డా|| కె.గీత పూర్తిపేరు గీతామాధవి. వీరు “నెచ్చెలి” వ్యవస్థాపకులు, సంపాదకులు. తూ.గో.జిల్లా జగ్గంపేటలో జన్మించారు. ప్రముఖ కథా రచయిత్రి శ్రీమతి కె. వరలక్ష్మి వీరి మాతృమూర్తి. భర్త, ముగ్గురు పిల్లలతో కాలిఫోర్నియాలో నివాసముంటున్నారు.
ఆంధ్ర విశ్వవిద్యాలయంలోఇంగ్లీషు, తెలుగు భాషల్లో ఎం.ఏ లు, తెలుగు భాషా శాస్త్రం లో పిహెచ్.డి చేసి, 10 సం. రాల పాటు మెదక్ జిల్లాలో ప్రభుత్వ కళాశాల అధ్యాపకురాలిగా పనిచేసారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నించి 2006 లో “ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ” పొందారు.అమెరికాలో ఇంజనీరింగ్ మేనేజ్ మెంట్ లో ఎం.ఎస్ చేసి, ప్రస్తుతం సాఫ్ట్ వేర్ రంగంలో భాషా నిపుణురాలిగా పనిచేస్తున్నారు.
ద్రవభాష, శీతసుమాలు,శతాబ్దివెన్నెల, సెలయేటి దివిటీ, అసింట కవితాసంపుటులు, సిలికాన్ లోయ సాక్షిగా కథాసంపుటి, వెనుతిరగనివెన్నెల నవల, At The Heart of Silicon Valley -Short stories (2023),Centenary Moonlight and Other Poems(2023) ప్రచురితాలు. నెచ్చెలి ప్రచురణ “అపరాజిత” – గత ముప్పయ్యేళ్ల స్త్రీవాద కవిత్వం (1993-2022) పుస్తకానికి సంపాదకులు & ప్రచురణకర్త. ‘యాత్రాగీతం’ ట్రావెలాగ్స్, ‘కంప్యూటర్ భాషగా తెలుగు’ పరిశోధనా వ్యాసాలు కొనసాగుతున్న ధారావాహికలు. అజంతా, దేవులపల్లి, రంజనీ కుందుర్తి, సమతా రచయితల సంఘం అవార్డు, తెన్నేటి హేమలత-వంశీ జాతీయ పురస్కారం, అంపశయ్య నవీన్ పురస్కారం మొ.న పురస్కారాలు పొందారు.
టోరీ రేడియోలో “గీతామాధవీయం” టాక్ షోని నిర్వహిస్తున్నారు. తానా తెలుగుబడి ‘పాఠశాల’కు కరికులం డైరెక్టర్ గా సేవలందజేస్తున్నారు. కాలిఫోర్నియా సాహితీ వేదిక “వీక్షణం”, తెలుగు రచయిత(త్రు)లందరి వివరాలు భద్రపరిచే “తెలుగురచయిత” వెబ్సై ట్ వ్యవస్థాపకులు, నిర్వాహకులు.
చాలా చక్కటి సాహిత్యం, ఎన్ని ఉపమానాలో మీ ఊరిగ్యాపకంలో మా ఆమ్మ కనపడింది గీతగారు అభినందనలు. ఒకే సమయంలో ఎన్నో జీవితాలను కలిపి జీవిస్తూన్నారు. అద్భుతమైన మహిళ మీరు
పాట మీకు నచ్చడమే కాకుండా, చక్కని కామెంట్ ని అందించినందుకు అనేక నెనర్లు జ్వలిత గారూ!
కవిత్వం రాయలని కోరికతో..పాటలు రాసి స్వరం కట్టాలని తపనతో ఈ ఊరు గాపకం రాలేదు..ఊరికి వేల మైళ్ళ దూరంలో ఉండి.. ఋతు రాగాలు వినలేని ఋతువులు తీసుకువచ్చే రంగులు చూడలేని ఒక మనసు లోతుల్లో ఎక్కడో మిగిలిపోయిన తడి చిమ్మిన అక్షర ముత్యాలు..గీత మాలగా మారి..అమృత ఝరిలా. తీయగా…వెన్నెల శబ్దంలా మెత్తగా తాకింది….పరుగులు తీసే బయటి ప్రపంచంతో అడుగు కలప లేక .. గడపలో తిరగలి పట్టో…ముంగిట్లో రోకలి పట్టో…దూడను కట్టి పాలు పితుకు తూనో…కేవలం అసంకల్పిత ప్రతీకారంగా బయటకు వచ్చినట్టు ఉన్న అద్భుతమైన మాటలు..కాదు కాదు..పాఠం. .ఈ పాట వినటానికి ఎంత నిండుగా ఉందో వినిపించిన వాళ్ళ మనసు అంత వెలితిగా ఉండి ఉంటుంది…చదవటానికి ఎంత తేలికగా ఉందో…ఎదను తాకినప్పుడు అంత బరువుగా ఉంటుంది… అన్నిటినీ మించి..మనం కేవలం వింటున్నామని తెలిసినా…పాడుతున్నట్టు అనిపిస్తుంది…మన పాటే అనిపిస్తుంది…ఇంత గొప్పగా..కాలం కప్పిన పొరలను ఒక్కొక్కటి తీసేస్తూ లోలోపలికి వెళ్లి అత్యంత సుందరమైన పల్లె కాండ ను ఆవిష్కరించి నందుకు గీత గారికి ధన్యవాదాలు…మరిన్ని
పాటలకు ముందస్తు అభినందనలు…
సింహాచలం నాయుడు గారూ! మీ ప్రతిస్పందనకు నెనర్లు ఎలా చెప్పాలో కూడా తెలియడం లేదు. బహుశా: మరిన్ని వెలికితీయడమేనేమో!!
యీనెల నెచ్చెలిలో వచ్చిన డా. గీత గారి ‘ఊరిగేపకం’ పాట చాలాబావుంది. రచన, బాణి, పాడడం అన్నీ సమతూకంలో ఉన్నాయి. పాట దానికి తగిన మూడ్ ని అదే సృష్టించుకుంది. చాలారోజుల తరువాత ఒక కొత్త పల్లెపదం విన్నాను.
మనకు కవిత్వం పెరిగిందిగాని పాటలు తగ్గిపోయాయి. సినిమాపాటల్లో సాహిత్యం ఉండడంలేదు. ప్రజల గుండెల్లోంచి వచ్చిన జానపదగీతాలు, ప్రజాకవుల పాటలూ అరుదయాయి. గురజాడ పూర్ణమ్మ కథలాంటి అనేక చరణాలున్న పెద్దపాటలు, పాటరూపంలోవున్న జానపదకథాసాహిత్యం రావడంలేదు.
డా. గీతగారి ‘ఊరిగేపకం’ పాట వేసవిలో వీచిన ఒక చల్లనిగాలి.
వారు ఇంకా ఇలాంటి మంచిపాటలు రాసి, పాడి వినిపించాలని అభ్యర్థన.
రమణ గారూ! పాట రచన, బాణి, పాడడం అన్నీ మీకు నచ్చినందుకు ఎంతో సంతోషంగా ఉంది. నిజమే మీరన్నట్టు జానపదగీతాలు అరుదైపోయేయి. తప్పకుండా మీ కోరిక మేరకు రాయడానికి ప్రయత్నిస్తాను. పల్లె పాటలు రాసేందుకు ఒక్క కామెంట్ తో వెయ్యేనుగుల బలాన్నిచ్చిన మీకు అనేక నెనర్లు.