నాతి చరామి

(నెచ్చెలి-2024 కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ)

-తెన్నేటి శ్యామకృష్ణ

           ఆరు గదుల పాతకాలపు డాబా ఇల్లది. మూడు మూడు గదుల వాటాలు  రెండు. ఒక పోర్షన్ లోని ముందు గదిలో శిరీషకు పెళ్లిచూపులు జరుగుతున్నాయి. స్కూల్ ఫైనల్ అయ్యాక,  ITI  లో చేరి ఎలక్ట్రిక్ వర్క్స్ మెయిన్ గా చేసాడు. తండ్రి అప్పుల ఊబిలో కూరుకుపోయేసరికి, తల్లి సాధింపులు,ఇంట్లో శాంతి లేకుండా పోయింది. సరదాగా నేర్చుకొన్న డ్రైవింగ్ జీవనోపాధిగా చేసుకొన్నాడు. అతనికి ఒక సెకండ్ హాండ్ కారు
కూడా  వుంది, దాన్ని రోజూ నలుగురు లేడీ టీచర్స్ ని నలభై మైళ్ల దూరంలో వున్న గవర్నమెంట్ స్కూల్ లో దింపి, మళ్ళీ సాయంత్ర౦ తీసుకొస్తుంటాడు ఇద్దరు డాక్టర్స్ పిల్లల్ని స్కూల్ టైంకి తీసుకెళ్లి, తీసుకొస్తుంటాడు. రాజుకి ఈ రెండు ఖాతాల వల్ల నికరాదాయం ఉంటుంది, మిగతా టైంలో అద్దె ఆటో తిప్పుతుంటాడు. టెన్త్ వరకు ఇంగ్లీష్ మీడియం కాబట్టి , విస్తృతంగా ఇంగ్లీష్, తెలుగు సాహిత్యం చదవటం, బాగా అలవాటు చేసుకొన్నాడు. చాలా బుక్ కలెక్షన్ వుంది అతని దగ్గిర. తాను చదువుకోలేక పోయా నన్న బాధ ఆ విధంగా మరిచిపోయేవాడు.    
           
           తన ఎదురుగా కూర్చున్న శిరీషని తదేకంగా చూస్తున్నాడు. అమ్మాయి పొడవుగా,సన్నగా , తీరైన కనుముక్కు తీరుతో చక్కగా వుంది. అతను గమనిస్తున్నది  ఆమె ఎలా వుందన్నది కాదు, ఆమెచేతుల వైపు చూస్తున్నాడు. ఆ అమ్మాయి దేనికో చాలా టెన్షన్ పడుతున్నది. చేతుల్లో వణుకు ఆపుకోవటానికి రెండు అర చేతులనీ పెనవేసి పట్టుకొన్నది. మొహాన చిరు చెమటలు. దేనికో ఆ అమ్మాయి బాగా టెన్షన్  పడుతున్నదని పించింది అతనికి. 

           కొంపదీసి ఏదైనా లవ్ ఎఫైర్  కాదుకదా? లేకపోతే ఈ మ్యాచ్ ఇష్టం లేదా? ఆమెతో పర్సనల్ గా
మాట్లాడాలని అనుకొన్నాడు. 
      
           రాజు తండ్రి చనిపోయి మూడేళ్లు. ఆయన ఆర్టీసీలో కండక్టరుగా పనిచేసేవాడు. సప్త వ్యసనాల్లో
అప్పులు చెయ్యటం ఉందొ, లేదో కానీ ,  భూషణ౦ అందులో  సిద్ధ హస్తుడు . రిటైర్మెంట్ తర్వాత పైన మొదలు పెట్టి , పూర్తి చేయటానికి నానా తిప్పలు పడ్డాడు. అప్పులు చేయటంలో ఆయన ఒక వింత పద్ధతి పాటించేవాడు. ఇవేవి ఇంటర్ చదువుతున్న రాజుకి అర్ధమయ్యేవి కావు. పెద్దవాడైన నరేంద్రకి తండ్రిని వారించే ధైర్యం లేదు. ఒకడి దగ్గిర చేసిన అప్పు తీర్చడానికి ఇంకొకరి దగిర అప్పుచేసేవాడు. పెన్షన్ చాలా తక్కువ, దానిమీదే లోన్ తీసి , అప్పుల పాలయ్యేడు. తల్లి శకుంతల గయ్యాళిగా పేరు తెచ్చుకొంది. నోటికి అదుపులేదు. పెద్ద కోడలు సుభద్రకి నోరు లేదు. శకుంతలకి ఇప్పుడు మంచి చాన్సు వచ్చింది, సాధ్యమైనంత ఎక్కువ కట్నం లాగాలని బేరసారాలు చేస్తోంది. 

           రాజుది  చాలా ధృడమైన . వ్యక్తిత్వం  అన్నను సంప్రదించి, వున్న రెండకరాల పొలం అమ్మేసి
అప్పులు తీర్చాడు, బ్యాంకు లోన్ తీర్చిన తర్వాత, మిగిలిన ఆరు లక్షలు అన్న ఇద్దరి కూతుళ్ళ పేరిట, తల్లి పేరిట వేసేశాడు. రెండు వాటాలు వేయమన్న తల్లి మాట అతను లెక్క చేయలేదు. అటువంటి మరిది అంటే సుభద్రకు చాలా ఇష్టం. ఒక తమ్ముడిలా చూస్తుంది అతన్ని, రాఖీ కట్టి, తన ప్రేమని చూపిస్తుంది. 

           ఎవరూ గమనించని శిరీషలోని కంగారుని గమనించాడు రాజు. అందుకే ఆ అమ్మాయితో
మాట్లాడాలని శిరీష అన్నతో చెప్పాడు. డాబా పైన రెండు కుర్చీలు వేశారు. శిరీషలో కంగారు ఎక్కువైంది.
 
           ” చెప్పండి, ఎందుకంత కంగారు పడుతున్నారు?” రాజు సౌమ్యంగా అడిగాడు.
 
           నేను ఒకటి అడుగుతాను, కానీ నేనడిగిన విషయం మా వాళ్ళతో చెప్పరు కదూ?

           ఇదేదో  ప్రేమ వ్యవహారంలా వుంది అనుకొన్నాడు రాజు. 

           ” నాకు ఇంజినీరింగ్ చదవాలని ఉందండీ, మీరు చదివిస్తారా? ఆ కళ్ళ నిండా ఆశ. 

           ఆశ్చర్య పోయాడు రాజు. ” ఇంటర్ లో మీ పర్సెంటేజ్ ఎంత? 

           96.5″ జవాబిచ్చింది శిరీష. 

           “అన్ని  మార్క్స్ వస్తే మీవాళ్లు ఎందుకు చదివించలేదు? “ఆశ్చర్యపోతూ అడిగాడు.
   
           నాన్నపోయిన సంవత్సరంలోనే పెళ్ళి చేయాలని , చదివించమని  చెప్పారండి .  డిగ్రీ 
చేయమన్నారు , నా కిష్టంలేదు”  ఆ పిల్ల  మొఖంలోని  దైన్యం  చూసి  చలించి పోయాడు  రాజు.

           ” నా ఇంటిపరిస్థితులవల్ల నేను చదువుకోలేకపోయాను. తప్పకుండా చదువు కుందువు కానీ, ఇంకేమైనా
ఉన్నదా ” నవ్వుతూ అడిగేడు. 

           శిరీష కళ్ళలో వెలుగు, సంతోషంగా నవ్వింది, ” ఇంకే కోరికలు లేవు” అంటూ. 
  
***
           రాజు క్రిందకు  వచ్చేసరికి శకుంతల ఇంకా బేరసారాలు సాగిస్తూనే వుంది. రాజు తల్లిని  మరి మాట్లానీయకుండా, విషయం అంతా తేల్చేసాడు. అంతా శిరీష అన్నదమ్ముల ఇష్టానికె వదిలేసాడు.. అందరి ముందు ఏమి మాట్లాడలేకపొయిన  శకుంతల ఇంటికి రాగానె కొదుకు మీద విరుచుకుపడింది. రాజు బెదరకుండా మిగతా  ఖర్చులు తానే భరిస్తానని చెప్పాడు.

           పెళ్ళయ్యాక   మూడు నిడ్రలాంటివేమీ వద్దని భార్యని తీసుకెళ్ళిపొయాడు రాజు. కట్నం , లాంచనాలు
తీసుకోని వాడితో తర్కించలేకపోయారు ఎవరూ. 

           మొదటి రాత్రిమధ్య గదిలొ సిరీషని పడుకోమని తాను బయట గదిలో నేల మీద పరుపు వేసుకొని పడు
కొన్నాడు. శిరీషకి ఇలా ఎందుకని అడిగె చనువు ఏర్పడలేదింకా  అతని డగ్గిర.

           శకుంతల నిఘా పెట్టింది కోడలి  మీద . శిరీష  రాత్రంతా చదువుకొంటూ , ఎప్పుడో  తెల్లవారుఝామున
నిద్రపొతోంది. వుదయం పనయ్యాక రాజు లంచ్ కి వచ్ఛెదాక  చదవటం, అతను వెళ్ళాక ఇంటి పని ముగించుకొని, మళ్ళీ చదువుకోవటానికి కూర్చునేది. ఆ పిల్ల దీక్ష , పట్టుదల చూసి రాజుకు ఎంతో ముచ్చటేసేది.

           రోజూ శకుంతల పైకి  రావటం, ఏదొ  ఒక  వంకతొ  తిట్టడం చేస్తున్నది. శిరీష భర్త తో చెప్పటానికి
భయపడి, చెప్పలేక  పోయేది చూసి, చూసి సుభద్ర  ఓ రోజు రాజుతో చెప్పింది. రాజుకి శకుంతల స్వభావం బాగా తెలుసు. మనుషుల పట్ల ఆమె వైఖరి చాలా విచిత్రంగా వుంటుంది. ఆమెకి మనుషులు నచ్చకపోతే అకారణ ద్వేషం పెంచు కొంటుంది.ఓ రోజు బయటికి వెళ్ళినట్టే వెళ్ళి, వెనక్కి వచ్చి తల్లిమాటలు విన్నాడు, శిరీషని మాటలతొ ఎంత వేధిస్తున్నదో అర్ధమై బాధపడ్డాడు. అతనేమీ మాట్లాడక పోవటంతో శకుంతల మరింతగా రెచ్చి పోయి  తూలనాడింది. శిరీషకి  కన్నీళ్ళ్లు ఆగలేదు. 

           రాజు నాలుగింటికి ఇంటికి వచ్చాడు . వచ్చీరాగానే సామాను సర్దటం మొడలె ట్టాడు. సుభడ్ర పైకి వచ్చి ,
 
           “యేమిటి  రాజూ, సామాను సర్దుతున్నావు? కంగారుగా అడిగింది. 

           ” అమ్మ మారదు  వదినా, శిరీష ఆమెని తట్టుకొని  బ్రతకలేదు, ఇల్లు తీసుకొన్నా, ఇవ్వాళ్ళే ఇల్లు
మారుతున్నా’ ఈ పోర్షన్ అద్దెకిస్తాను”

           శకుంతల ఎన్ని శాపనార్ధాలు పెట్టాలో అన్నీ పెట్టింది శిరీషని. సాయంత్రం అద్దె ఇల్లు ఎక్కడ
తీసుకొన్నాడో కూడా  చెప్పకుండా ఇల్లు మారిపోయాడు రాజు. కొత్త ఇంట్లో సామాను సర్దుతూ, ఏడ్చేసింది శిరీష.
 
           “ఇందులొ నీ తప్పెమీ లేదు శిరీ, అమ్మ సంగతి నీకు తెలియదు, నిన్ను చదువు కోనీయదు, ఇంజనీరింగ్ లో చేరినా, ఆమె రోజుకో గొడవ తెస్తుంది. అమ్మపట్ల నా భాద్యత నాకు తెలుసు” అంటూ మొదటిసారి శిరీషని దగ్గరకు తీసుకొని ఓదార్చాడు. 

           శిరీష ఇప్పుడు చాలా  ప్రశాంతంగా చడువుకోగలుగుతోంది. రాజుకి మగవాళ్ల్లు ఇంటిపని చేయకూడదన్న
కాన్సెప్ట్ లేదు. అతనంటే రోజు రోజుకీ ఆరాధన  పెరిగి పోతోంది ఆమెకి.

***

           ఆ రోజు శిరీష చాలా డల్ గా వుండటం గమనించి, టాబ్లెట్స్ తెచ్చిచ్చాడు. అయిదో రోజు లేడీ డాక్టర్ ద
గ్గరికి తీసుకెళ్ళాడు.

           డాక్టర్ నవ్వుతూ,” నీ ఇంజినీరింగ్ చదువు కోసం బాగానే నిగ్రహం పాటించాడు మీ ఆయన, ఇంక
అవసరం లేదులే ” అంటూ నవ్వింది.

           శిరీష సిగ్గు పడింది, రాజు పనికి ఆడా, మగ తేడాచూపించడు. వీలున్నప్పుడల్లా అన్నిపనులూ చే
సేస్తాడు. శిరీష కిప్పుడు యే సమస్య లేదు. హాయిగా చదువుకొంటోంది. ఎంట్రన్స్ పరీక్ష రోజు అతని కాళ్ళకు నమస్కరించబోయింది. రాజు వారించి, హృదయా నికి హత్తుకొని, “భాగా రాయి” అన్నాడు. శిరీష పరీక్ష రాసి బయటకు వఛ్ఛేదాకా ఎంతో ఆత్రుతతో వెయిట్  చేసాడు , బయటకు రాగానే రాజును చుట్టేసింది. అతనికి అర్ద్ధమయ్యింది బాగా రాసిందని. 
 
           రిజల్ట్స్ కోసం శిరీష కంటె ఎక్కువ ఎదురుచూశాడు రాజు. 

           శిరీష 312 వ రాంక్ సాధించింది. సరిగ్గా కోచింగ్ ఇప్పిస్తే, I I T సాదించేదేమో అని బాధ కలిగింది
అతనికి. శిరీష సంతోషంతో అతన్ని చుట్టేసి, గంతులేసింది.

           రాజు “నాకు తెలుసు నువ్వు సాధిస్తావని” అంటూ, జేబులో నుండి సన్నని బంగారు నల్లపూసల గొలుసు
తీసి ఆమె మెళ్ళో వేశాడు.

           శిరీష తల్లి సంతోషానికి హద్దులు లేవు. భర్త తన పేరిట వేసిన లక్ష అల్లుడికి ఇవ్వ బోయింది.
 
           ” ఓల్ద్ యేజ్ లో డబ్బు చాలా అవసరం అత్తయ్యా, శిరీష బాద్యత నాది,”అంటూ తిరిగి ఇచ్చేసాడు.

           అంత మంచి రాంక్ సాధించిన  శిరీష అదే వూళ్ళో వున్న కాలేజ్ లో చేరతాననే సరికి, కోపం
వచ్చింది. లెక్చరర్స్ తో, టీచర్స్ తో,  చెప్పించాడు, శిరీష ఒప్పుకోలేదు, హైదరబాద్ లో చేరనని, హాస్టల్ లో వుండనని చెప్పేసింది.
 
           19 యేళ్ళ శిరీష తనని వదిలి వుండలేదని అర్ధమయ్యింది అతనికి, పోనీ సిటీకి వెళ్ళిపోదామంటే దానికీ ఒప్పుకొలేదు. సిటీ అంటె ఖర్చు ఎక్కువ, అందుకే వద్దంటోం దని అర్ధమయ్యింది అతనికి. చెసేదిలేక టౌన్ లొనే బెస్ట్ కాలేజ్ లో చేర్చాడు. అంత మంచి రాంక్ వచ్చిన అమ్మాయి తమ కాలేజ్ లో చేరటం యాజమాన్యానికి చాలానచ్చి ఫీజ్ లో చాలా రాయితీలు ఇచ్చారు. ఇంటి దగ్గిరే కాలేజ్ బస్ స్టాప్. మొదటి రోజు  సాయంత్రం రాజు శిరీష కోసం  యెదురు చూస్తూ స్టొప్  లో నుంచున్నాడు. వెలిగిపోతున్న మొహంతో వచ్చింది శిరీష. ఇంట్లొకి  అడుగుపెడుతూనే రాజుని పెనవేసుకొని యేడ్చే సింది. అది  dream come true వలన వచ్చిన కన్నీళ్ళు. రాజు ఆమె తల నిమిరి ” వెళ్ళు, వెళ్ళీ fresh అయిరా” అన్నాడు ప్రేమగా. “సచ్చే ఆకలిగా వుంది అంటూ వచ్చి, నేలమీద అన్నీ రెడీగా వుండటం చూసి, ” అయ్యో,  వంట  కూడా చెసేశారా” అన్నది గిల్టీగా.
 
           ” శిరీషా, ఒక్కటి గుర్తు పెట్టుకో, మనిద్దరి మధ్య యెటువంటి ఈగో క్లాష్ వద్దు, ఎవరికి వీలైన పని వాళ్ళం చెద్దాం, కనీళ్ళతో తలూపింది శిరీష. టమాట యెగ్ కర్రీ, చారు, పెరుగు , కడుపునిండా తిని, గిన్నెలన్నీ తోమెసి, కిచెన్ శుబ్రం చేసి వచ్చి, అతని ఒళ్ళొ వాలిపొయి పడుకుండి పోయింది.

           ఫస్ట్ year లో నాలుగు గోల్డ్ మెడల్స్ సాద్దించింది శిరీష. మంచి లాప్ టాప్  కొన్నాడు . రాజు పట్ల
రోజు, రోజుకీ అభిమానమూ, అరాధన పెరిగిపొతోంది శిరీషలో. ఎటువంటి కలతలు లేకుండా నాలుగెళ్ళు గడిచి పోయాయి. ఫైనల్ సెమిస్తెర్ లోనే పన్నెండు లక్షల ప్యాకేజితో, ఎమజాన్ లో జాబ్ వచ్చింది శిరీషకి. జాబ్ అన్నా వదులు కుంటుంది  కానీ వొంటరిగా వెళ్ళదని తెలుసు రాజుకి. అందుకే మకాం మార్చారు బెంగుళ్ళూరికి.
 
           వారంలో అయిదు రోజులు శిరీషకి ఆఫీస్ , రాజుకి ఇలా ఖాళీగా వుండటం ఇష్టం లేకపోయింది. .వాళ్ళు
వుండేది ఒక పార్టిషన్  చేసిన హాల్ కంబెడ్ రూమ్, చిన్న వంటిల్లు. వెనక ఖాళీ  జాగా వుంది. బెంగుళూరులో క్యాబ్ నడపటం కంటే ఎలక్ట్రికల్ వర్క్స్ రిపైర్స్ చేయటం బెటర్ అనిపించి అవి చేయటం మొదలెట్టాడు.ఇంటి వాళ్ళ పర్మిషన్ తో    ఆదివారం బిర్యాని తయారు చేసి సేల్ చేయటం మొదలెట్టాడు, శిరీష ఒక యాప్ క్రియేట్  చేసింది, ఎదురుగా వున్న అపార్ట్మెంట్స్  నుండి  చాలా ఆర్డర్స్ రావటం మొదలై రాజు చాలా బిజీ  అయిపోయాడు. 

           శని, ఆదివారాలు అతనికి సాయం చేసేది శిరీష. 

           శిరీష నెల తప్పింది. రాజు అంతా తానై చూసుకున్నాడు. నెలలు నిండేదాకా. సరిగ్గా డెలివరీ ముందు
శారదమ్మ బాత్ రూమ్ లో జారిపడింది. తుంటికి ఆపరేషన్ చేశారు. ఎవరూ రాకపోయినా రాజు శిరీషని ఎంతో జాగ్రత్తగా చూసుకున్నాడు. 

           శిరీషకు బాబు. లీవ్ అయిపోయే సమయానికి కళ్లనీళ్లు పెట్టుకోసాగింది. ఆయాని పెడదామా, కేర్ సెంటర్
లో చేరుద్దామా అంటూ బెంగగా అడగటం మొదలెట్టింది. ఇంకో రెండు రోజుల్లో జాయిన్ అవుతుందనగా , రాజు ఆమె ఆందోళనకి తెరదించాడు. 

           ఇంతవరకు వారంలో అయిదు రోజులు ఎలక్ట్రికల్ వర్క్స్ చేసేవాడు. ఇప్పుడవన్నీ మానేస్తున్నానని
చెప్పాడు

           దేనికి? అర్ధం కాక అడిగింది శిరీష. 

           దేనికేమిటి? బాబుని చూసుకోవద్దా? అయిదు రోజులు నా డ్యూటీ, వీకెండ్స్ నీ డ్యూటీ, వీక్ ఎండ్ లో నా
బిర్యాని బిజినెస్ చేస్తాను, సరేనా!

           శిరీషకు కన్నీళ్లు ఆగలేదు. 

           “పిచ్చిపిల్లా, తల్లిగా నీ కెంత బాధ్యతో నాకు అంతే, పెద్దవాళ్ళను పిలిచి ఈ ఏజ్ లో వాళ్ళని
బాధపెట్టడం దేనికి? ఇంత చదువుకొన్నావు, లక్షలు సంపాదిస్తున్నావు అయినా నువ్వేరోజూ అహకారం చూపలేదు. ధర్మేచ, అర్ధేచ, కామేచ, అంటూ మూడుసార్లు వరుడి చేత “నాతిచరామి” అని అనిపిస్తారు. నాతిచరామికి అర్ధం తెలిసిన వాడెవ్వడూ భార్యని తేలికగా చూడడు, ఏ విషయంలోనూ అవమానించడు నాకు వాడిని చూసుకొనే అదృష్టం వున్నది, వాడిని ఎక్కడా చేర్చటం, ఆయాలకు అప్పగించటం , అస్సలు ఇష్టం లేదు. నువ్వు ఇంటికొచ్చాక , వీలుంటే ఎలక్ట్రికల్ వర్క్స్ చేస్తాను, ..సరేనా! కొడుకుతో సహా శిరీషను దగ్గరకు తీసుకొన్నాడు రాజు.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.