షర్మిలాం “తరంగం”

లోకో భిన్నరుచిః

-షర్మిల 

ఒక్కొక్కరి ఇష్టాలు ఒక్కోలా వుంటాయి.

నేను ఇష్టపడేదే గొప్ప… పక్క వాళ్ళ ది తక్కువ అనుకునే వాళ్ళు చాలామంది వుంటారు.

ఈ మధ్య పంది మాంసం తింటే పంది బుద్ధి, జంతు మాంసం తింటేజంతువుల బుద్ధి వస్తుందని సెలవిచ్చారు ఒక స్వామి వారు!

ప్రపంచం మొత్తం మీద అత్యంత ఎక్కువగా వినియోగించేది పోర్క్ ( పంది మాంసం ).

ప్రపంచంలోని అంత మంది ఇష్టంగా తినే ఆహారాన్ని మనకి అలవాటులేదని , ఇష్టం వుండని కారణంతో అవహేళన చేయడం సబబుగా అనిపించదు .

శాఖాహారం గొప్పదని మాంసాహారం తిండం అదో నేరంగా భావించే వారెందరో !

పూర్వం యజ్ఞయాగాదుల్లో హవిస్సుగా మాంసం నివేదించారని వేదాల్లో వుందట కదా !

ఇండియా లాంటి దేశాల్లో కొన్ని వర్గాల ప్రజలు ఖరీదైన మాంసాలు కొనుక్కోలేని ఎందరో గొడ్డు మాంసాన్ని తింటారు.

అది వారికి పోషకాహారం.

ఎదుటి వారి ఆహారపు సంస్కృతిని , అలవాట్లను గౌరవించే సంస్కారం అలవరుచు కుంటే అదే అసలైన సంస్కృతీ పరిరక్షణ.

భక్తి కి శాఖాహారానికి ముడిపెట్టి ఎందరినో దేముడికి దూరం చేశారు.

శాఖాహారం బ్రహ్మపదార్థమూ కాదు మాంసాహారం హీనమైందీ కాదు.

ఏదైనా ఆకలిగొన్న కడుపును నింపేదే!

రుచులైనా అభిరుచులైనా మనుషులందరికీ వేర్వేరుగానే వుంటాయి.

ఒకరు గొప్ప ఒకరు తక్కువ కాదు.

ఒక ప్రాంతం అలవాట్లు వుంకొకరు తక్కువ చేసి మాట్లాడడం నాకుతెలుసు.

ఉత్తరాంధ్రులకు చారు,ఉప్పు చేప వుంటే చాలని కోస్తా ఆంధ్రులు అంటే… క్రిష్ణా, గుంటూరు వాళ్ళు పచ్చళ్ళు తిని బతుకుతారని ఉత్తరాంధ్రులుఅంటారు.

మా మావగారి చుట్టాలు గోదావరిజిల్లా వాళ్ళు.

మా అత్తగారు వాళ్ళని ఉద్దేశించి “ఆ… మీ వాళ్ళు ఎప్పుడూ తినేది పప్పూచారు , లేకపోతే లచ్చించారు అంతేగా !”అనేవారు.

“ఆ చేపా జెల్లా మేం తినం బాబూ “అని వీళ్ళని వాళ్ళనేవారు.

పల్నాడు లో భోజనం చేసిన శ్రీనాధుడు అక్కడ జొన్నకలి, జొన్నన్నం , జొన్నఅంబలి తిని ఇలా వాపోయాడంట

“గరళము మింగితిననుచున్

బురహర ! గర్వింపబోకు, పో పో పో , నీ బిరుదింక గానవచ్చెడి

మేరసెడి రేనాటి జొన్న మెతుకులు దినుమీ !”

అని విషం తినడం గొప్ప కాదు జొన్నన్నం తిని చూడమని శివుడికి సవాలు విసిరాడు.

వేరే వాళ్ళు నొసలు చిట్లిస్తే చిట్లించవచ్చు గాక …

రాయలసీమలో రాగి సంగటి , పల్నాడులో జొన్నన్నం,కోస్తాలో వరి అన్నం , ఉత్తరాదిన గోధుమ రొట్టె ఇలా ఏ ప్రాంతంలో పండే పంట అక్కడి వారికడుపు నింపుతాయి.

జిహ్యకో రుచి అన్నట్టు ఎవరు తినేదైనా పరబ్రహ్మ స్వరూపమే !

కన్నడు మాంసం పెట్టినా ప్రీతిగా ఆరగించిన శివుడిలా ఎవరి ఆహారమైనాగౌరవించడమే విజ్ఞుల లక్షణం.

****

Please follow and like us:

One thought on “షర్మిలాం“తరంగం”-31”

  1. Jiyyam garu — stupid guy – 1o th class failed guy -type writer —by play politics
    Becam jiyyam garu —telangana reddy community gave lot of importance to him-
    He became a god —his income is more then 100 crores —his statement about eating is
    Stupid comment .eating is personnel choice .sharmila ji u r right madam

Leave a Reply

Your email address will not be published.