An Earnest Appeal

-English Translation: Nauduri Murthy

-Telugu Original: “Oka Chiru Vijnapti” by Dasari Amarendra

Yes, it’s true.
I admit I was recklessness
In falling asleep like a log.
Without realizing there could be you around
it’s true that in the cradle swing of train
I fell asleep oblivious to the world.
Well, You did your duty.
I don’t find fault with you.

***

You might have opened the suitcase by now.
Did you find the torn white shirt?
I bought it with my first salary.
That discoloured woolen cap you might have noticed
was bought at Ooty when I was there on vacation.
You must have found at the very bottom a faded sepia photo
That was our quarter-century-ago family photo.
That was the lone memorabile of people left this world.

***

Did you find a noisy transistor?
That was a present from my childhood friend.
That old wrist-watch struggling to keep time
was a gift from my mother at my graduation.
Did you also find the album sans cover?
That was a rare souvenir of my college days.
The bunch of letters in the upper pocket of the suitcase
were the sweet nothings from the light of my life.
the cheap camera you found wrapped in clothing
was my father’s birthday gift when I entered teens.
It was my comrade through all my journeys across the country.

***

Whether you are a thief or gentleman whatever,
won’t you please return all those things to me?
Well, forget about the money and certificates in the suitcase
I can somehow get them or reproduce them.
Can anyone re-create souvenirs and memorabilia?
Will you send those things and memories back to me?

***

ఒక చిరు విజ్ఞప్తి

అవున్నేను ఏ జాగ్రత్తా పడకుండా
ఆదమరచి నిద్రపోయినమాట నిజమే…
మీరుంటారన్న స్పృహైనా లేకుండా
రైలుబండి ఊయలలో ఇల మరచిన మాటా నిజమే.
మీ పని మీరు చేశారు… తప్పు పట్టను.

***

పట్టుకుపోయిన పెట్టె తెరిచే ఉంటారీపాటికి-
కొర్రుపడిన తెల్ల చొక్కా కనిపించిందా?
నా మొదటి జీతంతో కొనుక్కున్నానది.
రంగు వెలిసిన ఉన్ని టోపీ ఉంది చూశారూ…
ఊటీ వెళ్ళినపుడు తీసుకున్నదది.
అట్టడుగున రంగు మాసిన పాత ఫొటో ఉండాలే…
పాతికేళ్లనాటి మా ఫ్యామిలీ ఫోటో అది.
వెళ్ళిపోయిన కొంత మంది మిగిల్చిన ఒకే ఒక గుర్తు.

***

బరబర శబ్దాల ట్రాన్సిస్టరు చూశారా?
ఓ చిన్ననాటి నేస్తం ఇచ్చిన ప్రేమ కానుక.
పని చేసీ చెయ్యని పాత వాచీ ఉండాలిగదూ?
డిగ్రీ పాసయినపుడు అమ్మ కొనిపెట్టిందది.
అట్టచిరిగిన ఆల్బం కనిపించిందా?
కాలేజీ రోజుల అపురూప జ్ఞాపిక అది.
పెట్టె పై అరలో ఉత్తరాలకట్ట ఉందిగదూ?
మా ఇంటి మహాలక్ష్మి రాసిన లేఖాసుమాలు అవి.
బట్టలమాటున ఒక చవకరకం కెమేరా కనిపించిందా?
టీనేజ్ లో కడుగుపెట్టినపుడు నాన్న ఇచ్చిన బహుమతి.
దేశమంతా నా వెంట తిరిగిచూసిన నేస్తం అది.

***

దొంగలో దొరలో మీరెవరైతే నేం
ఆ వస్తువులన్ని నాకు వాపసివ్వరూ?
పెట్టేలో ఉన్న డబ్బూ సర్టిఫికేట్ల సంగతా?
మళ్ళీ సంపాదించుకోవచ్చు. మళ్ళీ పుట్టించుకోనూవచ్చు.
జ్ఞాపకాలూ జ్ఞాపికలూ తిరిగి సృష్టించుకోలేము గదా!
ఆ వస్తువుల్నీ జ్ఞాపకాల్నీ నాకు తిరిగి ఇవ్వరూ?!

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.