రుద్రమదేవి-3 (పెద్దకథ)

-ఆదూరి హైమావతి

ఐతేసరివిను. అదిఅతగాడి పెళ్ళికిముందు బొగ్గులదానితో జరిపిన చాటుమాటు ప్రేమవ్యవహారంలేఅందరికీతెలిస్తే పరువుపొతుందని భయం.”అందినవ్వుతూ రుద్ర.

ఐనాఇవన్నీ నీకెలాతెలుసే! ” ఆశ్చర్యంతో నోరెళ్ళబెట్టింది వరం.

కొన్ని తెల్సుకుని కొందరిని అదుపులోపెట్టుకోవాలిమరి ! మాతాతగారు చెప్పార్లే ఈయనతెరవెనుక కధలు.ఈరోజుతో అన్నీబంద్ .ఇహ నోరెత్తడు.ఇన్నాళ్ళబట్టీ ఎందుకులే పరువుతీయటం అనుకున్నాకానీ మరీరెచ్చిపోయి అత్తనుఏడిపిస్తుంటే ఇహఆగలేకపోయా ఈరోజు. అత్త మనసంఘంలో చేరిసేవలు చేస్తుంది.” అంది రుద్ర ఒక ఘనకార్యాన్ని సాధించినతృప్తితో

నీవు నిజంగా రుద్రమదేవివేనే! మీనాయనగారు పెట్టిన పేరు నిలుపుతున్నావ్! నీవునాదోస్తు వైనందుకు నేనెంతో గర్విస్తున్నానుసుమా!  ” అందివరం రుద్ర చెయ్యిపట్టుకుని

అదంతా మీఅందరి సహకారంవల్లేనే వరం. మాతాతగారూ, నాయనగారూ మా బంగారు అమ్మల ప్రోద్బలం సహకారం లేకపోతే నేనేమీ చేయలేను కదే! వరంసరే పదలోపలికి ఆకలౌతున్నదిఅమ్మ ఏదో చేసే ఉంటుందిలే . తిందాంపదంఅంటూ లోపలికిదారి తీసిందిరుద్ర.   

  “ఐనాయా  సమాజసేవలు! అన్నంనీళ్ళూ కూడా అవసరం లేదల్లేఉంది  మీ నాయనా కూతుళ్ళకులోపలి కెళ్లగానే రుద్ర తల్లి పేరిందేవి

ఇదో ఈపిల్లనూ మీతో చేర్చుకుని చెడగొడుతున్నారల్లే ఉంది, ఏమి వరాలూ!”  అంటూపూర్తిచేసింది

అదేం లేదత్తా! రుద్ర చేసేపని ఏమగాళ్ళూ చేయలేరుసుమా!ఎంత ధైర్యం! దీని తోచేరి నేనూకాస్తంత ధైర్యం ,మాట్లాడటం నేర్చుకుంటున్నాను

బావుంది! పిల్లికి ఎలక సాక్ష్యం అంటే ఇదేమరి! సరే రండి కాళ్ళుకడుక్కుని , శనగ వడలు కాల్చాను వేడివేడిగా ఉన్నాయ్అంది మురిపెంగా కూతుర్ని చూసు కుం టూ , ఆమెకూ తెల్సు రుద్ర చేసేమంచి పనులు. తండ్రితో పాటు తల్లిసహకారం ఉండబట్టే   రుద్ర సామాజిక సేవ చేయగలుగుతున్నది. కూతురు ఇలాసమాజం దుమ్ముదులిపి అమాయకులను ఓదార్చడం ,వారికి కాస్తంతఊరట నివ్వటం ఆమె కెంతో ఆనందాన్ని కలిగిస్తున్నది.  

 రుద్ర ,వరాలూ వడలు తింటుండగా , రుద్ర తాత హనుమంతప్పఏంటమ్మాయ్! మంచి సువాసన వేస్తున్నది ? ” అంటూ  బయటి నుండీ వచ్చినాకూ ఆకలివేస్తు న్నది ,కాళ్ళు కడుక్కుని వస్తాను  పెట్టమ్మా! రుద్రా నాకూ కాసిన్ని ఉంచండి చెలి కత్తె లిద్దరూకల్సి అన్నీ తినేయకండిఅంటూ పెరట్లోకి వెళ్ళాడు

మీకేం బెంగక్కర్లేదు  తాతయ్యగారూ ! అమ్మ ఎప్పుడూ తక్కువవండదుగా! ” అంటూ ప్లేట్ తాతకు అందించింది రుద్ర..

మీ అమ్మ విషయం నాకు తెలుసమ్మా! తెనీనిది నీ విషయమే! రోజూ ఎవరినో ఒకరిని సంస్కరించి అలసిపోయి వస్తావాయె ! ఆకలికి అన్నీతినేయవచ్చుగా?”  

నేనేం భీముడి ననుకున్నారా ! లేక కుంభకర్ణునిలా తిండి పోతుననుకున్నారా? ఇలా అంటేనేనసలు తిననే తినను, ఉపవాసం చేస్తా నాల్గురోజులు.” బెదిరించింది రుద్ర తాతను.

    ” మా అమ్మగా ! అలాచేయకే తల్లీ! నీవు ఉపవాసం చేస్తే నేనుండలేను ఏమీ తిన కుండా.అదిసరే కానీ ఏంటి రుద్రా ! ఏం మంత్రం వేశావేం , పానకపుమామ గొంతే వినిపించటం లేదుఈరోజు ! వీధి వీధంతా వాడిగొంతు మారుమ్రోగు తుంటుంది కదా? నడచి వస్తుంటే వాడిఇల్లు నిశ్శబ్దంగా ఉంది ! ఏఊరైనా వెళ్ళాడనుకుంటే వీధివాకిలి తెరిచేఉంది!”అని తాత హనుమంతప్ప అనగానే ,నోట్లోఉన్న వడ ముక్క క్రింద పడేట్లు పకపకా నవ్వారు రుద్ర, వరమ్మానూ.

ఏదో చేశావన్నమాట ! ఆపరేషన్ సక్సెస్ ఐనట్లుంది ఏంరుద్రలూ ! పేషెంట్  కొలా ప్స్ డా ! ” మురిపెంగా రుద్ర తలపైతట్టాడు తాత

ఔను తాతయ్యగారూ ! రోజు రుద్రచేసిన ఆపరేషన్ తో పానకపు మామరోగం పూర్తి గా నయమయ్యిందిపేషెంట్  కొలాప్స్ డ్ కాదురియాక్టెడ్  ,ఐతే మందు సూచిం చింది మీరేని తెల్సిందిలే!” వరాలు నవ్వు ఆపుకుని చెప్పింది.   

అనుకున్నా నమ్మా! ఇద్దరూ నవ్వుతూ వస్తుంటేనే ఏదో ఒకకార్య సాధనచేసే వచ్చి ఉంటారని! పోన్లే ఈరోజుతో ఎలాగోఒకలా అమాయకురాలి ప్రాణం తెరిపిన పడిం దన్నమాటఅంతేచాలు, ప్రతిపూటా రోజంతా కళ్ళువత్తుకుంటూఉండే రమాబా యమ్మను చూడలేక పోయేదాన్నిఅంది పెరిందేవి సంతోషంగా .

 ” అంతేనా ఆపెవండిపెడితే తినిఅరిగిందాకా బొజ్జతడుముకుంటూ ఆమెను తిట్ట డమే వాడిపని. ఈరోజుతో కుదిరిందన్నమాట !ఆమందే వేసుంటావ్? ఔనా రుద్రా ! “అడిగారు తాతయ్యగారు.

ఔనుతాతయ్యగారూ ! ఇంతకాలమాగాను ఇహనావల్లకాలేదు. ఒక్క బస్తాబియ్యం ఇచ్చిందని అంత హంగామా చేశాడుఅదంతా అత్త ఇంటినుండీ వచ్చినవేగా? పాపంఅత్త!ఇహమీద మామపోరే ఉండదు లే!  ” సానుభూతిగా అంది రుద్ర.

పాపం చిన్నతనంనుండీ బయటికిరాక ,ఈడేరినా  పెళ్ళికాలేదనే భీతితో ఆయ మ్మను బయటికే రానివ్వలేదు తండ్రి. ఇదిగో వీడిపాలబడింది ఆబేల! ” చెప్పారు తాతయ్య హనుమంతప్ప..

       ” ఇహ అత్తజోలికెళ్ళడు పానకపుమామ.రుద్ర ఆపరేషన్ ఈరోజు  విజయవంత మైందిలే తాతయ్యగారూ !” అంది వరాలు లేచి వెళ్ళి చేయికడుక్కునిఇహ రానా! రుద్రా! రేపు ఉద యాన్నే వస్తా, వెళ్ళి వాడపిల్లలకు  అచ్చుబొక్కులన్నీ ఇవ్వలిగా ! వెళ్ళొస్తా అత్తయ్యా! తాత య్యగారూఅంటూ లేచి బయల్దేరింది  వరాలు.

నీకు అన్నలేడని ఎప్పుడూ అనుకోలేదు రుద్రా ! వరాల్ని చూశాక మాత్రం అనిపిస్తోంది నీకో అన్న ఉంటే వరాన్ని చేసుకుని మనఇంటనే ఉంచుకునే వాళ్ళంకదాని. ” అంది రుద్రతల్లి

   ” పోనీ నేచేసేసుకోనా అమ్మా! ” అంది రుద్ర తల్లి చుబుకం పట్టిఊపుతూ

      ” ఎందుకూ ! ఇద్దరూ వీధులెంట బలాదూర్  తిరుగుతుంటే  నేను  భయపడు తూ కూర్చోనా ? పోవే మొద్దూ  ?” అంది ఆమె మురిపెంగా కూతుర్నిముద్దాడి ..

మా అమ్మ బంగారు .నీసపోర్ట్ ఉండబట్టే గదమ్మా! నేనుఇలా ఏదో ఒకమంచిపని చేయగలుగు తున్నాను.”

నా కూతురూ బంగారమేనే! మగపిల్లలు లేని లోటు తీర్చుతూ ఇంటా బయటా ధైర్యంగా అన్నీ చక్క బెట్టుతు తాతయ్యగారికి , నాయనగారికి మంచి పేరు తెస్తున్నా వ్? ఇంతకంటే బిడ్డ నుండీ అమ్మా నాయనా మరేం ఆశిస్తారు చెప్పు.” అంది పెరిందేవి 

బావుంది తల్లీ కూతుళ్ళ సరాగాలు , ఇక్కడ నేనొకర్తెనున్నానని  మరువకండినవ్వుతూ అంది వరం.

సరేమ్మా! రాకాసిని  ఇంటివద్ద వదలి వస్తానుఅంటూ వరాన్ని సైకిల్ పై ఎక్కించుకుని బయల్దేరింది రుద్ర..

అప్పుడప్పుడే  సూర్యాస్త మయమై చీకట్లు అలుముకుంటున్నాయి , రుద్ర  సైకిల్ తొక్కుతుండ గా వెనుక కూర్చున్న వరాలు కబుర్లు చెప్తున్నది. కపిలబావి దాటు తుండగా , వరంఅటుచూడు రుద్రా! అక్కడ బావివద్ద ఎవరో తచ్చాడు తున్న ట్లున్నది! అమ్మయిలా లేదూ! ఇప్పుడు ఇక్కడ వంటరిగా…” అంది .

****

(ఇంకా ఉంది) 

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.