న్యాయపక్షం
(నెచ్చెలి-2023 పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ)
-దామరాజు విశాలాక్షి
“బాల్కనీలో కూర్చొని భానుమతి పరిపరివిధాల ఆలోచిస్తోంది”.
తన కళ్ళారా చూసిన ఆ సంఘటన పరిపరి విధాల ఆలోచించేలా చేస్తోంది”
ఏం చెయ్యాలి? ఈ విపరీతం ఎలా ఆపాలి?
ఇందుకోసమై వీడు తనింట చేరాడా? వీడిని వెళ్ళగొట్టినంత మాత్రాన సమస్య పరిష్కారం అవుతుందా? “సమస్యను సమూలంగా నాశనం చేయాలి… ఎంతో నమ్మకంతో సింహాద్రి పిల్లని తన వద్ద వదిలి వెళ్ళింది. తను ఆమెకు మాటిచ్చి తప్పుచేసిందా?
ఈ మాత్రం మాటను కూడాతను నిలబెట్టుకోలేదా? ఆరోజు సింహాద్రి……
“నాయింట్లో పిల్ల ఉంటే రక్షించలేనమ్మా,.నా మొగుడు తాగుబోతు..నా ఇల్లు ఒకటే గది .ఆడికోసం వచ్చిన ఆడిలాటి బుద్దులున్న వాడి స్నేహితులు పిల్లను వాళ్ళ పాపిష్టి చూపుల నుండి కాపాడలేక పోతున్నాను.
..ఈ ఆపద నుండి నా పిల్లదానిని కాపాడమ్మా! నువ్వు తప్ప నా పిల్లని కాపాడేవారే లేరు అంటూ, ఏడ్చింది”.
బీఎస్సీ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయిన మాలతిని, నా దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా చూస్తా నని, సింహాద్రికి మాట ఇచ్చి తన దగ్గరే పెట్టుకుంది. తను..
ఏదైనా ఉద్యోగం చూసుకొని తల్లికి సాయపడాలని ఆలోచిస్తుంది మాలతి. తనే దెబ్బలాడుతోంది ఎమ్మెస్సీ చెయ్యు… ఆ పైన పీహెచ్డీ చేద్దువు గాని, ఇప్పుడు ఉద్యోగంలో జాయిన్ అయిపోయి, ఈ గొర్రె తోక బెత్తడు జీతంతో ఏం సుఖపెడతావు? నువ్వు కష్టపడి చదివితే నీ తెలివితేటలకు పెద్ద ఉద్యోగమే వస్తుంది, అని చెప్పి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నీ రాయించుతోంది తను. చదువుకునే పిల్లలు అంటే తనకు చాలా ఇష్టం. …
“తను లా చదవడానికి , పేరు పడిన లాయరుగా స్థిరపడడానికి, ఎన్ని పోరాటాలు చేసింది.? అమ్మ తప్ప తనను అర్థం చేసుకొని ప్రోత్సహించిన వారే లేరు..అందుకే ఇప్పుడు ఇలాంటి చదువులో ఆసక్తి ఉన్న మాలతిని చేరదీసింది తను…
సింహాద్రి తను ఈ ఊరు వచ్చింది మొదలు తన పని వదలదు. అవసరాలలో ఆదుకుంటుంది. అలాంటి సింహాద్రి.. భానమ్మా! ,నా జీవితాతంతం నీ సేవజేసుకుంటా నా పిల్లకు ఒక తోవ చూపవా అడిగితే , ఆ అభాగ్యురాలిని ఆదుకోవడం తన తప్పా? అయినా? సామాజికమైన న్యాయంచేస్తానని , సమాజం సవ్యమైన దిశలో నడిపించేలా చేస్తానని ప్రతిజ్ఞచేసే ,అసమానతలు లేకుండా అందరికీ న్యాయం అందించే న్యాయవాదిగా పేరున్న తను, సింహాద్రికి, మాటిచ్చింది. తన కూతురుని జాగ్రత్తగాపెంచు తానని, తప్పెలా అవుతుంది? మరి నేడు జరిగిందేమిటి ?
“నా కొడుకు నీ దగ్గరుండి చదువుకుంటానని సరదా పడుతున్నాడు, భానూ ….అని అన్నయ్యంటే !
దానికేముంది అన్నయ్యా, అలాగే చదువుకోనీ,…నాకు చదువుకునే పిల్లలంటే ఇష్టం అంది తను ,,
తను ఇంతదూరం ఆలోచించలేదు…వాడు మాలతి కోసమే తన ఇంట్లో చేరాడా?
కొడుకు బుద్ధులు వాళ్ళకు తెలియవా?
ఏ సమస్యకు భయపడి పిల్లని సింహాద్రి తన తప్పగించిందో!, అదే సమస్య ఇక్కడ ఉత్పన్నమైతే?
తనెందుకు ఇంకా ఆలోచిస్తోంది.?.ఈ సమస్యను తను పరిష్కరింపలేకపోతే ఎలా?
తను బంధుప్రీతికి లొంగిపోతోందా?. తనాపరా భేదం చూపుతోందా? లేదు,లేదు , అన్న వదినలకు చెప్పి అమ్మాయికి న్యాయం చేయాలి…. క్షణంలో తప్పింది గాని, మాలతి బతుకు మట్టిలో కలిసిపోను. దాని తండ్రికి అసలే తన దగ్గర పెట్టడం ఇష్టం లేదు. తెలివి తేటలు ఎక్కువై తన చేతుల్లో ఉన్నదని భయం… సింహాద్రి కూడా కూతురికి ఇంత అన్యాయం జరిగింది అంటే ఎలా స్పందిస్తుందో తెలియదు కదా? మాలతికి తల్లిలా ప్రవర్తించాలి..”అసహనంగా అటూ ఇటూ కదుల్తున్న భానుమతి కళ్ళు, …. “కాంపౌండ్లో కోడిపెట్ట, కెక్కెక్కని కూయడంతో దృష్టి మళ్ళించాయి”
అసంకల్పితంగా అటు చూసింది..
“రెక్కలు పూర్తిగా విప్పి చిన్న చిన్న కోడిపిల్లల్ని రెక్కల క్రింద దాచేస్తోంది కోడిపెట్ట
” పైన గ్రద్ద ఎలాగైనా ఆ పిల్లల్ని తన్నుకు పోదామని పట్టుదలగా తిరుగుతోంది.
“పరిగెత్తు కెళ్ళి పెద్ద కర్షతో గ్రద్దను తరిమికొడుతూ అక్కడే నిలబడింది భానుమతి.
“.గుసగున నడుస్తూ కోడి పెట్ట కొంత సేపయినాక గూళ్ళోకి వెళ్ళింది పిల్లలితో మహా కోడిపెట్ట”.
మాలతిని కూడా ఈ గద్ద కళ్ళ నుండి ఇలాగే కాపాడాలి అనుకుంది భానుమతి.తిరిగి వచ్చి కూర్చున్న భానుమతి తనకు ఆ చిన్నపక్షి ఆదర్శం అనుకుంది..ఒక నిశ్చయానికి వచ్చింది.
***
“అసలు భానుమతి ఎందుకంత తీవ్రంగా ఆలోచిస్తున్నదంటే !”
“సాయంత్రానికి వస్తానని కోర్టుకి వెళ్ళిన తను., పసిపిల్ల పాడుచేసినారని ఆ కేసు తీర్పు విని రోదిస్తున్న తల్లి దండ్రులను చూసి ప్రస్తుత సమాజంలో ఆడపిల్లల పట్ల జరుగుతున్న అఘాయిత్యాలకు చలించిపోయింది భానుమతి..తలనొప్పిగా ఉందని మధ్యలో. ఇంటికొచ్చింది.
” తనకన్నా ముందే, సాయింత్రం వరకూ రానని చెప్పి వెళ్ళిన తన అన్న కొడుకు రతన్ గొంతువిని ఉలిక్కిపడింది”. మాలతి గొంతు అరుపులు దీనంగా భయంగా వినిపిస్తు న్నాయి…
ప్లీజ్ సార్. నేను అలాంటమ్మాయిని కాను….
నాకు బాగా చదువుకొని మంచి పొజిషన్లోనికి వెళ్లాలని ఉంది. చదువు తప్పనాకు మరో ఆలోచనలేదు. అయామ్ వెరీ సారీ సర్. మీరిక్కడి నుండి వెళ్ళండి…అదేంటి సర్. మీద మీద కొస్తారు.? చాలా అసహ్యంగా ఉంది మీ ప్రవర్తన.. అలా మాట్లాడుతున్నారేంటి?బాబోయ్ ..తాగారా?స్మెల్లేంటి? మీరు నెల రోజులు బట్టి ఏదైనా మాట్లాడుతున్నప్పుడే నేను అమ్మగారికి చెప్పి ఉండ వలసింది.. నాదే పొరపాటు. అమ్మగారు ఎలా అర్థం చేసు కుంటారు నన్ను ఏమనుకుంటారో అనుకున్నాను.. మీరు తాగుతారా? నీ ప్రవర్తన అంతా, అమ్మగారితో చెప్తాను.
నేను మాఊరు వెళ్లిపోతాను. అయ్యో! వదలండి సార్, ప్లీజ్.
గట్టిగా పట్టుకొని మీదపడుతున్న రతన్ నుండి విడిపించుకోడానికి విశ్వప్రయత్నం చేస్తోంది మాలతి .
కిటికీ కర్టెన్ కొంచం తొలగించి చూసిన తను కొయ్యబారిపోయింది. డూప్లికేట్ కీతో తలుపు తీసి లోపలికి ప్రవేశించింది. విసురుగా. అక్కడ నుండి జారుకుందామని ప్రయత్నించిన రతన్ ని, లాగిపెట్టి నాల్గు లెంపకాయలిచ్చి బలంగా బయిటకు తోసింది… మళ్ళీ ఇంట్లో అడుగు పెట్టావంటే చంపేస్తానని బెదిరించింది… పెనుగాలికి అల్లాడిపోయిన చిరుతీగలా, తననల్లుకు పోయిన మాలతి , వెన్ను నిమురుతూ ఉండి పోయింది.
“ అతను మీ మేనల్లుడటమ్మగారూ!. మీరతనేం చేసినా ఏమనరటమ్మా….. చాలా చాలా అసహ్యంగా మాటాడేడమ్మా …. ఆ డైలాగ్స్ వింటే కంపరం పుట్టిందమ్మా!. నా అదృష్టం బాగుండి మీరొచ్చారు .. లేకపోతే ఈ రోజు పరిస్థితి ఎలా ఉండేదో! చూడు,, అంటూ చాలాసేపు ఏడ్ఛ్హింది…
అయినా ! మీరెన్నాళ్ళు నన్నిలా కంటికి రెప్పలా కాపాడుతారమ్మా… మీ చక్కని పెంపకంలో నన్ను నేను కాపాడుకునే పద్ధతి నేర్చుకుంటానమ్మా. ..అమ్మా! మీరంగీకరిస్తే నేను హాస్టల్ కి వెళ్ళిపోతానమ్మా .. బి.ఎడ్ చేస్తానమ్మా.. రాబోయే తరాల పిల్లలకి విలువ లు నేర్పిస్తాను…పిల్లలిలా చెడ్డ త్రోవలు పట్టిపోకుండా మంచి బుద్దులు చెప్తాను నిశ్చయంగా అంది మాలతి. నిలువెల్లా కంపనం తగ్గకున్నా ఏడుస్తునే…ఏవేవో చెప్తోంది..
నా వలన మీరు మీ బంధుమిత్రుల చెడ్డవ్వడం వద్దమ్మా నేను వెళ్ళిపోతాను.
“ నేను. చాలా నయం నావంటి అమ్మాయిలు చాలామంది. మీ వంటి ఆధారం దొరక్క అవస్థల పాలవుతున్నారమ్మా!. అందరూ నా వాళ్ళని అభిమానిస్తారు మీరు … నాకు ఆ హోదాలొద్దు..అతను చూపించే ఆ కపట ప్రేమ వద్దు… అయినా పెంచిన మీ ప్రేమా గొప్పదే,. మీరే చెప్పండమ్మా … నేనేం చేసేదని… ఏడ్చ్హింది మాలతి ..
“మాలతిని చూస్తుంటే చాలా జాలి వేసింది. అందుకే ఒక దృఢనిశ్చయానికి వచ్చి ఆలోచించుకొని అన్నావదినలకూ ఫోన్ చేసింది భానుమతి..
“మన వాడిలా చేసాడు, నా కళ్ళతో చూసాను …చాలా అసహ్యంగా ప్రవర్తించాడు ..
మీరు. పెద్దవాళ్ళని మీకు చెప్పాను..ఆ అమ్మాయి హడిలిపోతోంది .. ఆ పిల్ల భవిష్య త్తు మీ చేతిలో పెడతాను . వాళ్ళకి పెళ్ళి చెయ్యండి..ఆ పిల్ల నా చేతులలో పెరుగుతోంది. వాడింకా అమ్మాయి అంటే ఇష్టం అన్నాడు. అందుకే మీకు చెప్పాను అంది అన్న వదిన లతో భానుమతి.
“ఏంటి, ఆ అమ్మాయితో పెళ్ళి చేయాలా? ఈ రోజుల్లో ఈ అమ్మాయిలాంటి వాళ్ళు ఇలా పెద్ద వాళ్ళ ఇళ్ళల్లో చేరి వాళ్ళ పరువు తీయడానికి నాటకాలు ఆడి డబ్బులు గుంజు తున్నారు నువ్వు అమ్మాయి మాయలో పడిపోయావు. నీ ఇంట్లో తిష్ట వేసినట్లే, మా వాడిని లోబరుచుకుని మా ఇంట్లో తిష్ట వేయాలని చూస్తున్న్నట్లుంది అమ్మాయి అంటూ నోటికి వచ్చినట్లు మాట్లాడారు మాలతిని గురించి రతన్ తల్లిదండ్రులు.
మీరు ఆ అమ్మాయిని గురించి అసహ్యంగా మాట్లాడకండి . అమ్మాయి ఏమి చెప్పలేదు నా కళ్ళతో నేను చూసిన విషయాన్ని మీతో చెప్పాను. ఒక్కమాట. ఆత్మీయంగా ఆ అమ్మాయిని చేసుకోకపోతే, ఆ అమ్మాయికి వచ్చిన నష్టం లేదు. అలాంటి ఆణిముత్యా న్ని పొందలేని మీరే దురదృష్టవంతులవుతారు…
అయినా ఇలాంటి వాడికి ఆ పిల్లనిచ్చి గొంతు కోయడం కూడా అన్యాయమే… మీరు అబ్బాయి అక్రమ ప్రవర్తన ప్రోత్సహించిన వారవుతున్నారు. వాడు మీ పరువు తీస్తాడు., అబ్బాయి గాబట్టి వాడెవరితో తిరిగినా చెల్లుతుందన్న భావంతో ఉన్నారు మీరు. అందుకు ప్రతిఫలం అనుభవిస్తారు….
“మీ అయినింట్లో అడుగు పెట్టేది అతి సంపన్నురాలైతే చాలని, అనేక మంది ఆడపిల్లల ఉసురుపోసుకొనే ఉత్సాహాన్ని వాడిలో నింపుతున్నారు. మీలా చాలా మంది పిల్లల్ని వెనక్కి వేసుకు పెంచబట్టే, మగపిల్లలు చెలరేగి పోయి విలువలు లేక విఱ్ఱవీగు తున్నారు. పిల్లల్ని ప్రేమతో పెంచండి .కానీ, దృత రాష్ట్ర ప్రేమగాదు. అన్నా వదినలు ఆ అమ్మాయి గురించి ఆడిన మాటలువిని భానుమతి ఆవేశంతో ఊగిపోతూ అంది ..
“ అన్నా. వదినల మాటలువిని మనసులో అనుకుంది …. అంతే గదా! అన్న అప్పడు అంట్లుతోమే అప్పయమ్మా కూతురు కనకతో, గ్రంథం నడిపితే, .నాన్నకు తెలిసి నడుం విరిగేలా కొట్టి, .ఊరి నుండి పంపించారు. ,. నాన్న చెల్లెలి కూతురైన ఈ ప్రగతితో పెళ్ళి నిశ్చయం జేసారు.
అప్పయ్యమ్మని పిల్చి ఆప్యాయత పొంగి పోతున్నట్టు మాట్లాడి. కనక పెళ్ళి ఖర్చంతా తనే భరిస్తానని చెప్పి కాకినాడలో ఉన్న దాని మేమమామ కొడుకుతో పెళ్ళి జరిపించేసారు. అన్నని అస్సాంలో తెల్సిన ప్రొఫెసర్ దగ్గర పిహెచ్.డి.కి పంపాడు. ఆ తర్వాత అంతా మామూలే.
వదినకి ఒంటినిండా నగలు, పర్స్ నిండా డబ్బూ ఉంటే చాలు పద్ధతులు ప్రేమాభిమానాలు. ఏమీ అక్కర్లేదు. డబ్బు తెచ్చిన మదం ఎక్కువ. అమ్మ తనతో అంది “భానూ , ఏ ఆడపిల్ల అన్యాయం జరగకుండా . నీవైనా చూడమ్మా….ఎవరి ఉసురు మనకు కొట్టిందో , పెళ్ళయి పదికాలాలయినా గడవకుండానే ఈ ఇంటి ఆడపిల్లవైన పాపానికి, పచ్చని నీ బ్రతుకు మోడుబారిపోయింది. మంచివాడు నీ మనసుకునచ్చిన వాడు దొరికితే మళ్ళీ పెళ్ళి చేసుకో .. న్యాయం పక్షాన నిలబడతానని మాటియ్యమ్మా! ఈ ఇంట నా మాట చెల్లదు అని చనిపోయే ముందు మాట తీసుకుంది. అమ్మ బ్రతుకంతా అహంకారానికి బలవుతునే గడిచింది.
“ఈ రోజు. మేనల్లుడు ఎమ్. ఎసి చేయడానికి ,యూనివర్సిటీలో జాయినయి , తనింట్లో చేరి , ఈ రోజు తనకి తలనొప్పయాడు. ఇలా , చేసాడని ఫోన్ చెయ్యగానే పిల్లడిని మందలించడం మానేసి ……………..
అదేంటి భానూ!, నీకు మతిగాని పోయిందా? ఆఫ్ట్రాల్ ఓ అంట్లు తోముకునే దాని కూతురితో నా కొడుకు పెళ్ళి చెయ్యమంటావా? ఆవేశంగా అరుస్తు అన్నారన్నా వదినా?
అయితే!, మీ అబ్బాయిని అర్జంటుగా తీసుకెళ్ళి ఏదైనా హాస్టల్ లో జాయిన్ చెయ్యండి లేదా చదువుకి స్వస్తి చెప్పమనండి. ఖచ్చితంగా అంది తను.
ఓహో!, రక్తసంబంధం కన్నా నీకా అంట్లవాళ్ళే అయినవాళ్ళయినారా? నీ ,పెళ్ళి పెటాకులయింది! .పిల్లలుంటే ప్రేమ తెలిసేది? వ్యంగ్యంగా అంది వదిన. .
ఒళ్ళు మండిపోయింది భానుమతికి. అన్నయ్యది కూడా అదే మాట?.అప్పుడు అంది. అన్నిసార్లు అంట్లవాళ్ళనకన్నయ్యా! మీ అవసరాలు తీర్చడానికి పనికొచ్చే అంట్లవాళ్ళు, మీరు చాటు మాటుగా సాగించే వ్యవహారాలకి పనికొచ్చే అంట్లవాళ్ళు ,పబ్లిక్ గా పెళ్ళి పీటల మీద కూర్చోడానికి అర్హులు కారా? పోనీ , నా ఆస్తంతా అమ్మాయికి రాసిస్తా అలా పనికొస్తుందా? ఆ అమ్మాయి.
“అయినా, అమ్మాయి కాళ్ళు వేళ్ళూ పట్టుకుని, తన కామాన్ని తీర్చమనే నీ కొడుక్కి ,, తాళి కట్టమని అంటే కోపం వచ్చిందంటే,,, ఎంటో అనుకున్నాను!. ఓహో !,తల్లీ, తండ్రి భావాలు పుణికి పుచ్చుకున్నాడు గదా..
వదిన పెళ్ళి ,పెటాకులు అంటోంది? పెళ్ళి చేసుకొని పిల్లల్ని కని, పెడదారుల్లో పయనిస్తుంటే, గాంధారిలా గంతలు కట్టుకున్న, ఆమెకంటే, నేనే నయం.కదా?..
సమాజానికి చీడపురుగుల్లాటి సంతానాన్ని కనేకంటే,, ఆడపిల్లల బతుకులుతో ఆడుకునే నీ కొడుకు లాంటి పిల్లల్ని కనేకంటే, పిల్లలులేని నేనే నయంకదా….
“సామాజిక హోదా కోసమే పెళ్ళి చేసుకొని, చెప్పుకిందతేల్లా మొగుణ్ణి నొక్కి పట్టి ,
చిన్నా పెద్దా తేడాలతో, భేదభావంతో, స్వేచ్ఛ పేరుతో స్వైరవిహారం చేసే వదినలాటి వాళ్ళెకంటే, మమకారాలు మానవత్వం, మనీ కళ్ళబడితే మాకొద్దనుకునే మీకంటే ,,
పెళ్ళిపెటాకులు అయినా, ప్రశాంతంగా బ్రతుకుతున్నాను. ఎవరికీ అన్యాయంచెయ్యను. నా కళ్ళ ముందు అన్యాయం జరిగితే ఊరుకోను.. న్యాయవృత్తిని చేపట్టినప్పుడే, నేను న్యాయదేవత కళ్ళకు కట్టిన గంతలనిప్పి., నిజాన్ని నిరూపిస్తానని , న్యాయవాద వృత్తిని చేపట్టిన రోజే న్యాయం పక్షాన ఉంటానని ప్రమాణం చేసాను.
మీరనుకున్నంత ప్రేమ నాకు ఆ అమ్మాయి మీద లేదు కాబోలు.. మీ కొడుకు పట్ల ఎక్కడో ప్రేమ ఉండబట్టి అరిచి గోల చేయకుండా వాడిని అలా వదిలేసాను ..అయినా! ఎవరికీ తెలియకుండా ఇంట్లో అమర్చిన సీసీ కెమెరా నుండి ఆధారాలన్నీ నేను భద్రపరిచాను.. నా సెల్లులో వాడి మాటలు రికార్డు చేశాను.. ఇప్పటికైనా మించిపోయింది లేదు . మీరు ఎలాగూ. అమ్మాయిని మీ కొడుక్కి చేసుకోరు ..నాకు తెలుసు.. అందుకే అమ్మాయికి కోటి రూపాయిలు నష్ట పరిహారం ఇస్తారో ఏం, ,నేను తీసిన వీడియో సాక్ష్యంగా నన్నే కోర్టులో కేసు వేసి, రేప్ కేసులో ఇరుక్కుని , కోర్టు చుట్టూ తిరుగుతారో, మీ ఇష్టం విసురుగా అంది భానుమతి. …
అమ్మో, అమ్మో! ఈ రాక్షసి, ఆ పిల్ల నష్టపరిహారం పేరుతో, తనకు రావలసిన ఆస్తి వాటాను కూడా లాగేస్తుందేమోనండి ,అన్న వదిన మాటలు విని,, బాగా గుర్తు చేశావు వదినా,,, థాంక్యూ, ఆ కేసు కూడా వేస్తాను సిద్ధంగా ఉండండి .నన్ను,అమాయకురాలైన ఆ పిల్ల మాలతిని, అనరాని మాటలు అన్నావు కదా! దాని ఫలితం అనుభవించు అని ఆవేశంగా అని ఫోన్ పెట్టేసింది భానుమతి…
*****
చిన్న పల్లెలో పుట్టిపెరిగి స్వశక్తితో గురువులు నేర్పని విద్య, స్వయంకృషితో నేర్చుకుని ,ఆ కుగ్రామంలో మొదట డిగ్రీ, పీ జి చేసిన ఆడపిల్లను నేనే ..నలభై ఏళ్ళుఉపాధ్యాయవృత్తి నిర్వహించాను …. సువిశాలమైన ఈసాహితీ క్షేత్రంలోనావంటూ కొన్ని విత్తులు నాటుకోవాలని, నిత్యం సేద్యంచేస్తూ ఉన్నాను..
“పిల్లల కోసం 25 పైగా నాటికలు రాసి వాటిని మా పాఠశాల పిల్లలచే పాతికేళ్లు ప్రదర్శింప చేశాను” ..వివిధ సంస్థలచే ఉత్తమ ఉపాధ్యాయునిగా, సన్మానాలు సత్కారాలు పొందాను.
Story Bagundi. nijamgaa ilaa jarigite baagundunu.
చాలా బాగా రాసారు.అభినందనలు.