నాలుగో పిరమిడ్ -ఉమ్ కుల్తుం
-ఎన్.ఇన్నయ్య
ఒక దేశాన్ని మాత్రమే గాక అరబ్ ప్రపంచాన్ని సమ్మోహితం చేసిన గాయని ఉమ్ కుల్తుం. 1898 డిసెంబరు 31న జన్మించిన కుమ్, 1975 వరకూ ఈ జిప్టులో అరబ్ లోకంలో గాయనీ సామ్రాట్టుగా చలామణి అయింది.
నేడు ఈజిప్టు రాజధాని కైరోలో కుంపేరిట ఒక థియేటర్ వున్నది. ఆమె పాటల్ని వినడానికి అక్కడకు సందర్శకులు వచ్చేస్తుంటారు.
కుమ్ పాడిననంత కాలం సాయంత్రం 6 గంటలకు వ్యాపారాలతో సహా అన్నీ మూసేసి వినేవారు. అదొక అపూర్వ ఆదరణ. కుమ్ అరబ్ ప్రపంచాన్ని ఆకర్షించడమే గాక, పర్యటనలు కూడా చేశారు.
ఆరబ్ లోకంలో జనాదరణ పొందిన ఆమె పాటలు స్వయంగా రాసేది. పాడేది. కొన్ని సినిమాలలోనూ నటించేది.
ప్రాచ్యలోకపు సంగీత రాణిగా చలామణి అయిన ఫాతిమా పేరిట నేడు కైరోలో ఒక సంగీత రాణిగా చలామణి అయిన ఫాతిమా పేరిట నేడు కైరోలో ఒక సందర్శ స్థలంలో ఏర్పాట్లు చేశారు. మేము కైరో వెళ్ళినప్పుడు నైల్ నదీ ఒడ్డున వున్న థియేటర్ కు వెళ్ళి ఆమె పాటల, జీవిత ప్రదర్శన చూచాము. నా కుమార్తె నవీన చాలా ఆసక్తితో విశేషాలు రికార్డు చేసుకున్నది.
కుం పాటలు ఈజిప్టులో, ముఖ్యంగా కైరోలో సాయంత్రం 6 గంటలకు వినిపించేవారు. అప్పుడు ఆ గంటసేపు వ్యాపార సంస్థలోత సహా అన్నీ మూసేసి, శ్రద్ధగా వినేవారు. ఈ కార్యక్రమం చాలా ఏళ్ళు సాగింది. గాయనిగా నటిగా జీవితం సాగించి, ఆకర్షించిన కుమ్, కొన్ని పర్యటనలు చేశారు.
ఈజిప్టు 4వ పిరమిడ్ అని పేరు తెచ్చుకున్న కుం అనూహ్య ప్రభావం చూపెట్టింది! ముత్యాల సరాలు స్వీకరించిన కుం విశేష ఆదరణ పొందగా, ఆమె ఆ గౌరవాన్ని నిలబెట్టుకున్నది.
ఉమ్ కుల్తుం గేయాలకు ఇంగ్లీషు అనువాదాలు వున్నాయి. ఆమపై ఇంగ్లీషు భాషా మాధ్యమంలో వచ్చిన సినిమా చూడదగినది. మత, మతేతర పాటలు పాడిన కుల్తుం జీవితాంతం అలాగే కొనసాగింది. పరిమితంగానే పర్యటనలు చేసింది.
ఈజిప్టు స్వాతంత్ర్యం కోసం ఆమె పాడిన పాటలు మరపురానివిగా మారాయి. ఆనారోగ్యంతో బాధితురాలైన కుం వైద్యం నిమిత్తం యూరోప్, ఆమెరికాలో ఆస్పత్రులకు వెళ్ళింది.
కైరోలో ఆమె పేరవున్న మ్యూజియంను మేము చూచాం.
****