“నాన్నకి రాయని ఉత్తరం” రచయిత్రి పింగళి బాలాదేవి గారితో నెచ్చెలి ముఖాముఖి

-డా||కె.గీత

(ప్రవాసాంధ్ర రచయిత్రి పింగళి బాలాదేవి గారితో నెచ్చెలి ప్రత్యేక ముఖాముఖి వీడియోని పైన ఇస్తున్నాం. చూసి, మీ అభిప్రాయాలు తప్పక తెలియజెయ్యండి.)

పింగళి బాలాదేవి రాశి కన్నా వాసి ముఖ్యమైన ప్రవాసాంధ్ర రచయిత్రి. సొంత ఊరు తూ .గో.జిల్లా కాట్రావులపల్లి. ఒడిశా రాజధాని భువనేశ్వర్ లో నివాసం. జువాలజీలో ఎమ్మెస్సీ చేసి లెక్చరర్ గా ప్రభుత్వోద్యోగం చేసారు.  బాలాదేవి ఇరవై అయిదు దాకా కథలు, వంద వరకు కవితలు, రెండు నవలలు రాసారు. స్త్రీల సమస్యలు, కుటుంబ బాంధవ్యాలు ఇతివృత్తాలుగా రచనలు చేశారు.

వీరు రాసిన “నాన్నకి రాయని ఉత్తరం” కథ ఆ మధ్య సోషల్ మీడియాలో ‘నాన్నకు ప్రేమతో’ అంటూ వైరల్ అయ్యింది. ఆ కథని స్వయంగా వారు చదవగా ఈ ముఖాముఖిలో నెచ్చెలి పాఠకుల కోసం ప్రత్యేకంగా ఇస్తున్నాం.

నవలలు:
1. ఒక చీకటి ఒక వెన్నెల
2. పొగమంచులో సూర్యోదయం

కథా సంపుటి:
నాన్నకి రాయని ఉత్తరం

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.