మక్కెన సుబ్బరామయ్య ఫౌండేషన్ సాహితీ పురస్కారాలు 2025
-ఎడిటర్
ఈ క్రింద పేర్కొన్న సాహిత్య పురస్కారాల (11వ) కోసం రాష్ట్రేతర / ఉభయ తెలుగు రాష్ట్రాల రచయితల నుండి 2024 సం॥లో (జనవరి నుండి డిసెంబర్ వరకు) ప్రచురించిన పుస్తకాలను ఆహ్వానిస్తున్నాము.
1) శ్రీ మక్కెన రామ సుబ్బయ్య కధా పురస్కారం
2) ఆచార్య నెల్లుట్ల కవితా పురస్కారం
3) డా॥ కె వి రావు కవితా ప్రక్రియ పురస్కారం
(మినీ కవితలు, గజల్స్, నానీలు, హైకూలు, దీర్ఘకవితలు తదితరములు)
4) సాహితీ పురస్కారం (వ్యాసాలు / సమీక్ష / విమర్శ)
5) బాలసాహిత్య పురస్కారం (కథ, కవిత, గేయ సంపుటులు)
6) విజ్ఞాన / మనోవైజ్ఞానిక పుస్తక పురస్కారం
ఇందుకుగాను రచయితలు తమ పుస్తక ప్రచురణలను మూడేసి (3) ప్రతులను ఈ క్రింది చిరునామాకు ది. 30`01`2025 లోపుగా పంపగలరు. విజేతలు ఒక్కొక్కరికి రూ. 7,000/` నగదు, జ్ఞాపిక, ప్రశంసాపత్రంతో సత్కరించబడెదరు.
పుస్తకాలు పంపవలసిన చిరునామా :
డా॥ మక్కెన శ్రీను, కేరాఫ్ : కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్, గరివిడి,
విజయనగరం జిల్లా`535 101, ఎ.పి. చరవాణి : 98852 19712
****