, రస్తా మరియు సారంగ వంటి ప్రముఖ వెబ్ మేగజైన్స్ లో కాలమ్స్ నిర్వహిస్తున్నారు.
మీ జీవన ప్రయాణం ఎందరికో స్పూర్తి రాజేశ్వరి గారు..మిమ్మల్ని తెలుసుకోవడం చాలా హేపి అనిపించింది..అభినందనలు
గొప్ప పరిచయం
వ్యాసం చదువుతున్నంత సేపు ఆనందం, బాధ రెండూ అచ్చరాల వెంట ఉరికినాయి. ఆడపిల్లల్లో తురుపుముక్క, కత్తి అనుకున్యా. కష్టాలొచ్చాయని కూర్చోకుండా నడివగలిగే శక్తి కి జోహార్లు!
స్టాఫ్ రూములో పోలేదని చెప్పినపుడు మన సమాజమే స్టాఫ్ రూమ్ అనిపిచ్చినాది.
మీ సంకల్పబలం మీకు రక్ష!
అక్షరాలు చదివినట్లు లేదు జీవితాన్ని చూసినట్టుంది త్రీడీలో!
మహిళలలకు స్ఫూర్తి మీ అంతరంగం.
పద్దన్నే చదువుతానే ఏగొప్ప శక్తి వచ్చినట్లనిపించినాది.
నిచ్చెలికి, సి.వి.సురేష్ గారికి, రాజేశ్వరి గారికి నా నమస్సులు !
రాకేశ్వరి గారి జీవిత, సాహిత్య ప్రయాణం నేటి యువతకు ఆదర్శంగా ఉంది ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా ఓ శక్తి గా తనని తాను నిర్మించుకున్న తీరు మార్గదర్శనిలా ఉంది. గ్రేట్ రాజేశ్వరి గారు
సీవీ సర్ మంచి ఆదర్శమూర్తిని సాహిత్యాన్ని పరిచయం చేశారు