అయినా సరే!

-బండి అనూరాధ

 
చిగురించి పండి ఎండి రాలి..
ఆకుల వంటి వారమే మనం కూడా.
 
ఒక్కోసారి,
ఒళ్ళు జలదరించే సత్యాల్లోకి తొంగిచూస్తే
నిద్రపట్టని రాత్రుళ్ళలోకి వెళ్ళిపడతామేమోనని
ఈవలిగానే పట్టీపట్టనట్లుండిపోతాం.
 
భ్రమల నేలలో అన్నీ బరువే అనుకుని
తేలికగా ఊపిరి తీసుకుంటూ
చెట్లనీడలో పడిన ప్రాణంలా
తెరిపినపడుతూ…
 
ఒక నిద్రకి, కలల చెట్లని పట్టుకెళ్ళి
వాడని పూలను కోసుకుంటూ
నిజంలా బ్రతికేస్తూ…
 
వనాలలో వైనాలన్నీ పగటికి పూసి
వెర్రి నవ్వొకటి నవ్వుకుంటాం.
 
రాలడం తెలియదుగా..ఎప్పుడో..!!

*****

Please follow and like us:

One thought on “అయినా సరే! (కవిత)”

  1. ఐనా సరే, ఇదే జరుగుతుంది. కవిత బావుంది. మీకు అభినందనలు!

Leave a Reply

Your email address will not be published.