దేవి చౌధురాణి

(మొదటి భాగం)

మూలం – బంకిమ చంద్ర ఛటోపాధ్యాయ

తెనుగు సేత – విద్యార్థి

          భవానీ ఠాకూర్ తను ఇచ్చిన మాట ప్రకారం ప్రఫుల్లకు తోడుగా ఇద్దరు స్త్రీలను పంపించాడు. ఒకరు పని మీదైనా బయటకి వెళ్లిరావటానికి. ఈవిడ మధ్య వయస్కు రాలు, శ్యామ ఛాయ. రెండవ స్త్రీ వయసు ఇరవై వుంటుందేమో, తెల్లగా వుంది. ప్రఫుల్లకు ఎప్పుడూ ఇంటి దగ్గర తోడు వుండటానికి

          ఇద్దరూ ప్రఫుల్లకు ప్రణామం చేశారు. మీ పేర్లేమిటని అడిగింది ప్రఫుల్ల.

          వయసులో చిన్నగా వున్న స్త్రీ రెండవ స్త్రీని చూపుతూఈవిడకు కొంచెం చెముడు. ఎప్పుడు వినబడుతుందో, ఎప్పుడు వినబడదో తెలీదు. అందరుపేడకళ్లోడి తల్లి అని పిలుస్తారుఅన్నది.  

          “పేడకళ్లోడి తల్లీ, నీకు ఎంతమంది కొడుకులు?” అని అడిగింది ప్రఫుల్ల

          “నేనేమీ కొయ్యాళినీ కాదు గయ్యాళినీ కాదు. ఎవరు నన్ను అలా పిలుస్తున్నారు?” అన్నది పేడకళ్లోడి తల్లి.

          “మీరు ఏమిట్లూ?”

          “నువ్వేమి చెపితే అది చేస్తాను.”

          “అంటే మీరు ఎవరూ అని?”

          “ఇంకొక మనిషి కూడా కావాలా? అన్ని పనులూ నేను చేస్తానని చెపుతున్నాను కదా, రెండు మూడు పనులు మాత్రం చెయ్యను.”

          “ఏమేమి పనులు చెయ్యవేమిటి?”

          “నీళ్లు తోడలేను, చేతులలో బలం పోయింది. బట్టలు ఉతకలేను, అవి కూడా నువ్వే వుతుక్కోవాలి.”

          “మిగిలిన పనులన్నీ చేస్తావా?”

          “అంట్లు కూడా నువ్వే తోముకోవాలి.”

          “ పని కూడా చెయ్యలేకపోతే ఇంకేమి చెయ్యగలవూ?”

          “, ఇల్లు వూడవటం కూడా నా వల్ల కాదు.”

          “మరి నీకు ఇంకేమి పని చేతనవుతుంది?”

          “ఏది చెపితే అది చేస్తాను. కూర్చుని తాళ్లు అల్లుతాను, ఇంటిముందు కళ్లాపి జల్లుతాను, చెత్త పారేస్తాను, అసలైన పనులన్నీ చేస్తాను. బజారు పోయి వస్తాను కూడా.”

          “బజారు వెళ్లితే అక్కడి దుకాణాదారులతో బేరాలాడగలవా?”

          “వయసు పైబడుతున్నది అని అన్నాను కదా, పని మాత్రం చెయ్యలేను. ఎన్ని డబ్బులిస్తే అన్నీ ఖర్చు పెట్టి రాగలను. నేను పని చెయ్యలేదు పని చెయ్యలేదు అని మాత్రం అనమాకు.”

          “నీ అంత గుణవంతురాలు ఎక్కడా దొరకదుఅంటూ నవ్వింది ప్రఫుల్ల.

          “నేనంటే పెద్దదాన్ని కదా, అందుకనే అన్నీ పద్దతిగా వుంటాఅన్నది పేడకళ్లోడి తల్లి.

          ప్రఫుల్ల రెండవ స్త్రీనినీ పేరేంటమ్మాఅని అడిగింది.

          “నా పేరేంటో నాకు తెలీదు చెల్లీ.”

          “అదేమిటీ? మీ అమ్మా నాన్న నీకు పేరు పెట్ట లేదా?”

          “పెట్టే వుంటారు, నాకు మాత్రం తెలీదు.”

          “అది ఎలాగ?”

          “నాకు ఊహ తెలిసేటప్పటికే పిల్లలని ఎత్తుకుపోయే వాళ్లు నన్ను ఎత్తుకుపోయి ఎవరికో అమ్మేశారు.”

          “ఎత్తుకుపోయిన వాళ్లైనా నీకు ఏదో ఒక పేరుతో పిలిచి వుంటారు కదా?”

          “(, చాలా పేర్లతో పిలిచేవారులే.”

          “ పేరులతో పిలిచేవారూ?”

          “మాడు మొహందానా, ముదనష్టపుదానా, మొండిది, ఇంకా చాలా పేర్లు వుండేవి.”

          “నువ్వే మాడు మొహమానివి, ముదనష్టపుదానివి, నన్నెందుకంటావు?” అన్నది చెవిటి పేడకళ్లోడి తల్లి.

          రెండవ స్త్రీ నవ్వినేను నిన్నేమీ అనలేదులేఅన్నది.

          “ఎందుకు అనలేదూ? నేనే విన్నానుగా, అసలెందుకు తిట్టాల్సివచ్చింది?”

          ప్రఫుల్ల నవ్వి, “నిన్ను కాదూ, నన్ను అన్నదిఅని పలికింది.

          పేడకళ్లోడి తల్లికి కంపరం పుట్టుకొచ్చింది. “నిన్నెందుకు అనటం, నన్నే అననివ్వు తల్లీ. దీని మీద కోపం మాత్రం తెచ్చుకోమాకు, దీని పెంపకమే సరిగ్గాలేదు. బ్రాహ్మలమ్మాయి జీవితం అంతా కష్టాలే. పాపం, దాని మీదేమీ కోపం తెచ్చుకోమాకే.”

          పేడకళ్లోడి తల్లి తనని మాటా పడనివ్వకుండా, అలాగే రెండవ స్త్రీ మీద జాలిగా మాట్లాడటం చూసి ఫ్రఫుల్లకు మళ్లీ నవ్వు వచ్చింది. రెండవ స్త్రీ వంక చూసి, “నువ్వు బ్రాహ్మణివా? మరి చెప్పలేదే? నీకు నా నమస్సులుఅన్నది.

          “నేను బ్రాహ్మల ఇంటిలోనే పుట్టాను. కానీ బ్రాహ్మణిని కాదు.”

          “అదెలా?”

          “నన్ను బ్రాహ్మడు పెళ్లాడలేదు కావున.”

          “నీకు పెళ్లవ్వలేదా?”

          “పిల్లల్నెత్తుకుపోయే వాళ్లు పెళ్లిళు చేస్తారేమిటి.”

          “అలాగే వాళ్ల మధ్యలోనే వుండిపోయావా?”

          “ఎత్తుకుపోయి ఎవరో ఒక రాజుకు అమ్మేశారు.”

          “ రాజు నిన్ను పెళ్లిచేసుకోలేదా?”

          “రాక్షస వివాహమైతే అయ్యింది. అసలు పెళ్లి తరువాత చేసుకుందాం అన్నాడు.”

          “చేసుకున్నాడా మరి?”

          “అదేం లేదు, అలాగే కాలం గడిపేసాడు.”

          “అయ్యో అలాగా. మరి తరువాత ఏం చేసావు?”

          “ఏం చేస్తాను, అక్కడి నుండి పారిపోయి బయటపడ్డాను.”

          “పారిపోయిన తరువాత?”

          “పారిపోయే ముందు రాణిగారి నగలు దొంగిలించాను. అడవి దారిలో పారిపోతుంటే బందిపోటులు పట్టుకున్నారు. వాళ్ల నాయకుడు భవానీ పాఠక్. నా కథ విని, నా నగలు నాకే ఇచ్చేసాడు. నాకు ఆశ్రయం ఇచ్చి సొంత కూతురులాగా చూసుకుంటున్నాడు. ఒక రకంగా నాకు వివాహం కూడా చేసాడు.”

          “ఒక రకంగా వివాహం అంటే?”

          “ఇప్పుడు నా సర్వస్వమూ శ్రీ కృష్ణ భగవానుడే.”

          “అది ఎలా?”

          “నా యవ్వనాన్ని, రూపాన్ని, ప్రాణాన్ని అంతా భగవానుడికే అర్పించాను.”

          “ఆయన నీకు భర్త అవుతాడా?”

          “ఆయన సంపూర్ణంగా నాకు అధికారి. ఆయనను రకంగా తలుచుకుంటే, అలాగ.”

          ప్రఫుల్ల గట్టిగా ఒక నిట్టూర్పు విడిచి, ఆలోచనలో పడింది. ‘ఏం చేస్తాం, అమ్మాయి భర్త అనేవాడిని ఎప్పుడూ చూడాలేదు. అందుకనే ఇలా మాట్లాడుతున్నది. పాపం, భర్త అనేవాడు ఒకరు వుంటే ఇలా కృష్ణ పరమాత్ముడే నాకు అధికారి అంటూ మాట్లాడి వుండేది కాదేమో!”

          “శ్రీకృష్ణుడి మీద అందరికీ మనసు వుంటుంది. ఆయన రూపం, యవ్వనం, ఐశ్వర్యం అన్నీ అనంతం కదా!” అన్నది స్త్రీ.

          ఈవిడ భవానీ పాఠక్‌కి శిష్యురాలు. అంతా శ్రీకృష్ణమయమే. ప్రఫుల్లకి ఏమి మాట్లాడాలో తెలియలేదు. ఆలోచనలో పడింది. తనా నిరక్షరాస్యురాలు, పురాణాలేవీ అంతగా చదువుకోలేదు. కృష్ణుడు అనంతుడే, కృష్ణుడి ప్రేమ కూడా అనంతమే, పవిత్రం కూడాను. మరి స్త్రీకి పతి మీద ప్రేమ కూడా అనంతమే కదా. అందుకనే హిందూ ధర్మము ప్రకారం స్త్రీకి పతియే సర్వస్వం కదా!

          “అక్కా, ఇంతకీ నీ పేరు చెప్పలేదుఅన్నది ప్రఫుల్ల.”

          “భవానీ ఠాకూర్ నిశి అని పేరు పెట్టాడు. నాకు దివ (పగలు) అనే అక్క వుంది. ఏదో ఒకరోజున తీసుకువచ్చి నీకు చూపిస్తానులే. శ్రీకృష్ణుడు అందరికీ దేవుడు కదా. పతి కూడా స్త్రీకి దేవుడంటారు కదా. నాకు ఇద్దరు దేవుళ్లెందుకు చెప్పు?”

          “స్త్రీల భక్తికి అంతముంటుందా?”

          “స్త్రీల ప్రేమ అనంతం, కాని భక్తి, ప్రేమ వేరు వేరు కాదా?”

          “నాకైతే రెండూ తెలువదు. రెండిటినీ ఇప్పటిదాకా పొందలేకపోయానుఅంటూ ప్రఫుల్ల కన్నీళ్లు పెట్టుకుంది.

          నిశి ప్రఫుల్లను దగ్గరకు తీసుకుని, కన్నీళ్లు తుడిచింది. “ విషయం నాకు తెలీదే చెల్లీఅంటూ ఓదార్చింది.

          నిశి ఆలోచనలో పడింది. యువతికి అత్తవారింటి నుండి చాలానే కష్టం వచ్చినట్లుంది. పతికోసం తపిస్తున్నది. అందుకే, పతి మీద ప్రేమ కృష్ణ ప్రేమని అందుకోటానికి మొదటి మెట్టు అంటారు.

*****

(సశేషం)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.