ఒక అమ్మ డైరీ

(మహిత సాహితీ & నెచ్చెలి కథల పోటీ-2021లో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ)

– ఎమ్.సుగుణరావు

అది జిల్లా పరిషత్ఉన్నత పాఠశాల. పదవ తరగతి గది. సమయం ఉదయం పది దాటింది. ఆ క్లాస్లో ప్రవేశించిన సోషల్టీచర్అనుపమ, విద్యార్థుల్లోంచి ముగ్గిర్ని పిలిచింది. తనతో తెచ్చిన బెత్తంతో ఆ ముగ్గురిని బలంగా కొట్టింది. వారి చేతులు వాచిపోయాయి. ముగ్గురి కళ్ళల్లో నీళ్ళు నిలిచాయి. కొట్టిన వారినందరినీ ఆమె బైట ఎండలో నించోబెట్టింది. అది శీతాకాలం పొద్దు. అయినా ఎండ చురుక్కుమంటోంది. ముగ్గురు సిగ్గుతో తలలు వంచుకుని నిలుచున్నారు. మిగతా పిల్లలు వారిని పరిశీలనగా చూస్తూ ఉండిపోయారు. వాళ్ళను అనుపమ టీచర్ఎందుకు కొట్టారు?! అందరిలో ప్రశ్నార్ధకం.

రెండు రోజులు వెనక్కి వెళితే, రోజు సాయంత్రం స్కూలు విడిచిపెట్టారు. స్కూలు పక్కనే ఆడపిల్లల హాస్టలు ఉంది. హాస్టలు వైపు వెళుతున్న ఒక అమ్మాయిని ఇప్పుడు దెబ్బలు తిన్న ముగ్గురు అబ్బాయిలు ఏడిపించారు. ఆమె దగ్గరకు వెళ్ళి అసభ్యంగా మాట్లాడారు. ఆమె ఏడుస్తూ హాస్టల్వైపు పరుగులు తీసింది. ఆమెను వెంబడిస్తూ హాస్టలు వైపు వెళ్ళారు. ఎవరో అరవడంతో అక్కణ్ణించి జారుకున్నారు. ఇదీ జరిగిన విషయం.

ఇక వాస్తవంలోకి వస్తే ఎండలో నిలుచున్న పిల్లలను ఆరగంట తర్వాత ప్రిన్సిపాల్గారి గది దగ్గరకు పంపింది. తమ తల్లితండ్రులకు కబురు చేయమని చెప్పింది, విద్యార్థులతో అనుపమ టీచర్‌.

గంట తరవాత పిల్లల తల్లితండ్రులు వచ్చారు. టీచర్అనుపమ పాఠం చెపుతోంది. ప్రిన్సిపాల్గారు ఆమెను పిలిచారు. పాఠం మధ్యలో ఉండటంతో ఆమె కదలలేదు. పూర్తిచేసిన తర్వాత ఆమె ప్రిన్సిపాల్గారి గదికి వెళ్ళింది.

దెబ్బలు తిన్న పిల్లల తల్లితండ్రులు ఇద్దరు మాత్రం అక్కడకొచ్చారు. అనుపమ వంక కోపంగా చూసారు. “పిల్లలను గొడ్డును బాదినట్టు బాదారు. పైగా ఎండలో నించోబెట్టారు. మాకు ఫోన్ద్వారా తెలిసింది. అందుకే పరిగెత్తుకొచ్చాంఅంటూ ఆవిడ మీద అరిచారు.

ఇద్దరి అబ్బాయిల తల్లి తండ్రులు వచ్చారు. మూడో అబ్బాయితరుణ్‌”తల్లితండ్రులు రాలేదేం?” అన్నాడు ప్రిన్సిపాల్‌.

తల్లి ఇక్కడుంది సార్‌!” అంది అనుపమ ప్రిన్సిపాల్గారి ప్రశ్నకు సమాధానంగా.

మాటలకు ప్రిన్సిపాల్గారితో పాటూ అక్కడున్న మిగతా పిల్లల తల్లితండ్రులు ఉలిక్కిపడ్డారు. ఆమె మాటలు వారికి షాక్గా అనిపించాయి.

మరి ఈమె భర్తఅదే కుర్రాడి తండ్రిఅన్నాడాయన. తన ప్రక్కనే ఉన్న ఒక టీచరుతో మెల్లగా.

అతను జైల్లో ఉన్నాడు సార్‌” అన్నాడు టీచర్మెల్లగానే. అలా అన్నా, చిన్న గదిలో అందరికీ ఆ మాటలు వినిపించాయి. తప్పు చేసిన కొడుకును కొట్టింది. భర్త జైల్లో ఉన్నాడు. అంటే, అతగాడూ ఏదో తప్పు చేసి ఉంటాడు. ఆమె స్వయంగా అతగాడిని జైలుకి పంపి ఉంటుంది అనుకున్నారంతా ఆమెను చూసి మనసులో.

అనుపమ నోరు విప్పింది.

తప్పు చేసిన ముగ్గురినీ కొట్టాను. ముగ్గురిలో నా కొడుకూ ఉన్నాడు. వాడిని ఇంకా గట్టిగా కొట్టాను. మిగతా పిల్లల చేతులు బొబ్బలెక్కితే, నా కొడుకు చేతి నుండి రక్తం వస్తోందిఅంటూ ఆమె తన బేగ్లోంచి జేబురుమాలు తీసి కుర్రాడి చేతికి కట్టింది. ఆమె కళ్ళ నించి జలజలా నీళ్ళు రాలి కుర్రాడి చేతిమీద పడ్డాయి. దృశ్యం అక్కడున్న వారి మనసులను కలచివేసింది. ఒక నిమిషం తర్వాత ఆ తల్లితండ్రులలో ఒకాయన మెల్లగా అడిగాడు.

వాళ్ళేం చేసారు మేడమ్‌?!”

అనుపమ అతడి కళ్ళలోకి సూటిగా చూసి అడిగింది.

మీకు మీ అబ్బాయి కాక ఎంతమంది పిల్లలు?” అంది.

ఒక అమ్మాయి ఇంజనీరింగ్చదువుతోంది. వీడు చిన్నవాడుఅన్నాడు.

ఓహ్‌! ఐతే అమ్మాయిని అబ్బాయి అయినా వేధిస్తే ఏం చేస్తారు?” అన్నాడు.

చంపేస్తాఅన్నాడాయన కోపంగా.

అయితే మీ అబ్బాయిని చంపెయ్యండిఅంది అంతే కోపంగా.

ఆయన కొడుకుపై చెయ్యి ఎత్తబోయాడు. అనుపమ వెంటనే… “ఆగండి. చంపెయ్యండి అంటే నేను చంపమన్నది పిల్లల్లోని కసితనాన్ని, రాక్షసత్వాన్ని. కారణం, పసితనం కసితనంగా మారుతున్న రోజులివి. పేపర్లలో చదువుతున్నాం. టీవీల్లో చూస్తున్నాము. మొక్కై వంగనిది మ్రానై వంగునా! తప్పు చేసిన వారిని ఇప్పుడు మనం శిక్షించకపోతే భవిష్యత్తులో ఎన్ని ఘోరాలు చెయ్యడానికైనా వెనుకాడరు. “ఉగ్గు పాలతోనే సిగ్గు లేని పనులు చెయ్యవద్దుని చెప్పాలిఅంది శాంతంగా.

వాళ్ళు తలల వంచుకున్నారు. అనుపమ తలొంచుకొంది తల్లితండ్రుల మాదిరిగా. కొడుకు తనను తల దించుకునేలా చేసినందుకు.

క్షమించండిమీ మీద అనవసరంగా కోపపడ్డాం తల్లితండ్రుల్లో ఒకరు ఆమెకు రెండు చేతులు జోడిస్తూ చెప్పారు.

సంఘటన అలా ముగిసింది. అనుపమ క్లాసురూములోకి వెళ్ళింది. దోషులుగా నిలబడిన ఆ ముగ్గురు విద్యార్థులు తిరిగి తమ తరగతి గదులలోకి ప్రవేశించారు మౌనంగా.

***

ఆరోజు రాత్రి తరుణ్నిశ్శబ్ధంగా ఏడుస్తున్నాడు. మనసులోనే మూగ రోదన. శారీర బాధకన్నా మనసులో బాధ ఎక్కువగా ఉంది. తల్లి తన చేతికి తగిలిన దెబ్బలకు మందు రాసింది. నొప్పి తగ్గడానికి టాబ్లెట్వేసింది. బాధకన్నా తను తప్పు చేసాననే బాధ అతడిని నిద్రకు దూరం చేస్తోంది. గట్టిగా ఏడవాలనిపించింది. తల్లికి నిద్రాభంగం అవుతుందని తన ఏడుపును గొంతు దాటి బయటకు రానివ్వడంలేదు

ఐతే అతడి ప్రయత్నం ఫలించలేదు. గుండెను కదుపుతున్న కన్నీటి ప్రవాహం కళ్ళ నించి వచ్చే ప్రయత్నం. గబగబా గదిలోంచి బైటకు నడిచాడు. డ్రాయింగ్రూమ్లోకి వచ్చాడు. ఇక కట్టలు తెంచుకున్న నదీ ప్రవాహంలా అతని కళ్ళ నించి జలజలా జాలువారిన కన్నీరు. తనివితీరా ఏడ్చాడు. అప్పటికి కాస్త మనసుకు సాంత్వన కలిగినట్లయింది. ఇహంలోకి వచ్చి గదిలో లైటు వేసి చూసాడు. ఆ డ్రాయింగ్రూమ్లో ఒక మూలగా ఎవరికీ కనబడకుండా ఉన్న నాన్న ఫోటో. చిన్నప్పుడు తనను ఎత్తుకొని దిగిన ఫోటోనాన్నతో తన జ్ఞాపకాలు లీలగా ఉన్నాయి. మూడో తరగతిలో ఉండగా నాన్న అదృశ్యమయాడు. తను అడిగితే నాన్న ఊరెళ్ళాడు అనేది అమ్మ తనకు ఊహ తెలిసినప్పటినుంచీ నాన్నకు, అమ్మకు ఏవో గొడవలు అయ్యేవి. తరచూ గట్టిగా అరచుకునేవారు.

తరవాత కొన్ని రోజులకు నాన్న కనిపించడం మానేసారు. తను తరిచి తరిచి అడిగితే, అమ్మ చెప్పేసింది. “నాన్న జైలుకెళ్ళాడుఅంది. ఎందుకు అంటే, “జైలుకు ఎందుకు వెళతారు?” అని తిరిగి ప్రశ్నించింది. తనకు అర్ధమైంది. నాన్న ఏదో తప్పుచేసి జైలుకు వెళ్ళాడు అనిపించింది. అప్పటినుంచీ తను నాన్న గురించి అడగడం మానేసాడు. నాన్నను తనే జైల్లో పెట్టించిందని నానమ్మ, తాతయ్య వాళ్ళు రావడం మానేసారు తమ దగ్గరకు. అమ్మమ్మ వాళ్ళు మాత్రం వచ్చేవారు. ఇంట్లో తనూ, అమ్మఅంతే!

గతం తలుచుకొని బాధపడుతున్నాడు. వర్తమానంలో తను చేసిన పనికి కుమిలిపోతున్నాడు. ఆ పసి మనసులో మొదటిసారిగా ఒక ప్రశ్న ఉదయించింది. ఇంతకీ నాన్న చేసిన తప్పేంటి?! తనను ఎంతో ప్రేమగా చూసుకునే నాన్న తప్పు చేసాడంటే నమ్మకం కలగడంలేదు. విషయం తనకు ఎవరు చెపుతారు? గదిలో పచార్లు చేస్తున్నాడు తరుణ్‌. దుఃఖంతో గుండె బరువెక్కుతోంది. గదిలో అల్మారాలో అమ్మ రాసిన డైరీలు కనిపించాయి. ‘బహుశా ఈ డైరీలలో నాన్న సంగతులు తెలుస్తాయేమో!” అనుకున్నాడు. తను చాలాసార్లు అడిగాడు అమ్మని, ‘ఏం రాస్తుంటావ్అమ్మ…” అని! “నీకు నాకు మధ్య రహస్యాలేముంటాయి. నాన్నానువ్వు ఎప్పుడైనా చదవవచ్చు. అసలు చదవాలి కూడాఅవన్నీ అమ్మ బాధలుకన్నీళ్ళు…” అంది ఒకసారి. అంతే మాటలు గుర్తొచ్చి గబగబా డైరీలు తీసాడు. తిరిగేస్తున్నాడు. ఏదో కవిత్వం రాసినట్టు అమ్మ గుండ్రంగా రాసిన అక్షరాల వెంట అతడి కళ్ళు పరుగులు తీసాయి. “నిజమేఅమ్మ కన్నీళ్ళే. డైరీ నిండాఅనుకున్నాడు.

అలా వెతకగా, వెతకగా అతడికి కావలసిన సమాచారం దొరికింది. అది 2012 సంవత్సరం డైరీ. అంటే తను మూడో తరగతి చదువుతున్నాడు. గబగబా డైరీ తీసి చదివిన తరుణ్కు గదిలో పైన ఫేన్తిరుగుతున్నా చెమటలు పట్టాయి. గుండె వేగంగా కొట్టుకుంది. ఇంక డైరీ చదవటం మానేసి ఆలోచనలో పడ్డాడు. మనసులో బాధ మరీ ఉధృతమైంది

నాన్న ఘోరమైన తప్పు చేసాడు. తనను చిన్నప్పుడు చూసుకోవడానికి పెట్టుకున్న పదహేరేళ్ళ పనమ్మాయిని పాడు చేసాడు. అమ్మాయి పేరు కారుణ్య. నాలుగు గోడల మధ్య నేరం దాగిపోతుందనుకున్నాడు. అయినా అమ్మ ఊరుకోలేదు. నాన్న అమ్మాయి మీద అఘాయిత్యం చేసినందుకు పోలీస్స్టేషన్లో కేసు పెట్టింది. దాని ఫలితంగా నాన్న జైలుకు వెళ్ళాడు. అమ్మ ఒంటరిదైనందుకు బాధపడలేదు. మగ తోడు లేకుండా పిల్లాడిని పెంచుకునే పరిస్థితులు వచ్చినందుకు కుమిలిపోలేదు. ఘోరమైన నేరం చేసిన ఒక పాపాత్కుడికి శిక్ష వేయించింది.

ఇదీ అమ్మ డైరీలో రాసుకున్న సంగతులు. విషయాలు గురించిన ఆలోచనలో ఉన్న తరుణ్కు మనసులో దుఃఖం దూరమయింది. అమ్మ అంటే గౌరవం మరింత పెరిగింది

2020 లో ఆరోజు రాసిన డైరీ తీసాడు.

రేపటి పౌరులం కోసంఅనే హెడ్డింగ్తో డైరీలో తల్లి రాసిన అక్షరాల వెంట అతని కళ్లు పరుగులు తీసాయి

మన దేశంలో ప్రతీ పదిహేను నిమిషాలకు ఒక మహిళ లైంగిక దాడికి గురవుతుంది. ప్రతిరోజూ ఎనభై ఎనిమిది రేప్కేసులు నమోదవుతున్నాయి. అయితే తొంభై శాతం కేసులు ఎవరికీ తెలియకుండానే అజ్ఞాతంగా ఉంటున్నాయి. నేషనల్క్రైమ్బ్యూరో ప్రకారం ఒక లక్షా పదిహేడు వేల నాలుగు వందల యాభై ఒక్కటి రేప్కేసులు దేశం మొత్తం పెండింగులో ఉన్నాయి. ఇంతటి భీతావహరాక్షస ప్రవృత్తి కలిగిన మృగాళ్లను ఎలా బాగుచేయాలి? దేశంలో కూతుర్లు ప్రేమిస్తే వారిని అమానుసంగా చంపే తండ్రులున్నారు. మరి కొడుకులు రేప్చేస్తే తండ్రులు ఏం శిక్ష వేస్తున్నారు? బాల్యంలోనే శిక్ష మొదలవ్వాలి. “తప్పు చేసిన పిల్లల్ని శిక్షించాలి. తప్పు చేయకుండా వారికి శిక్షణ ఇవ్వాలి. ప్రివెన్షన్ఈజ్బెటర్దేన్క్యూర్‌. చికిత్స కన్నా వ్యాధి రాకుండా నివారణే ముఖ్యం. తమ పిల్లల్ని డాక్టర్లు, ఇంజనీర్లు కావాలనుకునే రోజులు కాక తమ పిల్లలు మంచి నడవడికతో ఆదర్శ వ్యక్తుల్లా తయారవాలని తల్లితండ్రులు అనుకునే రోజులు రావాలి. నేనూ నా కొడుకును అలా మంచి వ్యక్తిత్వంతో ఎదిగేలా కృషి చేస్తాను…”

వాక్యాలు చదివిన తరుణ్కళ్ళల్లో నీళ్ళు నిలిచాయి. ఇంతలో ఎవరో వచ్చిన చప్పుడు. ఎదురుగా అమ్మ. “అమ్మ నాకు ఇప్పుడు అర్ధమైంది. తప్పు చేసిన నన్ను ఎందుకు కొట్టావో. నాన్నను ఎందుకు జైల్లో పెట్టించావో. అలాంటి తప్పులు నేనిక చేయనుబలంగా చెప్పాడు.

తరుణం కోసం ఎదురుచూస్తున్న అనుపమ కొడుకు తలను ప్రేమగా నిమిరింది.

ఇది ఒక అమ్మ డైరీయే కాదు… 

నైతికత, సంస్కారం ఊపిరిగా  తమ కొడుకులు ఎదగాలని ఆకాంక్షించే ప్రతీ మాతృమూర్తి హృదయ స్పందన డైరీ అనుకుంది. తన కొడుకును కదిలించిన తన డైరీని హృదయానికి హత్తుకుంటూ…

****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.