ఒక తల్లి ప్రతిస్పందన!
(నెచ్చెలి-2024 కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ)
-సూర్యనారాయణ గోపరాజు
వర్ధనమ్మ గారు.. ధీర్ఘాలోచనలో పడింది! ఈ మధ్య ఆమె ఆలోచనలు.. ఎటూతేలక.. అంతు లేకుండా సాగుతున్నా యి. భర్తఆనందరావు పోయి.. తాను ఒంటరైనప్పటి నుంచి.. దిగులుతో ఇదేపరిస్థితి! భర్తఉండగా.. ఆయన నీడలో.. వంటిల్లు చక్కబెట్టు కుంటూ,.. ఆమెజీవితం.. ఎంతో ధీమాగా పశ్రాంతంగా సాగిపోయేది! వారి సరిగమల సంసార జీవితంలో.. భార్యా భర్తలిద్దరూ.. ఒక్కగానొక్క కొడుకు శ్రీనాధ్ ను.. అల్లారు
ముద్దుగా పెంచడం,.. వృద్ధిలోకి తీసుకురావడంలో.. సమిష్టిగా వారివారి బాధ్యతలు నెరవేరుస్తూ .. మంచి ఉద్యోగంలో స్థిరపడేవరకూ.. ఏ లోటూ రాకుండానేసాకారు. ఆ పైన.. ఈడుజోడైన సంబంధం చూసి.. నీరజతో.. పెండ్లికూడా చేశారు. ప్రస్తుతం.. కొడుకు, కోడలూ.. ఇద్దరూ ఉద్యోగాలు చేసుకుంటూ.. సుఖజీవనం సాగిస్తున్నా రు.
ఆనందరావు గారు కూడా.. తన జీవితమంతా.. ముందు చూపుతో.. సంసారాన్ని .. భావి విశ్రాంత జీవితం సుఖమయంగా ఉండాలనేదృష్టితో.. ఎంతో పొదుపుగా జీవనం సాగిస్తూ .. ఉద్యోగ సమయంలోనే.. ఒక హౌసింగ్ సొసైటీలో చేరి.. ఇంటిస్థలం భార్య వర్ధనమ్మ పేర కొన్నా డు. తర్వా త.. హౌసింగు లోను తీసుకుని.. చిన్న ఇల్లు కూడా నిర్మించాడు. అటు పైన వీలుచూసుకొని.. ఖాళీ స్థలం వైపు.. వీలుగా ఇంటిని విస్తరిం చాడు! తను రిటైరయ్యే సమయానికి ఆ లొకాలిటీ అభివృద్ధి చెందడంతో.. తనకు వచ్చి న రిటైర్మెంట్ సొమ్ము తో.. పైన అంతస్థువేసి.. ఇంటిని భవంతిగా తీర్చి దిద్దాడు. ప్రస్తుతం.. క్రిందిభాగాన ఇంటివారుండగా.. పైన అద్దెరూపేణా కూడా.. గిట్టుబాటుగానే..
ముడుతోంది.. నెల నెలా వారికి.
పైవాటాను ఆనందరావు గారు.. తనకు.. కొడుకు వరసయ్యే.. దూరపు బంధువు.. లాయర్ వామనరావుకే.. అద్దెకిచ్చా రు.. కాస్తమాటకు మంచికి.. సాయంగా ఉంటాడని. వామనరావు కూడా.. వృధ్దదంపతులను బాబాయిగారు, పిన్ని గారు అని పిలుస్తూ .. ఆప్యా యంగా కలివిడిగానే ఉంటాడు. అతని భార్య పంకజాక్షి కూడా.. వర్ధనమ్మ గారితో..
అత్తయ్యగారూ అని పిలుస్తూ .. అన్నింటికీ.. చేదోడు వాదోడుగా ఉంటూ.. కలివిడి గానే ఉంటుంది.. అవసరానికి.. చిన్ని చిన్ని పనులకు… సాయపడుతూనే ఉంటారు.. వారిద్దరూ.. ఆ వృద్ధదంపతులకు.
ఆనందరావు గారు తరచూ.. ‘ మనకేం దిగులులేదు!.. మన జీవితాల చివరివరకు ఏ లోటూ రాదు!! సొంత ఇంట్లో ఉంటూ.. వచ్చే.. అద్దె ఆదాయం, పెన్షన్తో.. తృప్తిగా ఎవరి మీద ఆధారపడకుండా గడిపెయ్యగలం! ‘ అంటూ.. భరోసా చెప్పేవాడు భార్యకు. అలా ధైర్యం చెప్పే భర్తతోడు.. ఆమెకు మరెంతో కాలం నిలవలేదు. కోవిడ్ మహమ్మా రి..
జంటను విడదీసి.. ఆమెను ఒంటరిని చేసింది!.
ఇన్నా ళ్ళ జీవితంలో.. ఎంతో సన్ని హితంగా మెలిగిన నాధుడు లేక.. ఒంటరితనం అనుభవానికొచ్చింది వర్ధనమ్మ గారికి. ఇంట్లో.. ఇల్లాలు హోదా.. కోడలికిబదిలీ అయ్యింది! బ్రతుకు.. కొడుకు కోడలు సంరక్షణ లోకిమారింది! వారిరువురి ఉద్యోగాల కారణంగా.. వారికి వంటింటి సదుపాయాలు సమకూర్చే వ్యక్తిగా.. బాధ్యత తప్పడం లేదామెకు!. ఆమె జీవనం.. మాస్టర్ బెడ్ రూమ్ నుంచి.. గెస్ట్ రూముకు.. ఎటాచ్ బాత్ నుంచి.. కామన్ కూ మారింది!
పోను పోను.. వయసుతోపాటు.. ఇంటిచాకిరీతో.. శమ్ర పెరిగి.. విశ్రాంతి కొరవడి.. క్రమంగా ఆమెఆరోగ్యం క్షీణించసాగింది!. తరచూ అనారోగ్యం బారిన పడటం తప్పడం లేదు. అలసట.. నీరసం.. ఆమెను కృంగదీసి పనులు చేయలేక.. శరీరం.. విశ్రాంతి కోరుతూ.. వివిధ రుగ్మతలతో.. నీరస పడింది. దాని పర్యవసానంగా.. ఇంట్లో.. కొడుకూ
కోడలు.. సేవల విషయంలో.. తరచూ ఇబ్బందిపడుతూ.. చికాకుతో.. అప్పు డప్పు డు.. ఘర్షణలు కూడా పరిపాటయ్యింది.
నీరసం భరించలేక.. చూసిచూసి ఒకరోజు.. కొడుకు శ్రీనాధ్ తో.. ‘ ఒరే.. బాబూ.. బడలిక తట్టుకోలేక పోతున్నానురా.. నీరసంగా ఉంటోంది.. డాక్టరు దగ్గరకు తీసుకెళ్లరా ‘ అని.. అడిగింది వర్ధనమ్మ.
‘ సరేనమ్మా .. శెలవురోజు వీలుచూసుకొని.. అలాగేవెళ్దాం! నువ్వు ఎక్కు వగా హైరాన పడకు! మేం ఆఫీసులకు వెళ్ళా క.. ఖాళీయేగా.. పూర్తిగా విశ్రాంతి తీసుకో ‘ అని అప్పటికి సముదాయించాడేగాని… ఆ తర్వా త.. ఆవిషయమే పెద్దగా పట్టించుకోలేదు.
ఒకసారి.. కళ్లద్దాలు పగిలి.. కళ్లజోడు మార్పు కోసం, మరోసారి.. పంటిబాధకూ.. ఇంట్లో వాళ్ళతో.. పని జరగక.. వామనరావు దంపతుల సాయం తీసుకోవలసివచ్చింది వర్ధనమ్మ గారికి.
ఒకనాడు మధ్యా హ్నం.. భోంచేసి వంటిల్లు సర్దుతుంటే.. కళ్ళు తిరిగిపడబోతుంటే.. నెమ్మదిగా గదికిచేరిపడుకుంది వర్ధనమ్మగారు. వొళ్ళు తెలియకుండా నిదప్రట్టేసింది. మళ్లీ… కోడలు ఆఫీసు నుంచి ఇంటికొచ్చి .. ‘ తలనొప్పితో చస్తుంటే కాఫీఇచ్చే దిక్కు లేదు!.. కనీసం కాఫీ పెట్టుకుందామంటే.. వంటిల్లు అంతా.. చిందరవందర ‘ అంటూ
చిరాకు పడుతుంటే మెలుకువ వచ్చింది.. వర్ధనమ్మగారికి. లేద్దామన్నా .. సత్తువ లేక వీలుకాలేదు. ఈలోగా కొడుకు శ్రీనాధ్ కూడా రానేవచ్చా డు. భార్య చిరాకు పడటం చూసి,.. తల్లి పడుకుని ఉండటం గమనించి… ‘ ఏమిటమ్మా … ఈ సమయంలో.. పడుకున్నా వూ! ‘… అంటూ తల్లిని తాకిచూసాడు. జ్వర తీవత్రతో… ఆమెవొళ్లు కాలి పోతోంది! లేవలేని పరిస్థితి అని.. అర్ధమయ్యింది శ్రీనాధ్ కు.
‘ చూడు.. నీరజా.. అమ్మకు జ్వరం తీవ్రంగా ఉంది.. ఇంట్లో పని నువ్వే చూసుకో.. రేపూ, ఎల్లుండీ.. ఆఫీసుకు శెలవు పెట్టి.. అమ్మను చూసుకో! ‘ అని పరిస్థితి వివరించాడు.
‘ నాకు.. ఆఫీసులో ఇనిస్పెక్షను ఉంది.. నాకు శెలవు పెట్టడం కుదరదు. మీరే శెలవు పెట్టి మీ అమ్మగారిని చూసుకోండి.’ అని సమాధానమిచ్చి .. వంటింట్లో కెళ్ళి పోయింది నీరజ. చేసేదిలేక.. శ్రీధర్.. తల్లిని చూసుకోవడానికి ఆఫీసుకు శెలవుపెట్టి.. పైనున్న.. పంకజాక్షి సాయంతో.. తల్లి సంరక్షణ చూసుకున్నాడు. ఆ వారం పదిరోజులు పంకజాక్షే.. వర్ధనమ్మ గారి ఆలనా పాలనా చూసింది. ఇంట్లో.. వర్ధనమ్మ గారు.. ఎంత అనాదరణకు గురవుతోందో.. ప్రత్యక్షంగా చూసింది. ఆవిడ దయనీయ స్ధితి గురించి.. భర్త వామనరావు కు కూడా.. ఉన్న పరిస్థితి వివరంగా తెలియపర్చింది. జ్వరం కాస్తకుదుట పడ్డాక.. ఆఫీసు కు వెళ్తూ .. తల్లి పూర్తిగా.. కోలుకునే వరకూ.. కాస్త కనిపెట్టిచూస్తూ ఉండమని..
వామనరావు దంపతులకు బాధ్యత అప్పచెప్పి.. వెళ్ళా డు శ్రీధర్.
అదేసంధర్భంలో.. వామనరావు.. వర్ధనమ్మ గారి స్థితి గతుల్ని పూర్తిగా తెలుసు కున్నా డు. ‘ ఇక మీదట ఇంట్లో.. పనులు కొన్నిటిని.. కోడలికి అప్పజెప్పి.. కొంత విశ్రాంతి తీసుకోండి.. పిన్ని గారూ! ‘.. అంటూ.. సలహ ఇచ్చా డు.
ఆ వారం పదిరోజుల ఇంటిపనికే.. చాలా సతమత మయ్యంది నీరజ. ఇంట్లో పని, ఆఫీసు పని.. రెండూ మేనేజ్ చేయడం.. ఇంటిపని అలవాటు లేని.. తన వల్లకాదని.. అర్ధమైపోయింది. ఇకపై.. అత్తగారు తనకు.. మునపటిలా.. ఇంటి సాయమంతా.. చెయ్య గలరన్న నమ్మకం సడలింది. చురుగ్గా ఆలోచించడం మొదలుపెట్టింది. వెంటనే..
ఊళ్లో ఉన్న.. తల్లి సావిత్రమ్మకు ఫోను చేసి.. తన గోడు వెళ్ళబోసుకుంది.
‘ అమ్మా !.. ఇక్కడ.. మా అత్తగారు మంచం పట్టడంతో.. నాకు.. ఆఫీసు పనితో పాటు.. ఇంటిపని కూడా .. చేసుకోవడం.. చాలా కష్టమవుతోంది. ఇక ముందు.. మా అత్తగారు మునపటిలా.. ఇంటిపనంతా సముదాయించుకు పోగలుగుతారని అనిపించ ట్లేదు. నువ్వొ చ్చి .. సాయంగా నా దగ్గరుంటే.. నాకు అన్ని విధాలా బాగుంటుంది… ఏమంటావ్? ‘ అంటూ.. గుక్క తిప్పు కోకుండా.. ఊదరగొట్టింది.
‘ సరేలేవే.. అలాగే!.. కానీ.. మీ అత్తగారుండగా.. నేను వచ్చి .. ఇల్లు చక్కబెట్టడం ఎలా కుదురుతుందే?..’ అంటూ… అడ్డు పుల్లవేసింది సావిత్రమ్మగారు. అందుకు.. ఏం చెయ్యా లా అని.. మళ్లీ.. మంత్రాంగం ఆలోచించడం.. మొదలు పెట్టింది నీరజ.
వర్ధనమ్మగారు జ్వరం నుంచి కోలుకున్నప్పటికీ.. పూర్వపు జవసత్వాలు కూడగట్టుకోలేక పోయింది. మునపటిలా.. అన్ని పనులూ చేయలేక.. వామనరావు సలహా పక్రారం.. కోడలు, కొడుకుతో.. తన ఓపిక విషయం విడమరిచి చెప్పి.. వంటిల్లు బాధ్యత.. సగం విరమించుకుంది. అలా.. పదిహేను రోజులు గడిచిన తర్వా త.. కొత్తగా మీద పడ్డ.. ఇంటిశమ్రకు ఓపలేక.. ఒకరోజు భర్త శ్రీనాధ్ తో విషయం.. ప్రస్తావన లేవనెత్తింది.
‘ చూడండీ!.. మీరు మరోలా అనుకోనంటే.. ఒక మాట!.. మీ అమ్మగారు.. మునప టిలా.. ఆరోగ్యంగా లేరు.. మనమా.. ఇద్దరం పగలంతా ఆఫీసుల్లో ఉంటాం.. మొన్నటిలా.. హఠాత్తుగా.. ఏ అవాంతరమైనా వస్తే.. ఆవిడను.. ఇంట్లో కనిపెట్టి చూసుకునే వారెవరు?!.. పైగా.. ఇక.. ముందు ముందు ఆవిడ.. నిత్యా వసరాలు, సదుపాయాలు చూడటం.. ఆఫీసు లకు పోయేమనవల్ల ఏమవుతుందీ!?.. మొన్ననే.. మా కొలీగ్ చెప్పింది.. సిటీలోనేఉన్న ‘ ప్రణామం ‘ఆశ్రమంలో… సీనియర్ సిటిజన్సుకు అవసరమయ్యే అన్ని వసతులతో ఏర్పా ట్లు ఉన్నా యట. మనం ఒకసారివెళ్లి చూసి.. వాకబు చేస్తేబాగుంటుందేమో.. ఆలోచించండి!.. ఏమంటారు? ‘ అంటూ.. సలహాలా విషయం.. ప్రస్తావించింది నీరజ.
‘ ఇప్పటికిప్పుడు ఏం జరిగిందని.. ఈ ప్రస్తావన?.. సమస్య ఎదురైనప్పు డు ఆలోచిద్దాంలే! ‘ అని దాటేసాడు శ్రీధర్.
‘ అలాగే అయితే.. రేపు.. ఏదైనా సమస్య ఎదురై.. తీవ్రమైనప్పు డు.. నన్ను .. ఏ విధంగానూ తప్పు పట్టనని మాటీయండి! .. నా పూచీ ఏం లేదు!.. ఆ పైన అంతా మీ ఇష్టం!.. ‘ అంటూ రుసరుసలాడుతూ వెనుతిరిగింది నీరజ.
అప్పటికి బింకంగా.. సంభాషణ ముగించాడేకానీ.. చివరకు.. సమస్య మిగిలేది.. తనకేనని తెలుసు కాబట్టి.. భార్య చెప్పిన విషయమై.. ధీర్ఘంగా ఆలోచించక తప్పలేదు శ్రీధర్ కు. ఇద్దరూ ఆఫీసులకు వెళ్ళడంతో తల్లి సంరక్షణ.. జఠిలమౌతున్న మాట కూడా వాస్తవం! ఈ విషయంలో.. భార్య నీరజ సహకారం కూడా.. అంతంత మాత్రమే!. తను.. పూనుకుందామన్నా .. తన వల్లకావటం లేదు!.. భార్య తోడు లేనిదే!.. తానొక్కడూ ఏం చెయ్యా లన్నా .. వీలు కాదనిపిస్తోంది! ఇలా.. సాగిన ఆలోచనలతో.. చివరకు.. భార్య చెప్పిన… ‘ ప్రణామం ‘ వ్యవస్థ.. వివరాలు తెలుసుకోడానికే.. మొగ్గు చూపాడు.
ఒక శెలవు రోజున.. భార్యా భర్తలు ఇద్దరూ వెళ్లి… వివరాలన్నీ తెలుసుకున్నా రు! హోదాకు తగ్గట్టుగా.. సింగిల్, డబుల్, కపుల్ ఎకామడేషన్లతో… అన్ని ఇండిపెండెంటు వసతులతో.. ఆహ్లాదకరమైన.. వాతావరణంలో.. విశ్రాంత జీవులు కోరుకునే.. అన్ని ఏర్పా ట్లు, సౌకర్యాలతో.. నడుపుతున్నారని,.. తెలుసుకొని,.. ఆరోగ్యపరమైన అన్ని జాగ్రత్తలతో..
మూడుపూట్లా.. భోజన ఏర్పా ట్లనన్నిటినీ,. అన్ని విషయాలు, సదుపాయాలూ.. స్వయం గా పరీక్షించి… సంతృప్తి చెంది.. సమీప స్థలమేననీ,.. వీలయినప్పుడల్లా రాగల వీలేననీ భావించి.. ఎడ్మిషను నిర్ధారించుకొని.. ఇంటికిచేరారు.
ఇంట్లో.. కొడుకూ, కోడలూ వెళ్ళొచ్చిన విశేషాలు చర్చించుకుంటూ.. తన పస్రక్తీ,.. తన నెలనెలా వచ్చే పెన్షను అందుకు సరిపోతుందని.. ఏర్పాట్లన్నీ బాగానే ఉన్నాయనీ.. తోటి వయసువారితో కాలక్షేపం కూడా సరదాగానే గడుస్తుందని..
ఏదేదో ముచ్చటించుకుంటుంటే.. చూచాయగా విని.. తన గురించే ఏదో పయ్ర త్నం చేస్తున్నారని గ్రహించింది వర్ధనమ్మగారు. కనీసం.. తనతో సంపద్రించకుండా.. తన గురించి అలా చర్చించుకోవడం ఏమిటో.. అర్ధంకాక, ఉండబట్టలేక..
‘ ఏంట్రా?.. ఆ.. తర్జనభర్జనలూ.. ‘ అంటూ నిలదీసింది కొడుకును.
‘ అవునమ్మా !.. నీ గురించే!.. మేమిద్దరం ఆఫీసులకు వెళ్తుంటే.. నీ సంరక్షణ.. ఎలాగా?.. ‘ అంటూ… ఆఫీసుకు వెళ్లిపోయాడు శ్రీధర్.
వారిఆలోచన కొద్దికొద్దిగా చూచాయగా.. అర్ధమౌతోంది.. వర్ధనమ్మగారికి. దుఃఖం ముంచుకొచ్చింది!… ఇన్నా ళ్ళకు.. కొడుకు.. తన్ని లా.. సమస్యగా భావిస్తున్నందుకు!
భర్త ఎప్పు డూ.. ఎన్నో సార్లు చెప్పు తూ వచ్చిన భరోసా విషయం గుర్తుకొచ్చి … దిగులుతో మనసులో గుబులు పుట్టుకొచ్చింది. ఆలోచన చురుగ్గా సాగి.. పైన వామన రావుకు విషయం చెప్పి…విచారంగా ఏమిటీ సలహా అని సంపద్రించింది.
విషయం గ్రహించిన వామనరావు.. ‘ మీరేం ఖంగారు పడకండి పిన్నిగారూ!.. మీ ఇష్టానికి విరుద్ధంగా ఏమీ జరగదు. ఈ ఇల్లు మీది!.. స్వేచ్ఛగా ఇంట్లో జీవించే అధికారం మీకుంది! మీ ఇంట్లో.. జరుగుతున్న వ్యవహారం.. పంకజాక్షి ద్వారా.. కొద్దిగా తెలుస్తూనే ఉంది! మీ సహకారంతోనేమీ వాళ్ళు మీతో ఉండ గలుగుతారు! మీతో సహకరించనప్పు డు.. వాళ్ళనే బయటకు వెళ్ళమనండి! అలా.. కొంతకాలం దూరం ఉంచితేకానీ.. విలువలు భోధపడవు! ఈ సారి.. విషయం కదిపినప్పు డు.. ఖరాఖండీగా మీ అభిప్రాయం.. నిక్కచ్చి గా చెప్పెయ్యండి.. మీ వాళ్ళతో! మీరు నిశ్చింతగా.. ఉండండి!.. పిన్ని గారూ!.. మీకు అండగా,.. తోడుగా.. మేమున్నాంగా! ‘ అంటూ.. ధైర్యం చెప్పి.. పంపాడు లాయర్ వామనరావు.
వారాంతం శెలవు రోజున.. భార్యా భర్తలిద్దరూ వర్ధనమ్మ గారిని.. ‘ ప్రమాణం ‘ సదనంలో.. చేర్చటానికి సన్నధ్ధమయ్యా రు.
శ్రీధర్.. తల్లి దగ్గరకు వచ్చి .. ఉపోద్ఘాతంగా.. ‘ అమ్మా !.. నీ బట్టలు సర్దుకో!.. ఈ రోజు.. నిన్నోచోటుకు తీసుకు వెళ్తాం!.. అక్కడ నీకు.. ఒంటరితనం ఉండదు!.. నీకు అన్ని సదుపాయాలు ఉంటాయి!.. పూర్తిగా విశ్రాంతి తీసుకోవచ్చు !.. నీ వయసువారు.. నీకు తోడుగా ఉంటారు.. కాలక్షేపానికి!.. ‘ అంటూ.. విషయం బయటపెట్టాడు.
‘ అంటే!.. నన్ను .. ఈ ఇంటి నుంచి.. పంపించి.. వేరు చెయ్యా లనుకుంటున్నా రా?.. ఈ ఇల్లు.. మీ నాన్న ఎంతో కష్టపడి.. సంపాదన పొదుపు చేసి.. మా భావి విశ్రాంత జీవనం.. సోంత ఇంట్లో.. చివరివరకూ.. ఏ చీకూ చింతా లేకుండా.. సాగిపోవాలనే భావనతో.. కూడబెట్టి.. అంచెలంచెలుగా కట్టిన.. గూడురా ఇదీ! ఇక్కడే.. మా ఆనంద మయ జీవనం.. ఇన్నా ళ్ళూ గడిచింది.. తోడూనీడగా! ఇక.. ఒంటరితనం అంటావా.. మీ
నాన్నగారు.. కాలం చేసినప్పుడే.. నేను ఒంటరిదాన్నయ్యా ను! ఆ తర్వా త.. ఇన్నా ళ్ళు గా.. ఆయన మిగిల్చిన జ్ఞాపకాలు నెమరు వేసుకుంటూ.. ఒంటరిజీవితానికే అలవాటు పడ్డాను! ఈ ఇంటితో నా అనుబంధం విడదీయరానిది! నా జీవితం ఇక్కడే ఇలా.. గడిచి పోవలసిందే! అదే.. దంపతులుగా మేము ఆశ పడ్డది.. కలలు కన్నదీను!… అందుచేత నన్ను .. ఈ ఇంటి నుంచి ఎక్కడికో.. తరలించే ప్రయత్నం.. కుదరదు! అందుకు..
నేను.. ఎప్పటికీ.. ఎన్నడూ.. సుతరామూ.. ఇష్టపడను. నాతో.. సంపద్రించకుండా.. ఈ ఆలోచన చేయడం… మీరు చేసిన.. క్షమించరాని నేరం! ఈ ఇల్లు నాది.. ఈ ఇంట్లో… నేను సర్వ స్వతంత్రురాలిని!.. నేనిక్కడ.. ఏ చీకూచింతా లేకుండా.. నా బత్రుకు నేను.. ప్రస్తుతానికి.. స్వతంత్రంగా జీవించగలను!.. అందుకు నేను సిధ్ధంగానే ఉన్నా ను.. ఏ కష్టానికయినా సరే!.. బాధ్యతలెరగని.. మీతో కలిసుండి.. ఇన్నాళ్ళూ నాకు కలిగిన ప్రయోజనం ఏమిటీ?!.. దూరంగా ఉంటేనే.. విలువలు తెలిసొస్తాయి!.. మమకారాలు, అభిమానాలు బలపడతాయి!! వెంటనే.. మీరు వేరేఇల్లు చూసుకొని.. వీలయినంత త్వరలో.. వేరు కాపురానికి.. మీరే.. వెళ్ళండి! ‘ అంటూ.. ఆక్రోశంగా.. ఆవేశంగా.. తన వ్యధనంతా… తీవ్రంగా.. వెళ్ళగక్కింది వర్ధనమ్మ గారు. అనుకోని వర్ధనమ్మగారి ఈ ప్రతిస్పందనకు… కొడుకూ కోడలూ.. కాసేపు మాటలు రాని నిశ్చేష్టులయ్యా రు!
వెంటనే.. తేరుకుని… ముందున్న ఆర్థిక కష్టనష్టాలు బేరీజు వేసుకుని.. వర్ధనమ్మ గారిని పస్రన్నం చేసుకునే పయ్ర త్నంలో …
‘ అమ్మా ! నీ ఒంటరితనం,.. నీ సంరక్షణ.. కోసమే.. అలా చేద్దామనుకున్నాం!.. కాదంటే.. నీ ఇష్టం!.. కానీ.. ఉన్నపళంగా.. వేరింటికాపురం అంటే.. చాలా కష్టం, ఖర్చూ .. కదమ్మా !.. ఈసారికి.. మా తప్పు క్షమించు! ‘ అంటూ.. ప్రాధేయ పడ్డాడు శ్రీధర్.
కోడలు కూడా.. ‘ అత్తయ్యగారూ!.. మీరేగా మా పెద్దదిక్కు !.. మీ తోడేగా.. మాకు కొండంత అండ!.. మా మీద ఇలా.. కోపగించుకోకండి.. ‘ అంటూ.. అనునయంగా.. మాట్లాడ బోయింది ..నీరజ.
‘ అదేం కాదు.. నాకు.. మీ మీద ఎలాంటి కోపం, ద్వేషం లేవు! ఎవ్వరికీ జీవితం.. వడ్డించిన విస్తరికాకూడదు.. మీ నాన్న.. ఎలా జాగర్తగా జీవితం సాగించారో… అలాగే.. మీరూ.. స్వయంగా.. మీ సామ్రాజ్యాన్ని .. స్వయంకృషితో విస్తరించుకోండి! అప్పు డే.. మీ మీ సామర్ధ్యాలు బయటపడతాయి.. జీవితంలో విలువల పై.. నమ్మకమూ పెరుగుతుంది! నా మాట మీద.. గౌరవం ఉంచి.. నేను చెప్పింది పాటించండి. ‘ అని.. ఖరాఖండీగా.. తన నిర్ణయం.. తేల్చి చెప్పేసింది.. వర్ధనమ్మ గారు.
ఇక చేసేదేమీ లేక.. తల్లి పట్టింపు తెలిసిన శ్రీధర్ కు.. దగ్గరలోనే వేరే సింగిల్ బెడ్ రూము ఎపార్టుమెంటుకు.. కాపురం మార్చక తప్పలేదు! చిన్న వసతి కావటంతో.. సరోజ కు.. సాయానికై.. తన తల్లిని తోడు తెచ్చుకోవడమూ కుదరలేదు! సంసార బాధ్యతలు పూర్తిగా ఒంటరిగా.. సంభాళించుకోకనూ.. తప్ప లేదు. దంపతులకు.. ఆర్ధికంగా.. పొదుపు పాటించటం కూడా.. అనివార్యమయ్యింది. ఆర్ధిక క్రమశిక్షణ పాటిస్తూ .. తమకై..
స్వంతానికి.. ఒక మంచి ఎపార్టుమెంటు కూడా.. బుక్ చేసుకున్నా రు! బాధ్యత మీద పడడంతో నీరజకు కూడా.. ఒళ్ళోంచి ఇంటిని చక్కబెట్టుకోవడం.. క్రమ క్రమంగా.. అలవాటయ్యింది. స్వేచ్ఛను అనుభవిస్తూ .. అన్యోన్యంగా దంపతులిద్దరూ సంసార భారాన్ని పంచుకుంటూ.. కులాసాగానే.. కాలక్షేపం సాగిస్తున్నా రు.
వయసుతో పాటు.. మోసేబరువు భాధ్యతలు కూడా.. కుటుంబాల్లో.. కాలానుగుణంగా .. సంస్కారం, సాంపద్రాయ విలువల పట్ల.. ఆసక్తిని, అనురక్తిని.. పెంచి.. అనుబంధాల్ని బలపరుస్తాయనటానికి నిదర్శనంగా.. శ్రీధర్, నీరజలు కూడా.. మార్పుచెంది బాధ్యతా యుతంగా.. తరచూ.. వీలయినప్పుడల్లా.. వర్ధనమ్మ గారిని కలుస్తూ .. ఆవిడ అవసరాలు తీరుస్తూ .. ఆప్యా యంగా మెలుగుతున్నారు. వారాంతపు శెలవల్లో.. వర్ధనమ్మగారు చేసిపెట్టే.. వంటల రుచులు ఆస్వా దిస్తూ .. ముచ్చటగా.. సమయం సంతోషంగా గడిచి పోతోంది వారందరికీ. వర్ధనమ్మగారికి కూడా.. తగినంత విశ్రాంతితో.. ఊరటగానే.. ఆనందంగానే రోజులు గడుస్తున్నా యి. కలిసిలేరన్న మాటేగాని.. అనుభూతుల విషయంలో.. మునపటికంటే.. మంచిగా, ప్రశాంతంగా సుఖంగానే.. జీవిస్తున్నారా
కుటుంబ సభ్యులంతా! వర్ధనమ్మగారు కూడా.. తన ఒంటరి విశ్రాంతి జీవితం.. ఆధ్యా త్మి క భావనలతో.. పశ్రాంతిగా జీవనం.. శాంతిగా సాగిస్తున్నా రు!
ఆవిడ తీసుకున్న నిర్ణయం.. ఆశించిన విధంగా.. సరైన ఫలితాల్నే ఇచ్చింది.. వారి భావి జీవితాలకు!
*****
గోపరాజు వెంకట సూర్యనారాయణ తల్లిదండ్రులు శ్రీ గోపరాజు కృష్ణమూర్తి, శ్రీ మతి అనసూయ. కూకట్ పల్లి, హైదరాబాదు నివాసం.
వృత్తి రీత్యా, M.Tech. Machine design చదివి, HMT Hyd. లో, దాదాపు ముప్పై ఏళ్ళు పైన పనిచేసి, డిప్యూటీ జనరల్ మేనేజరు స్థాయిలో వాలంటరీ పదవీ విరమణ చేసిన ఇంజనీరును. ఆ తర్వాత, విజ్ఞాన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇంజనీరింగ్ కాలేజీలో ప్రొఫెసర్ గానూ, మరికొన్ని ఇంజనీరింగు సంస్థల్లో, డిజైన్ కన్సల్టెంటు గానూ పనిచేసిన అనుభవం.
ప్రస్తుతం విశ్రాంత సీనియర్ సిటిజన్ ను.
స్వతహాగా సాహిత్యాభిమానిని, కళాభిమానిని. కధలంటే బాగా ఇష్టపడతాను. ఈ మధ్యనే, రిటైర్మెంట్ తర్వాత, స్వీయరచనా వ్యాసాంగానికి, స్వీయ పెయింటింగ్సు వేయడానికి సాహసిస్తున్నాను. పలు అంతర్జాల పత్రికా సమూహలకు, సంకలనాలకు కవితలు, చిన్నగా కధలు రాస్తున్నాను, ప్రచురిస్తున్నారు, అభినందిస్తున్నారు!