ఈ వేళ రెక్కల మధ్య సూర్యోదయం

-గవిడి శ్రీనివాస్

ఒక  పక్షి
నా ముందు రంగుల కల తొడిగింది .

ఆకాశపు హరివిల్లు
మురిసింది .

చుక్కలు వేలాడాయి
కాసింత వెలుగు పండింది .

సీతాకోక చిలుకలు వాలాయి
ఊహలు అలంకరించుకున్నాయి .

 రోజు ఆశ తొడుక్కుంది
క్షణాలు చిగురిస్తున్నాయి .

అడుగు ముందుకు వేసాను
లక్ష్యం భుజం తడుతోంది .

 వేళ  రెక్కల మధ్య
సూర్యోదయ
తీరాల్ని దాటిస్తూ
నా లోపల  ఉషస్సుల్ని నింపింది .  

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.