అనుసృజన

కబీర్ దోహాలు ఎన్నో ప్రసిద్ధి చెందాయి, వాటిలో కొన్ని…

-ఆర్. శాంతసుందరి

తులసీ జే కీరతి చహహి , పర్ కీ కీరతి ఖోయి
తినకే ముహ్ మసి లాగిహై , మిటిహి న మరిహై ధోయి
          ఇంకొకరి పేరు చెడగొట్టి తాము పేరు సంపాదించుకోవాలనుకునే వాళ్ళుంటారు అటువంటి వాళ్ళ ముఖాలకి అంటుకునే మసి ఎంత కడిగినా, వాళ్ళు చనిపోయే వరకూ వదలదు.
 
సూర్ సమర్ కరనీ కరహి , కహి న జనావహి ఆపు
విద్యమాన్ రన్ పాయి రిపు , కాయర్ కరహి ప్రలాపు
          వీరులు యుద్ధభూమిలో తమ పరాక్రమాన్ని చేతల్లో చూపిస్తారు తప్ప మాటల్లో చెప్పరు. శత్రువు తమకి రణరంగంలో ఎదురుపడినప్పుడు పిరికి వాళ్ళు వ్యర్థ ప్రలాపం చేస్తారు.
 
కలహ్ న జానబ్ ఛోట్ కరి , కలహ్ కఠిన్ పరినామ్
లగతి అగని లఘు నీచ్ గృహ్ , జరత్ ధనిక్ ధన్ ధామ్
          గొడవ చిన్నదే కదా అనుకోకండి , అది చాలా భయంకరమైన పరిణామాలని ఇవ్వగలదు. ఒక పేదవాడి పూరిగుడిసెలో అంటుకునే నిప్పు ధనికుడి ఇంటినీ, ఆస్తినీ దగ్ధం చేసెయ్యగలదు.
 
జడ్ చేతన్ గున్ దోషమయ్ , విస్వ కీన్హ్ కరతార్
సంత్ హంస్ గున్ గహహి పయ్, పరిహరి వారి వికార్
          ఈ ప్రపంచంలో భగవంతుడు మంచీ చెడులనీ, చరాచరాలనీ సృష్టించాడు. సత్పురుషులు హంసల్లా పాలని(మంచిని) మాత్రమే గ్రహించి, నీటిని(చెడుని) వదిలేస్తారు.
 
ఆవత్ హీ హరషే నహీ, హ నైనన్ నహీ సనేహ్
తులసీ వహా న జాయియే , కంచన్ బరసే మేహ్
          మీరు కలిసేందుకు వెళ్ళగానే సంతోషంగా, ప్రేమగా చూస్తూ ఆహ్వానించని వారింటికి, అక్కడ కనకవర్షమే కురుస్తున్నప్పటికీ( వాళ్ళు ఎంత ధనవంతులైనా)మీరు వెళ్ళనే వద్దు. 
 
వచన్ వేష్ తే జో బనయి , సో బిగరయి పరినామ్
తులసీ మన్ తే జో బనయి , బనీ బనాయీ రామ్
          కపట వేషంతో, అబద్ధాలతో కార్యం నెరవేర్చుకునే వారికి చివరికి లభించేది దుష్పరిణామమే. కానీ మనస్సాక్షికి కట్టుబడి నిజాయితీ గా పనులు చేసేవారికి ఆ రాముడే సత్ఫలితాలని అందిస్తాడు.
 
ముయే మరత్ మరిహై సకల్ , ఘరీ పహర్ కే బీచులహీ న కాహూ ఆజ్ లౌ , గీధరాజ్ కీ మీచు
          క్షణానికో ఘడియకో ఎవరో ఒకరు చనిపోతూనే ఉంటారు,అందరూ ఎప్పుడో ఒకప్పుడు చనిపోవలసిందేకానీ పక్షిరాజు జటాయువు సీతమ్మని కాపాడేందుకు పోరాడుతూ పొందిన మరణం వంటిది ఇంకెక్కడా కనబడదు.
 
హిత్ పునీత్ సబ్ స్వారథహి , అరి అసుద్ధ్ బిను చాడ్
నిజ్ ముఖ్ మానిక్ సమ్ దసన్ , భూమి పరే తే హాడ్
          స్వార్థం ఉన్నంత కాలం అన్నీ పవిత్రంగానూ, వాటిమీద ఆసక్తి తగ్గిపోగానే అవి పనికిమాలినవిగానూ కనిపిస్తాయి. మన నోటిలోని పళ్ళనే తీసుకోండి , నోట్లో ఉన్నంత వరకూ అవి ముత్యాలు, ఊడి నేలమీద పడిపోగానే ఉత్త ఎముక ముక్కలు.
 
ముఖియా ముఖ్ సో చాహియే , ఖాన్ పాన్ కహు ఏక్
పాలయి పోషయి సకల్ అంగ్ , తులసీ సహిత్ వివేక్
          శరీరానికి నోరు ఎలాటిదో ఇంటికి పెద్ద అలాటివాడు, అన్నపానాదులు గ్రహించేది ఒక్క నోరు మాత్రమే. అయినా అది అన్ని అవయవాలనీ పోషిస్తుంది. అటువంటి వివేకమే ఇంటిపెద్దకి ఉండాలి.
(ముఖియా- ఈ పదానికి గ్రామపెద్ద , దేశ నాయకుడు వంటి అర్థాలు కూడా చెప్పుకోవచ్చు)
 
తులసీ సంత్ సుఅంబ తరు , ఫూల ఫలహి పర హేత్
ఇతతే వే పాహన్ హనత్ , ఉతతే వే ఫల్ దేత్
          మామిడి చెట్టు ఇతరుల కోసమే పూలనీ, ఫలాలనీ ఇచ్చినట్టు సత్పురుషులు పరోపకారం కోసమే జీవిస్తారు. కిందనుంచి ఎవరైనా రాళ్ళతో కొట్టినా పైనుంచి మామిడి చెట్టు వాళ్ళకోసం ఫలాలనే రాలుస్తుంది.
 
 
సచివ్ బైద్ గురు తీని జౌ, ప్రియ బోలహి భయ ఆస్
రాజ్ ధర్మ తన్ తీని కర్ , హోయి బేగిహీ నాస్
          మంత్రి, వైద్యుడూ,గురువూ భయం వల్లనో లాభం కోసమో (నిజాన్ని దాచిపెట్టి) తియ్యగా మాట్లాడితే… రాజ్యానికీ, శరీరానికీ, ధర్మానికీ హాని కలిగించిన వారవుతారు
 
తులసీ జగ్ జీవన్ అహిత్ , కతహు కోవు హిత్ ఆని
సోషక్ భాను కృసాను మహి , పవన్ ఏక్ ఘన్ దాని
          ఈ లోకంలో ఇతరులకి మంచిచేసే వాళ్ళకన్నా చెడు చేసేవాళ్ళే ఎక్కువ
సూర్యుడూ,అగ్నీ,మట్టీ,గాలీ -నీళ్ళు వీటి ప్రభావం వల్ల ఎండిపోతాయి.మేఘాలు మాత్రమే నీటిని దానం చేస్తాయి.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.