ప్రముఖ రచయిత్రి బలభద్రపాత్రుని రమణి గారితో నెచ్చెలి ఇంటర్వ్యూ

-డా||కె.గీత 

ప్రముఖ రచయిత్రి బలభద్రపాత్రుని రమణి గారితో నెచ్చెలి అంతర్జాల వనితా మాస పత్రిక వ్యవస్థాపక సంపాదకులు డా||కె.గీత గారి ముఖాముఖీ కార్యక్రమాన్ని నెచ్చెలి పాఠకుల కోసం ఇక్కడ ఇస్తున్న వీడియోలో ప్రత్యేకంగా అందజేస్తున్నాం.

తప్పక చూసి మీ అభిప్రాయాల్ని తెలియజెయ్యండి.

          బలభద్రపాత్రుని రమణి పరిచయం అవసరం లేని పేరు. సినిమా, టీవీ, వెబ్ సిరీస్ ల రచయిత్రిగా, సెన్సార్ బోర్డు మెంబరుగా, నేషనల్ అవార్డు జ్యూరీ మెంబరుగా పలువురి మన్ననలు పొందారు. 1993 నుండీ రచనలు చేస్తున్నారు. వీరి మొదటి పుస్తకం వీరి తాత గారు, ఫ్రీడం ఫైటర్ శ్రీ సూరంపూడి శ్రీహరి రావు గారి బయోగ్రఫీ అయిన “లీడర్”. ఈ పుస్తకాన్ని అక్కినేని నాగేశ్వరరావు గారికి అంకితం ఇచ్చారు. ఇప్పటి దాకా 28 నవలలూ, 300 పైచిలుకు కథలూ,16 డైలీ సీరియల్స్,11 సినిమాలూ,2 వెబ్ సీరీస్ ఎన్నో కాలమ్స్ రాసేరు. కౌముదిలో ప్రచురితమవుతున్న వీరి కాలమ్స్ మూడు సంపుటాలుగా “కాలం దాటని కబుర్లు” పేరుతో మార్కెట్ లో వున్నాయి. వీరి కథలు “రమణి కథలు”గా రెండు సంపుటాలు ప్రచురింపబడ్డాయి. చిన్నపిల్లల కోసం సీమటారో కథలు రాసారు.

          వీరి భర్త గారి పేరు ప్రభాకర్. మహీంద్రా & మహీంద్రా లో చేసి రిటైర్ అయ్యారు. ఇద్దరు మగ పిల్లలు. పెద్దబ్బాయి అశ్విన్ కుమార్, ఆర్కిటెక్ట్. రెండవ అబ్బాయి కృష్ణకాంత్, మెకానికల్ ఇంజినీర్. మనవడు ధృవకుమార్.

          2007లో మధుమాసం సినిమా కథకు గాను ఉత్తమ కథకురాలిగా ఆం.ప్ర.స్టేట్ గవర్న్మెంట్ నించి నందీ అవార్డ్ పురస్కారం పొందారు.

          66 వ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ కూ, 69 వ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ కూ జ్యూరీ మెంబర్ గా పని చేసారు. మొదటిసారి 7, రెండవసారి 11 అవార్డులూ తెలుగు ఇండస్ట్రీకి తెచ్చి పెట్టిన ఘనతను సాధించారు.

          తెలుగు సినిమా రచయితల సంఘంలో వివిధ పోస్టుల్లో పనిచేసారు. ప్రస్తుతం ట్రస్టీ మెంబర్ గా, లైబ్రరీ ఇన్ఛార్జ్ గా కొనసాగుతున్నారు.

          విమెన్ ప్రొటెక్షన్ సెల్ ఛైర్ పర్సన్ గా గీతా ఆర్ట్స్ కీ, సురేష్ ప్రొడక్షన్స్ కీ, తెలుగు రైటర్స్ అసోసియేషన్ కీ బాధ్యతలు స్వీకరించారు.

          వీరి లేటెస్ట్ వెబ్ సిరీస్ “కుమారి శ్రీమతి” వీరికి ఎంతో పేరుని తెచ్చిపెట్టింది. వీరు చివరిగా పని చేసిన సినిమా “భగవంత్ కేసరి”.

          ప్రస్తుతం చాయ్ బిస్కెట్ ప్రొడక్షన్ హౌస్ కి కన్సల్టెంట్ గా చేస్తున్నారు. రెండు వెబ్ సిరిస్ రైటింగ్ స్టేజ్ లో వున్నాయి.

*****

Please follow and like us:

One thought on “ప్రముఖ రచయిత్రి బలభద్రపాత్రుని రమణి గారితో నెచ్చెలి ఇంటర్వ్యూ”

Leave a Reply

Your email address will not be published.