భవిత
– టి. వి. యెల్. గాయత్రి
చెట్టులేదు చేమ లేదు
చిట్టడవు లెక్కడ? లేనే లేవు
పులుగు పోయి పుట్ర పోయి
పశుల జాతి పోయి పోయి
వెనకడుగై కనుమరుగై
గతము లోకి జారి పోతే
ఒంటరిగా వేదనతో
భగభగమని మండి పోతూ
వేడి పుట్టే వాడి సెగలు
పుడమి తల్లి కక్కు తుంటే
ఎక్కడ? ఎక్కడ? నీ భవిత?
చెప్ప వోయి వెఱ్ఱి మనిషి!
గాలి నిచ్చి జీవమిచ్చి
చేవ నిచ్చి మేలుచేయు
చెట్టు చేమ పెంచ వోయి!
చేర దీసి నీరు పెట్టి
భూత కోటి బ్రతుకు పట్టి
భూమాతకు బహుమతిగా
పచ్చదనము పెరగనీయి!
*****