“నెచ్చెలి”మాట 

సిగ్గు సిగ్గు

-డా|| కె.గీత 

మహాభారతం
నించి
మణిపూర్
దాకా

క్రీస్తు పూర్వపు
వేల
యుగాల
నుంచి
క్రీస్తు శకం
2023
వరకు
లిఖించ
బడనీ
బడకపోనీ
ఒక్కటే
చరిత్ర
ఒక్కటే
వర్తమానం

సిగ్గు సిగ్గు
దేశమా
సిగ్గు సిగ్గు

స్త్రీ దేహమే
మొదటి
దురాక్రమణ

బుద్ధిలేని
బుద్ధిరాని
ప్రపంచమా
సిగ్గు సిగ్గు

స్త్రీ దేహమే
మొదటి
అంగడి వస్తువు
మొదటి
బలిపశువు

సిగ్గు సిగ్గు
సిగ్గు సిగ్గు

మనింటి మనుషులు కాదు కదా
మనకెందుకు అంటారా?
మన వరకూ
వచ్చే వరకూ
ఆగినందువల్లే
ఆదిమ యుగాల
నించీ
ఆధునిక యుగం
వరకూ
ఏ మార్పూ రానిది

 

****

నెచ్చెలి పాఠకులందరికీ సదవకాశం: 

          ప్రతినెలా నెచ్చెలి  పత్రికలో వచ్చే   రచనలు / “నెచ్చెలి” యూట్యూబ్ ఛానెల్లో వచ్చిన ఆర్టికల్స్ వేటిపైనైనా వచ్చిన కామెంట్ల నించి ప్రతి నెలా ఒక ఉత్తమ విశ్లేషణా త్మక కామెంటుని ఎంపిక చేసి  ప్రకటిస్తాం. పాత రచనల మీద కూడా కామెంట్లు చెయ్యవచ్చు. 

          మరింకెందుకు  ఆలస్యం? రచనల్ని చదివి వివరంగా కామెంట్లు పెట్టడం ప్రారంభించండి.  

          వినూత్నం, వైవిధ్యం ప్రధాన నిలయాలైన  “నెచ్చెలి” వస్తున్న వివిధ వినూత్న రచనల్ని తప్పక చూసి, చదివి ఆనందిస్తారు కదూ!

*****

జూలై  2023 లో ఎంపికైన ఉత్తమ కామెంటు రాసిన వారు: సునీత పొత్తూరి

ఉత్తమ కామెంటు అందుకున్న పోస్టు: ధీర – బ్రిస్బేన్ శారద

(నెచ్చెలి-2023 పోటీలో ప్రథమ బహుమతి- శ్రీమతి కె.వరలక్ష్మి ఉత్తమ కథా పురస్కారం పొందిన కథ)

 ఇరువురికీ  అభినందనలు!

*****

Please follow and like us:

3 thoughts on “సంపాదకీయం-ఆగస్టు, 2023”

  1. నిజమే. సిగ్గు సిగ్గు. మణిపూర్ సంఘటన మనలో రగులుతూనే వున్నది. గర్వంగా చెప్పుకునే మన దేశంలో ఇది నీచమైన దుస్థితి! ఆ స్త్రీల మనసు ఎంత రగిలి, చితికి పోయి…వద్దు. ఇక చాలు ఈ మనో వేదన. నెచ్చెలి మాటలో అందరి తో పంచుకున్నారు. మేడమ్ గీతా గారికి జోహారులు.

Leave a Reply

Your email address will not be published.