Market

-English Translation: Nauduri Murthy

-Telugu Original: “Bazaru” by Wahed

This body is a garden of flowers

And the wounds are just small and big posies

The hum of the bees of political compassion around

Is but the malodor from the abscess… scented apurpose

When life itself becomes so dreadful

Who cares for death but itself?

What abode can a speck of dust have

Than go itinerant with the wind incessantly blowing it? 

The firebrand-tongues inflame tongues of fire

Crying out … nay, not to die of thirst!

Meditating Marabou sell faith for a price

Fish swim across to buy pints of water 

Well, man! When your mien becomes business-like

Even your passions and compassion reduce to mannequins.

Go! Sell tears to the bawler. 

When once you start selling…

Why secrecy?

Sell babies to the umbilical cord…

Sell games of delusion on the slide of equivocacy.  

If eyelids close for the glitter of the sword

Don’t confuse it for the weariness of sleep…

The lava under eyes never subsides to swell…

Do you expect the pigeons of the Masjid negotiate peace?

The foundations of these Minars ramify the depths of earth

Now, there is no more fear of earthquakes…

బజారు

దేహం ఒక పూదోటే

చిన్నా పెద్ద గాయాల పూలే అన్ని

వాటిపై సానుభూతి తుమ్మెదల ఝుంకారాలు

సువాసనల రసి కారుతున్న గాయాలు

భయమే ప్రాణమైపోతే…

చావు భయపడక తప్పదు కదా…

ధూళిరేణువుల చిరునామా ఏముంది?

గాలిదెబ్బలు తింటూ తిరగడమే…

నాల్కల కొరివి నుంచి మంటలు కారుతున్నాయి

దాహంతో చావకండని పిలుస్తున్నాయి…

జపం చేసే కొంగలు నమ్మకాన్ని అమ్ముతున్నాయి

చేపలు ఈదుకుంటూ నీళ్ళను కొంటున్నాయి

సరే, చేస్తున్నది వ్యాపారమైనప్పుడు

ప్రేమాభిమానాలు కూడా షోకేసుల్లోనే …

ఏడ్చేవాడికి కన్నీళ్ళు అమ్ముకో

 అమ్మడమే మొదలైతే…

దాపరికాలెందుకు…

తల్లిప్రేగుకే పిల్లల్ని అమ్ముకో

మాటల జారుడు బల్లపై భ్రమల ఆటలు అమ్ముకో

 కత్తి మెరుపుకు కళ్ళు మూతపడుతుంటే

అది నిద్రమత్తు కాదు…

కనురెప్పల క్రింద లావా ఉబుకుతూనే ఉంది.

మసీదు పావురాళ్ళు శాంతిని కొనుక్కోవాలా?

ఈ మీనారుల పునాదులు నేల లోతుల్ని కావలించుకున్నాయి

భూకంపాల భయం లేదు…

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.