Please follow and like us:
ములుగు లక్ష్మీ మైథిలి జన్మస్థలం ఒంగోలు. కవితలు , కథలు రాయటం, చదవడం ఇష్టాలు. అనేక దిన, మాస , పక్ష , వార పత్రిక లలో కవితలు ప్రచురించబడ్డాయి. మానస సాంస్కృతిక ( విజయవాడ ) , సృజన సాహితి సంస్థ (నెల్లూరు ) ,చెలిమి సాంస్కృతిక సంస్థ వారిచే దేవులపల్లి స్మారక అవార్డు (హైదరాబాద్ ) ,పెన్నా రచయితల సంఘం (నెల్లూరు ) వంటి అనేక పురస్కారాలు అందుకున్నారు. చినుకులు, ఊహలు గుసగులాడే కవితాసంపుటాలు, 50 కథలు ప్రచురణ అయ్యేయి.
ముద్రిత కవితాసంపుటాలు:- 1.చినుకులు.2.ఊహలు గుసగుసలాడే.3.కరచాలనం.
ఇతర సాహితీ ప్రక్రియలు:- వ్యాసాలు, కవితలు, కథలు, నానీలు, గజల్స్, వ్యంజకాలు, మొగ్గలు, హైకూలు
అముద్రితనవలలు:- నీహారిక నవల, జ్యోత్స్న ఐ.ఏ.ఎస్, ప్రవాహం,, అనుబంధం.
“ష్” క్రైం నవల ఆంధ్ర భూమి దినపత్రిక లో సీరియల్ గా ప్రచురణ.(మే, జూన్2019)
వివిధ పత్రికల్లో కథలు, కవితలు, నానీలు, గేయాలు వ్యాసాలు, ప్రచురణ. కొన్ని సంకలనాలలో కథలు, కవితలు, వ్యాసాలు, నానీలు ప్రచురితం.
“తెలుగు వైద్యుత మహా నిఘంటువు” కోసం నెల్లూరు మాండలిక(3000 పదాలు) పదకోశం రచన.
విజయవాడ, రాజమండ్రి, కర్నూలు, అనంతపురం, తిరుపతి, ఒంగోలు, గుంటూరు, విజయనగరం, హైదరాబాద్, విశాఖపట్నం, బెంగళూరు, బొంబాయి, చెన్నై ,ఢిల్లీ మొదలైన సాహితీ సంస్థలు ఇచ్చిన ఉత్తమ కవితల పురస్కారాలు, బహుమతి పొందిన కవితలు పురస్కారాలు.
mulugu.mythili @gmail.com