ఊపిరి పోరాటం (కవిత)

– శ్రీ సాహితి

దేశం భరించలేని బాధ
ఓ కన్నీటిచుక్క రూపంలో
ఆమెని మింగేసింది.

చీకటి కాపలా కాసిన నరకానికి
సిగ్గుపడ్డ పగలు
నిజాలకు చిక్కి శల్యమైనది.

మంచం పట్టిన నమ్మకం
మరణశయ్యపై చేరి
దేశాన్ని ఓ మాట అడిగింది..

ఆడపిల్ల “ఊపిరి పోరాటం”
చేయాలా? అని.

సిగ్గుతో దేశం చచ్చిపోయింది

*****

Please follow and like us:

2 thoughts on “ఊపిరి పోరాటం (కవిత)”

  1. అన్యాపదేశంగా ఓ ఆడపిల్ల వ్యధను వ్యక్తపరచడానికి కవయిత్రి వాడిన పదాలు అమోఘం!
    కవిత చిన్నదయినా భావం సారం అపరిమితం!!
    కవయిత్రికి అభినందనలు!!! 💐🤝😊

  2. కవిత చిన్నదే..కానీ అంతర్లీనమైన భావన అపరిమితం.. ఆడపిల్ల “ఊపిరి పోరాటం” చేయాలా?..అది ప్రశ్న కాదు..ఆడపిల్ల వేదన.. రక్షణ కోసం అడుగుతున్న భిక్ష.. దేశం కాదు సమాజం సిగ్గుతో చావాలి.. అద్భుతమైన మినీకవిత.. కవయిత్రికి అభినందనలు…

Leave a Reply

Your email address will not be published.