కరోనా కవిత: “విశ్వ విజేతలవుదాం”

-వంజారి రోహిణి

తిరుగుబాటు – పోరుబాట
రణరంగంలో యుద్ధం…
ప్రాచీన చరిత్ర లో
రాజులకు రాజులకు మధ్య
రాజ్యాలకు రాజ్యాలకు మధ్య
రాజ్య కాంక్షతో రక్తాన్ని
ఏరులై పారించారు…
చివరికి అందరి ప్రాణాలు గాల్లో
అన్నీ కట్టెలు మట్టిలో….
ఆధునిక చరిత్ర లో
ప్రాంతానికీ ప్రాంతానికీ మధ్య
దేశానికీ దేశానికీ మధ్య
కులానికీ కులానికీ మధ్య
మతానికీ మతానికీ మధ్య
మనిషికి మనిషికి మధ్య
ఆధిపత్యం కోసం అణిచివేత
వివేక రహిత విద్వేషం….
ఫలితం…
కొందరి గెలుపు కొందరి ఓటమి
హత్యలు ఆత్మాహుతులు
వరదలై పారిన నెత్తుటి కన్నీరు
వర్తమాన ప్రపంచంలో
అందరికీ ఒకటే శత్రువు
కరోనా వైరస్
మనుషులంతా ఒకటై
ప్రాంతాలన్నీ ఒకటై
దేశాలన్నీ ఒకటై
విశ్వ మంతా ఒకటై
పోరుబాట పడదాం
అందరికీ ఏకైక శత్రువై
అందరి ప్రాణాలతో 
చెలగాటమాడుతున్న
కరోనా వైరస్ పై యుద్ధం
ప్రకటిద్దాం….
ఇంట్లో నే ఉందాం
పరిశుభ్రత ను పాటిద్దాం
మనసులన్నీ ఒకటిగా చేసుకుని
మనుషుల మధ్య మాత్రం
కాస్త ఎడం పాటిద్దాం
కరోనా మహమ్మారి
భరతం పడదాం…
ప్రపంచం మొత్తాన్ని
వదిలి వేసేదాక
తరిమి తరిమి కొడదాం
ఆరోగ్య ఆనందమయ
ప్రపంచాన్ని చేజిక్కించుకుందాం
మనమంతా 
విశ్వ విజేతలవుదాం”

*****

ఫోటో ఆర్ట్: రమేష్ పొతకనూరి

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.