“నెచ్చెలి”మాట 

సంక్షోభం

-డా|| కె.గీత 

“మాకేం సంక్షోభల్లేవండీ, హాయిగా ఉన్నాం!” 

“హమ్మయ్య జీవితం సుఖంగా గడుస్తూ ఉంది!” 

“ఏ బాధల్లేకుండా సంతోషంగా ఉన్నాం!” 

అనే వాళ్లెవరైనా ఇప్పుడు అసలు ఉన్నారా? 

కరోనా ఒకటి రెండు మూడు అంటూ విశ్వ రూపం దాలుస్తూ ఉంది. 

ప్రకృతి విలయాలు చెప్పనే అవసరం లేదు!

మహారాష్ట్ర, తెలంగాణా, ఆంధ్రల్లో 

అమెరికా సంయుక్తరాష్ట్రాల్లో 

అనే తేడా లేకుండా 

ఎక్కడా ఎడతెరిపి లేకుండా 

వాయుగుండాలు 

ఉప్పొంగుతున్న నదులు, వరదలు 

కాలిఫోర్నియాలో మళ్లీ కార్చిచ్చులు 

హైతీలో భవనాలు నేలమట్టమైన భూకంపాలు 

మానవ విలయాలు అంత కంటెనూ… 

సిరియా గోడు ఇంకా మర్చిపోకముందే 

ఆఫ్ఘనిస్తాన్ లో గందరగోళం 

ప్రపంచ పటం నిండా శరణార్థుల హాహాకారాలే  

అమెరికా దొంగతనంగా పంపే  త్రోవలో నదిలో మునిగిపోతున్న 

మెక్సికన్ పసిపిల్లలు  

అమెరికా ఏదోలా పంపెయ్యాలన్న ఆతృతలో కంచె మీంచి 

ఎయిర్పోర్టులోకి బంతుల్లా విసిరేస్తున్నపుడు 

కాళ్లు విరుగుతున్న 

ఆఫ్ఘనిస్తాన్ పసిపిల్లలు

అసలు ఎవరికైనా 

కంటి మీద నిద్ర ఉందా?

మనసుకింత శాంతి ఉందా?

మాకేం సంక్షోభల్లేవండీ, హాయిగా ఉన్నాం-

హమ్మయ్య జీవితం సుఖంగా గడుస్తూ ఉంది- 

ఏ బాధల్లేకుండా సంతోషంగా ఉన్నాం-

అనే వాళ్లెవరైనా ఉంటే అదృష్టవంతులే!!!  

*****

నెచ్చెలి పాఠకులకు సదవకాశం: 

 ప్రతినెలా వచ్చే నెచ్చెలి  పత్రికలో రచనలు & “నెచ్చెలి” యూట్యూబ్ ఛానెల్లో వచ్చిన ఆర్టికల్స్ వేటిపైనైనా పాఠకులైన మీకు నచ్చిన 3 రచనలు/ఆర్టికల్స్  మీద కామెంట్లు పోస్టు చెయ్యండి. ఇలా వచ్చిన కామెంట్ల నించి ప్రతి నెలా ఒక ఉత్తమ విశ్లేషణాత్మక కామెంటుని ఎంపిక చేసి, బహుమతి ప్రదానం చేస్తాం. బహుమతి మొత్తాన్ని కామెంటుకే కాక, ఆయా ఆర్టికల్ రాసిన రచయిత/త్రికి కూడా పంచుతాం. పాతరచనల మీద కూడా కామెంట్లు చెయ్యవచ్చు. మరింకెందుకు  ఆలస్యం? రచనల్ని చదివి వివరంగా కామెంట్లు పెట్టడం ప్రారంభించండి.  ఈ విషయాన్ని మీకు తెలిసిన మిత్రులందరితో తప్పక పంచుకుని వినూత్నం, వైవిధ్యం ప్రధాన నిలయాలైన  “నెచ్చెలి” లో వస్తున్న వివిధ వినూత్న రచనల్ని తప్పక చూసి, చదివి ఆనందిస్తారు కదూ! 

https://www.neccheli.com/

https://www.youtube.com/c/neccheliwebmagazinechannel/videos

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.