ఆ దారి సరిచేసుకుంటూ

(ద్వితీయ వార్షిక సంచిక కవితల పోటీ రచన)

– చెళ్ళపిళ్ళ శ్యామల

 మబ్బు చాటు నుంచే

 సూరీడు

 రాత్రి జరిగిన ఘటనను

 పరిశీలిస్తున్నాడు

 

 అవును!

 నిన్న రాత్రి మళ్ళీ

యిక్కడో  ” కాకరాపల్లి”

 కనిపించింది !

 

 ఉదయాన్నే

 పోలీసుల బూట్ల  చప్పుడుతో

 ఊరు నిద్ర లేచింది!

 

 బాధితులకండగా 

 ఊరూరా…… 

 ర్యాలీలు,….. సమావేశాలు 

 కవుల కలాలు కత్తులు దూసాయి 

 నేను మాత్రం

 అక్కడి నుంచీ  కదిలాను !

 

 జాబిలి జోల పాడుతున్న  వేళ 

 ఊరంతా

 నిదుర ఊయల  లూగుతుంటే 

 అక్కడో “చుండూరు “

 దర్శనమిచ్చింది!

 

 ఉద్రిక్త పరిస్థితుల నడుమ

 ఊరంతా

 అట్టుడికిపోయింది!

 మళ్లీ…..

 నిరసనలు…… ర్యాలీలు….. సమావేశాలు

 కవుల కవనాలు

 కదన రంగాన కరవాలాలయ్యాయి

 నేను మాత్రం

 అక్కడినుంచీ కదిలాను

 

 అపుడపుడూ 

 మామిడి పళ్ళ కథలూ 

 పుట్టుకు రావచ్చు

 రోహిత్ లు ప్రణయ్ లు

 గుర్తుకు రావచ్చు!

 ఇప్పుడేం చేయాలో నాకు తెలుసు

 

 ఎగుడుదిగుడుల  నేల మీద

 కుర్చీ ఒరిగిందని 

 వేరే కుర్చీ వేస్తున్నారు వాళ్ళు!

 నేలను చదును చేసే

 పనిమీదున్నాను నేను 

 

 మళ్లీ మళ్లీ పుడుతున్న

 రోగానికి కారణం తెలిసింది 

 మనిషికి కాదిపుడు 

 మనసుకు—

 శస్త్ర చికిత్స చేయాలి

 కుల క్యాన్సర్

 పునరావృతం కాని 

 వ్యాక్సిన్ ను

 రేపటి తరానికందించే 

 పనిలో ఉన్నాను!

 

 నా వద్ద—- 

 మలినం అంటని

 మెదళ్లున్నాయి 

 చైతన్యo నా చేతిలో ఉంది.

****

Please follow and like us:

37 thoughts on “ఆ దారి సరిచేసుకుంటూ (ద్వితీయ వార్షిక సంచిక కవితల పోటీ రచన)”

  1. కవిత బాగుంది శ్యామల గారూ.. కుల పిచ్చి కి వేక్సిన్ వేయాలనే భావన బాగుంది… దారి సరి చేసుకోవాలనే ఆలోచన కూడా బాగుంది. అభినందనలు

  2. శ్యామల దారి సరి చేసుకోవడం చాలా బాగుంది….. కుల కరోనా ki వాక్సిన్ రావాలి.. అంత వరకు మీ లాటి వాళ్ళు ప్రయత్నం చేస్తూనే ఉండాలి.

  3. ఇలాంటి కవితలు చూసి న తరువాత ఐన కుల కరోనా ki వాక్సిన్ వస్తే బాగుంటుంది…. శ్యామల చాలా బాగుంది…..

  4. శ్యామల చాలా బాగుంది. ఇలాంటి కవితలు ప్రభుత్వం పెద్దలు వరకు వెళ్లి వాళ్ళు లో మార్పు రావాలి… సమాజానికి తెలిసిన ఏమి చేయలేము.ఇపుడు కుల కరోనా బాగా విస్తరించి ఉంది…..

  5. The poem is heart touching and thought provoke. Hats off to the writer Smt. Chellapilla Syamala for her concern on burning social issues.

  6. నేల చదును చేయడం మంచి ఆశావహ దృక్పధం, వ్యాక్సినేషన్ మంచి ఆలోచన,ఎంత చేతులు చాచినా ఎందుకో ముడుచుకుపోతున్నారు, ఇంత చక్కటి కవిత మా మేన కోడలు అందించడం మాకెంతో ముదావహం

    1. చాలా సంతోషం. చదివి మీ అభిప్రాయం చాలా చక్కగా లింక్ లో కూడా పెట్టారు. ఎప్పటికి మీ ప్రోత్సాహం ఇలాగే ఉండాలని కోరుకుంటూ..

  7. నేలను చదును చెయ్యడం, వైరస్ కి వ్యాక్సిన్ ఎక్కించే ప్రయత్నం శుభపరిణామం,సంఘటన జరిగినప్పుడు కవులు కత్తుల కాలాలు ఎత్తుకోవడమేకాకుండా పరిణామాలు కూడా ఆలోచించాలి, ఏదయినా మంచి పురోగమన సందేశం అందించిన నీవు మాకు అత్యంత ప్రియ మేన కోడలువి,

  8. చెళ్లపిళ్ల వేంకట కవుల వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న మీకు అభనందనలు.. చాలా బాగుంది.. యదార్థ సంఘటనల సమాహారం..👌👌👌

  9. చాలా బాగుంది మేడం గారు. ప్రజలలో లో చైతన్యం రావాలంటే ఇలాంటి రచనల అవసరం ఎంతైనా ఉంది. సమాజ మార్పు కోసం పాటుపడే మీ ప్రయత్నానికి మా అభినందనలు.

  10. Wonderful. Chala bavundi. Muhkyanga naaku suryudu painunchi choosi alochinchadam chala nachindi. Athaniki anni kanipistayi, bhoomi meeda vunna manam evari gola valladi annattu vuntamu. Kulam pichi alantide, larger society gurinchi alochinchakapote ardham kaadu entha damage chestundo society ni.

  11. Kavita bagunnadi . Oka teacher ga panichestu , Samajam hitavu kori neevu rase kavita vidhanam bahu bagunnadi. Nee kavitalu , kadhalu dwara janallo Chaitanyam tevalanna nee tapana, uddesyam marinta bagunnadi bagunnadi. Nee kalam nundi Marinii kavitalu , kadhalu , new generation ki kuda spurthidayakam kavalani korutu ……… Lakshmi palanki

    1. Kula pichhi tho koolipotunna ee nava samajani mee kavithalu entho spoorthidayakam. Marinni kavithalatho ee samajaniki pattina malinanni paradrolela spoorthini yuva narallalo nimpalani korukuntu mee shreyobhalashi!!

      1. ‘ఆ దారి సరిచేసుకుంటూ ‘ అనే మీ కవిత చాలా బాగుంది మేడమ్! మీరన్నట్లు దారి తప్పకుండా సరిచేయబడాలి. దేశంలో ఇన్ని కులాలు వుండకూడదు. ఇవి అభివృద్ధికి ఆటంకంగా నిలుస్తాయి. కొన్ని దేశాలు అభివృద్ధి చెందటానికి, మన దేశం వాటి స్థాయికి చేరుకోలేకపోవటానికి ముఖ్య కారణము ఇదే.సమాజానికి దిశానిర్దేశం చేసే ఇలాంటి కవితలు మీ వంటి కవయిత్రులు అందించటం అవసరం; అభినందనీయం.ధన్యవాదాలు.

  12. కవిత చాలా బాగుంది. కవిత ద్వారా చైతనం కలిగించుటకు మీ ప్రయత్నం అభినందనీయం.

  13. కుల గజ్జి పారద్రోలుటకు మీ కవితా చైతన్యలేపనం తో చికిత్స చేసే మీ ప్రయత్నం అభినందనీయం.

  14. చాలా బావుంది కవిత. పిల్లలు మీద మొత్తం రాబోయే రోజులు ఆధార పడి ఉన్నాయి. చాలా మంచి ఉదేశం ఇది. మంచి కవిత.

  15. కుల కరోనా ఎప్పటికప్పుడు వేరియంట్ మార్చుకుంటూ ప్రత్యక్షమవుతూనే ఉంటుంది…కవులు చైతన్యపు వాక్సిన్ ను కవితా సిరంజి ద్వారా మెదడు పొరల్లోకి ఎక్కించాల్సిందే…మీ ప్రయత్నం అభినందనీయం

    1. ‘ఆ దారి సరిచేసుకుంటూ’ అనే మీ కవిత చాలా బాగుంది మేడమ్! మీరన్నట్లు దారి తప్పకుండా సరిచేయబడాలి. దేశం బాగుపడాలంటే ఇన్ని కులాలు వుండకూడదు. ఇతర దేశాలు బాగుపడటానికి మన దేశం వాటి స్థాయికి చేరుకోలేకపోవటానికి ముఖ్య కారణం ఇదే. సమాజాన్ని దిశానిర్దేశం చేసే ఇటువంటి కవితలు మీ వంటి కవయిత్రులు అందించటం అవసరం; అభినందనీయం.ధన్యవాదాలు.
      డి.జి.యస్. శ్రీనివాస్

  16. చాలా మంచి కవిత . మంచి ఆలోచనని తెల్యజేసరు . బాల్యం లో నేర్పించిన అలవాట్లు , సూక్తులు జీవితాంతం గుర్తు ఉండిపోతాయి . ఉపాధ్యాయులు చాలా పెద్ద పాత్రను పోషిస్తారు . పుస్తకాలలో పాటలతో పాటు ఉపాధ్యాయులు మంచి లక్షణాలు అన్నీ నూరుపొయ్యలి . మీరు తెలియజేసే ఉదేసం తో పాటు కవిత్వం ఇంక బావుంది. ధన్యవాదాలు .

Leave a Reply

Your email address will not be published.