పాటతో ప్రయాణం-6

– రేణుక అయోల  

picture: navarang / 1959
Song : Adha Hai Chandrama
Music : Ramchandra Narhar Chitalkar (C. Ramchandra)
Lyrics : Bharat Vyas
Singers : Asha Bhosle, Mahendra Kapoor

          మనసులో ఎంత ప్రేమ వున్నా కొన్ని సార్లు పెదవి దాటాదు చెప్పా లనుకున్నది
సగంలోనే ఆగిపోతుంది సగంలోనే ఆగిపోతే ఎలా? ఎంత ఆవేదన ఆ ఆవేదనలో నుంచి వచ్చిన మధురమైన పాటే ఇది .. వింటుంటే ఎంత హాయిగా వుంటుందో అంత బాధగా కూడా వుంటుంది మీరు ఈ పాట విన్నాసరే మరోసారి వినండి…

Aadha Hai Chandrama Raat Aadhee
Aadha Hai Chandrama Raat Aadhee
Reh Naa Jaaye Teree Meree Baat Aadhee, Mulaakaat Aadhee

వెన్నెల సగం రాత్రి సగం ఇక్కడే మాటలు కూడా సగంలో ఆగిపోతున్నాయి
ప్రియా సగంలోనే ఆగిపోయే ప్రేమలో
మనసులోని కోరిక కూడ సగమే
కళ్ళలోంచి ఒలికే సగం ప్రేమలో కన్నీటి వర్షం కూడా సగమే

సగంలో ఆగిపోయే ప్రేమకోసం ఆశ ఎందాక వుంటుంది
ప్రేమ అసలు పూర్తిగా దక్కుతుందా లేదా ?
దాహంతో వున్న ఆకాశం గాలి ఆఖరికి నక్షత్రాలకి కూడా సగం పెళ్ళి వేడుక
అందుకే మన ఇద్దరి మధ్య మాటలు కూడా సగంలో ఆగిపోతున్నాయి

వేణువులో రాగం సగం ఇస్తున్నాడు కృష్ణుడు
రాధకి ప్రేమని కూడ సగమే ఇచ్చాడు

కన్నులు అరవిచ్సుకున్నాయి
సగం కలుసుకున్న పెదవుల మధ్యలో
ఆక్షణం ఆ మాట ఆ ప్రేమ సగంలో ఆగిపోయాయి
అందుకే ప్రియా మన ప్రేమమాటలు కూడా సగంలో ఆగిపోతున్నాయి ….

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.