స్వరాలాపన-12

(మీ పాటకి నా స్వరాలు)

-డా||కె.గీత

మనందరికీ పాటలు వినడం ఇష్టం. మనలో కొందరికి విన్న పాటలు తిరిగి పాడడం ఇష్టం. మరికొందరికి ఆ పాటల్ని వివిధ వాయిద్యాల మీద పలికించడం ఇష్టం. అయితే అలా పలికించేందుకు అవసరమైన స్వరాలు తెలుసుకోవడం ఎలా? సాధారణంగా అవి గురుముఖత తప్ప అందరికీ లభ్యం కావు. నాకున్న జన్మతః వచ్చిన అనేకానేక ఇష్టాల్లో, కళల్లో విన్న ఏ పాటకైనా వెంటనే స్వరాలు కూర్చడం ఒకటి! నాకు తెలిసిన మిత్రులు ఇటువంటి కాలమ్ ఒకటి ఉంటే ఉపయోగకరంగా ఉంటుందన్న సలహా ఇవ్వడంతో అవి మీకూ ఉపయోగపడతాయని ఇక్కడ నెలనెలా ఇస్తున్నాను.

మీకు నచ్చి, నేర్చుకుంటే ఇక్కడ కామెంటులో తెలియజెయ్యడమే కాకుండా రికార్డు చేసి editor.neccheli@gmail.com ఈ-మెయిలుకి పంపండి. ఉత్తమమైన వాటిని ప్రచురిస్తాం. అంతే కాదు మీకు నచ్చిన సినిమా/ఏదైనా ప్రముఖ పాటకి (ఏ భాషైనా) స్వరాలు కావాలనుకుంటే కూడా ఈ-మెయిలు పంపండి. వరసవారీగా స్వరాలు ఈ కాలమ్ ద్వారా అందజేస్తాను.  మీరు ఇలా నేర్చుకున్న పాటల్ని యూట్యూబు, ఫేసుబుక్ వంటి సామాజిక మాధ్యమాల్లో పెట్టదలుచుకుంటే తప్పనిసరిగా ఆ పాట ప్రచురితమైన  నెచ్చెలి పేజీ లింక్ ని ఇస్తూ, నా పేరుని జత చెయ్యడం మరిచిపోకండేం!

***

రాగం: శివరంజని రాగం 

ఆరో: సరి2 గ2 ప ద2 స  

 అవ: స ద2 ప గ2 రి2 స  

Arohanam:   S R2 G2 P D2 S

Avarohanam:   S D2 P G2 R2 S

చిత్రం: దేవదాసు (1953)

గీతం: అంతా భ్రాంతియేనా జీవితానా వెలుగింతేనా

సంగీతం: సి. ఆర్. సుబ్బురామన్ & ఎమ్మెస్ విశ్వనాథన్

గీత రచన: సముద్రాల సీనియర్

అంతా భ్రాంతియేనా జీవితానా వెలుగింతేనా

పా  పా    పాద దా సా    సాసరీగా   రీసస  సారీ 

ఆశ నిరాశేనా   మిగిలేది చింతేనా  ఆ…  ఆ…

రీగ3పా  గ3గా3దాపాగా   గ2గ2రీగా2  రిరిసాసా  …  గరిసదప 

అంతా బ్రాంతియేనా జీవితానా వెలుగింతేనా

పా  పా    పాద దా సా    సాసరీగా   రీసస  సారీ

ఆశ నిరాశేనా మిగిలేది చింతేనా

రీగ3పా  గ3గా3దాపాగా   గ2గ2రీగా2 రిరిసాసా  …  గరిసదప 

చిలిపితనాల చెలిమే మరచితివో..

గ3గ3గ3  రిగా3గ3  సరిరీ  సాదద  గా3రిసరిసా 

చిలిపితనాల చెలిమే మరచితివో..

గ3గ3గ3  రిగా3గ3  సరిరీ  సాదద  గా3రిసరిసా 

తల్లిదండ్రుల మాటే దాట వెరచితివో

సరిగా3దదదాదా గా3గా3 పప దసదపా  దపదపా 

తల్లిదండ్రుల మాటే దాట వెరచితివో

సరిగా3దదదాదా  గా3గ3ప పాదసపా

పేదరికమ్ము ప్రేమపథమ్ము మూసీ వేసినదా

దాసదదాపా పాదపపాగా3 రీగా2రీససా 

నా….  ఆశే దోచినదా… ఆ

రీపా   గా2రీగా2రీససా …. గ2రిసదప

అంతా బ్రాంతియేనా జీవితానా వెలుగింతేనా

పా  పా    పాద దా సా    సాసరీగా   రీసస  సారీ 

ఆశ నిరాశేనా   మిగిలేది చింతేనా  ఆ…  ఆ…

రీగ3పా  గ3గా3దా పాగా   గ2గ2రీగా2 రిరిసాసా  …  గ రిసదప

మనసునలేని వారి సేవలతో

మనసునలేని వారి సేవలతో

మనసీయగలేని నీపై మమతలతో

మనసీయగలేని నీపై మమతలతో

వంతలపాలై చింతింతేనా (చింతించే నా) వంతా దేవదా

నా వంతా దేవదా

అంతా బ్రాంతియేనా జీవితానా వెలుగింతేనా

పా  పా    పాద దా సా    సాసరీగా   రీసస  సారీ 

ఆశ నిరాశేనా   మిగిలేది చింతేనా  ఆ…  ఆ…

రీగ3పా  గ3గా3దా పాగా   గ2గ2రీగా2 రిరిసాసా  …  గ రిసదప 

*****

*ఈ స్వరాలు వింటూ నేర్చుకోవడానికి అనువుగా కింద ఇవ్వబడిన “గీతామాధవీయం” టాక్ షో లో రెండవ భాగమైన “స్వరాలాపన” వినండి-

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.