బుడుగూ – వినాయక చవితీ 

                                                   —  రామ్ ఎమ్వీయస్ 

వినాయక చవితి అంటేనే  చిన్న పిల్లల పండగఅస్సలు మనం చేసే అల్లరికేకుంచెం మంచి పేర్లు పెట్టిఇది సంపరదాయం అనేస్తారు పెద్దాళ్ళు  . 

మనం  చెట్లు ఎక్కి ఆకులు కోసేస్తేఅల్లరి  చేయొద్దన్నానాఅంటారావినాయకచవితి రాగానే  “బాబాయి తో వెళ్లి  పత్రి కోసుకురామ్మా బుడుగూఅనేస్తారు  !!

నేను గోడల మీద చాక్పీసు తోనో , బొగ్గు తోనో గీస్తే – “హన్నా హేమిటా అల్లరిఅని రాద  గోల చేస్తుందా ? రాదంటే అమ్మలే !! ఏం .. ఏదైనా పండగ వచ్చిందనుకో .. రాదే మళ్ళీ ఇంటి ముందు గీతలు గీస్తుంది . మళ్ళీ నాకేసి చూసి,ముగ్గు బాగుందా కన్నాఅంటుంది . ఇదీ వరస !!!

ఎపుడేనా తొట్టి లో నీళ్ల తో ఆడితే , గోపాళం నడ్డి మీద చ్ఛంపేస్తాడు కదాగోపాళం  అంటే నాన్న లే !!  అదే వినాయక చవితి రోజునవినాయకుడినీ , పత్రినీ ఊరి చివర చెరువు లో నిమజ్జనం చేసి రమ్మని చెప్తాడు

ఏం…  ఇంకా…  బోగి పళ్ళు పోసుకోడం సుబ్బరమైన అల్లరి కాదూ !!  

హ్మ్మ్   పెద్దాళ్ళు  మనకి అరదం కారు కదా !!

సంపరదాయం  అంటే ఇంకో  అరదం  కూడా ఉంది

 ” పని  చెయ్యక పోతే మీ బామ్మ నసుగుతుంది .. ” అని అమ్మ నసుగుతూ  ఏదైనా పని చేస్తుంది  అనుకోఅదీ కూడా సంపరదాయమే  !! 

అస్సలు నసగటమే ఒక సంపరదాయం ప్రతీ ఇంట్లో

పక్కింటి లావుపాటి పిన్ని గారి ముగుడు కూడా  సంపరదాయం చేస్తాడు రోఝూ

ఆఫీస్ టైం అయిపోయి బయల్దేరే ముందుఆఫీస్ లో  విగ్గు లేని యముడు ,” పని అయిపోవాలి ఇవ్వాళఅన్నాడనుకో , గోపాళం  కూడా సంపరదాయం చేస్తాడు .  

అంటే …. ఇష్టంగా చేస్తే అల్లరీ , కష్టంగా చేస్తే సంపరదాయం అన్నమాట !!

    ***                          

ఇప్పుడు … కొంచెం చిన్న పిల్లలకి వినాయక చవితి రోజు  తీసుకోవాల్సిన  కొన్ని జాగర్తలు చెప్తాను . అంటే నాకంటే ఛీన్న పిల్లలన్నమాటవాళ్లకి

ఒఖటి  

పత్రి  కోసం బాబాయి తో వెళ్ళమ్మా బుడుగూఅంటారా , ఇంతలోనువ్వు చెట్టు ఎక్కకు , కిందే నుంచోఅనేస్తారు .  

అప్పుడు  మనం ముందస్తు గా  జేబు లో కొన్ని గోళీలు వేసుకోవాలి. ఎందుకూ అంటే – 

బాబాయి చెట్టెక్కి, పక్కింట్లో రెండు జళ్ల  సీత ని చూస్తూ .. అపుడపుడూ ఆకులు కోస్తూ ..కోస్తున్నానని కోతలు కోస్తూ

సుజడాం సుఫలాం రెండు జళ్ల  సీతలాం 

సస్యశ్యామలాం ..”

అని పాడుకుంటూ ఉంటాడు కదా . అందుకని బాబాయి సంపరదాయం తొందర గా అవదుఅప్పుడు  మనం జేబు లో గోళీలు తీసి ఎంచక్కా ఆడుకోవచ్చన్న మాట .. అందుకు !!

ఫది 

తెల్లారు  జామునే స్నానం చేసేయి బుడుగూ “, అని లేపారనుకో !! బద్దకం గా బజ్జోకు !!

ఎందుకంటే బామ్మ బయట నుంచో పెట్టి – నూనె రాసి ,నలుగు పెట్టేటప్పుడు గానీ సీగానపెసూనాంబ వచ్చిందనుకోమన ప్రెస్టేజ్ గోల అయిపోదూప్రెస్టేజ్ గోల అయిపోటం  అంటే ప్రెస్టేజ్ కుక్కర్ ఈల వేయటం కాదు , పరువు పోవడం అన్నమాట

అందుకనే తెల్లారు  జామునే స్నానం చేసి పండుతండిరి లాగా రెడీ అయిపోవాలి . ఇలాని రాద అంటుందిలే

డెబ్భై 

పూజ చేసేటప్పుడు – పాలవెల్లి కి కట్టిన సీతాఫలం చూస్తే తినాలనిపించింది అనుకో – కళ్ళు మూసుకు దణ్ణం పెట్టేయ్లాపోతే అమ్మహన్నాఅంటుంది

నాలుగు 

నీకు హోంవర్క్ ఎక్కువ ఇచ్చిన సబ్జక్ట్ బుక్సులు తీసికెళ్ళి పూజ లో పెట్టేయి . వినాయకుడు హోంవర్క్ బారి నించీ  మన్ని రష్చించేస్తాడు

సరే మరిఎంచక్కా కొత్త బట్టలు కట్టుకుని , అమ్మ పెట్టిన ఉండ్రాళ్ళు తిని పండగ హాయిగా చేసుకోండి !!!

*****

 

Please follow and like us:

8 thoughts on “బుడుగూ – వినాయక చవితీ ”

    1. మళ్లీ బుడుగుని గుర్తు చేసినందుకు ముందుగా మీకు ధన్యవాదాలు🙏
      మీ రచన గురించి మూడు ముక్కలో సెప్పాలి, మూడంటే మూడు కాదనుకో ఇలాంటి ఎన్ని మూడులు సెప్పిన ఒకటే మరి.
      ఒకటి
      రచన శైలి 👌
      ఫది
      చక్కని కొనసాగింపు పాత శైలికి
      డబ్భై
      ఇరగదీసారంతే ఇరగదీయడమంటే ఇరిచెయ్యడం కాదు చాలా బాగా రాసారు అని బాబాయి సైనిమా చూసినప్పుడంతాడా అపుడు పట్టేసా ఇది😊

  1. హన్నా ! సం పర దానం అంటే ఇంత ప్రైవేట్ ఉందన్నమాట ! శ్రీ ఎంవీయల్ నవ్వులంత గిలిగింతలా.

Leave a Reply

Your email address will not be published.